Wednesday, January 7, 2026

Katuka Gowri Nomu Katha - కాటుక గౌరీ నోము కథ

కాటుక గౌరీ నోము కథ

“ఇరుగు గ్రుడ్డి, పొరుగు గ్రుడ్డి, ఇంటియిల్లాలు గ్రుడ్డి మాయింటి బ్రాహ్మణునకు గ్రుడ్డి” అని విచారించుచు ఒక బ్రాహ్మణుని భార్య కూర్చుండెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై - “ఎమమ్మా! యిలాగు విచారించుచున్నా”నియడిగిరి. అప్పుడు ఆమె "అమ్మా నీవెవరివో తెలిసికొనుటకు నాకు కండ్లు లేవు. గ్రుడ్డిదానను, నన్ను చూచి అందరూ నవ్వుచున్నారు. ఆ బాధలు పడలేక ఇట్లు వచ్చితిని. ఇక్కడకు వచ్చిననూ నీవెవరో నన్ను పరామర్శించుచున్నావు. గ్రుడ్డిదాననగు నాకు సర్వము గ్రుడ్డిదిగనే తోచుచున్నది. 
“ఇరుగు గ్రుడ్డి, పొరుగు గ్రుడ్డి, ఇంటియిల్లాలు గ్రుడ్డి మాయింటి బ్రాహ్మణునకు గ్రుడ్డి” అని యామె చెప్పెను. 

“నీవు క్రిందటి జన్మమున కాటుక గౌరీ నోముపట్టి ఉల్లంఘన చేసినావు. అందుచేత నీకీ లాగు కలిగినది. ఇప్పుడా గౌరీదేవి నోముపట్టి ఏడాది అక్షంతలు వేసుకొని తరువాత యుద్యాపన చేసుకొనమ'”ని చెప్పిరి.

ఆమె ఆ ప్రకారము నోముపట్టి యుద్యాపనము చేసుకోగా అందరికి కన్నులువచ్చి సుఖముగా
నుండిరి.

ఉద్యాపనము: నోముపట్టి ఏడాది అక్షతలు వేసుకొన్న తరువాత ముత్తయిదువు లకు కరకంచు చీరయిచ్చి, కాటుక బరిణయిచ్చి, రవికెలగుడ్డ దక్షణ తాంబూలము ఇవ్వవలయును.

No comments:

Post a Comment