మృగశృంగుని వివాహము
దిలీప మహీజునకు వశిష్ఠులవారు ఇట్లు చెప్పసాగిరి "పువ్వు వికసించగానే వాసన వేయును, అది ఒకరు నేర్పవలసీన అవనరము లేదు, అది ప్రకృతినైజము, ఆ విధముగానే మృగశృంగుడు తన బాల్యదశ నుండియే హారినామస్మరణా యందాసక్తి గలవాడయ్యెను.
అతనికి ఐదుసంవత్సరములు నిండినతరువాత గురుకులములో చదువవేసిరి. అచట సకలశాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్నల నొందుచు పాండిత్యము సంపాదించెను విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రులు యానతిపై దేశాటన చేసి యనేక
పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి యుండెను.
కమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చినతరువాత అతని తల్లిదండ్రులు కన్యనుచూచి వివాహాం చేయుటకు నిశ్చయించినారు, మృగశృంగుడు తాను వరించిన సుశీలనుమాత్రమే వివాహాం చేసుకొనెదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివై భవముగా వివాహము చేసిరి,
సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగునిజూచి "ఆర్యా! మాస్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మాఇద్దరినికూడా ఈశుభలగ్నమున పరిణయమాడుము" అని పలికిరి, మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం, అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా "మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ముకూడ పెండ్లాడుమని అడబడుచులు పటుపట్టినారు.

"మరి పురుషునకు ఒక్క భార్యయేకదా? ఇద్దరు భార్యలా?" అని మృగశృంగుడు ప్రశ్నించగా -
ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవికచా ? దశరధునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ ఇద్దరుగదా? వారికి లేని అభ్యంతరములు నీకు కలవా? అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముటిరి,
మృగశృంగుడేమీ జవాబు చెప్పలేకపోయాడు,
వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా-"మృగశృంగా అభ్యంతరము తెలుపవలదు, ఆ ఇరువురికన్యలయభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖంచిన నీకు జయము గలుగదు, అయినను యిటువంటి ఘటనలు మున్ను అనేకములు జరగియున్నవి అని పలికిరి. పెద్దలందరి యభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ యిరువురు కన్యలనుకూడా వివాహం చేసుకున్నాడు.
ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా మహార్షీ! వివాహము లెన్ని విధములు? వాటి వివరములు "తెలియజేసి నన్ను సంతృప్తుని చేయుడు” అని ప్రార్థించగా - వశిష్ఠులవారు మరల ఇట్లు చెప్పసాగిరి.
రాజా! వివాహము లెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను సావధానుడవై ఆలకింపుము.”
1. బ్రాహ్మాణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు 'బ్రహ్మ' మని పేరు.
2, దైవము: యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును యిచ్చి జేయు "పెండ్లికి 'దైవము' అని పేరు.
3. ఆర్షము :పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని ఆతనికి పెండ్లికూతురు నిచ్చి పెండ్లి చేయు దానిని 'ఆర్షమని' అందురు
4. ప్రాజాపత్యము : ధర్మము కోనం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమనకు 'ప్రాజాపత్యము' అని పేరు.
5. ఆసురము: డబ్బు పుచ్చుకొని కన్యను యిచ్చి వివాహం చేయు దానికి 'ఆసుర' మని పేరు.
6. గాంధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతటవారు చేసుకొను వివాహమునకు 'గాంధర్వ' వివాహమని పేరు.
7. రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని 'రాక్షస' వివాహమని పేరు.
8 పైశాచిక:మోసగించి, అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లిచేసుకొను దానికి 'పైశాచిక’ మని పేరు.
ఈ ఎనిమిది రకములూ వివాహ సంబంధమైన పేర్లు గాన, వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకింపుడు.
గృహస్థాశ్రమ లక్షణములు
మంచి నడవడికతో,ఇహమూ,పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే సరియైన మార్గము.

భార్యయు, భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి జెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిధి సత్కారములాచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకొనేవాడే సరియైన గృహస్థుడనబడును,
నోములు నోచుట, వ్రతములు చేయుట, వర్వదినములలో "ఉపవాసములుండి కార్తీక మాసమందునా మాఘమాసమందునా నదీ స్నానంచేసి, కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించిన వారికి మంచితేజస్సు కలుగును.

ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు దీర్చుకొని, స్నానముచేసి, నిష్టతో భగవంతుని పూజించవలయును. కార్తీక మాసమందు, మాఘ మాసమందు వైశాఖమాసమందు తన శక్తికొలదీ దానధర్మములు చేసినచో గొప్పఫలము కలుగును, గాన ప్రతి మనుజుడూ ఇహసుఖములకే కాకా పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.
పతివ్రతా లక్షణములు
పురుషుడు తనకు సద్గతి కలిగేనిమిత్త మనేక ఘన కార్యములు చేసినకాని మంచిఫలము పొంద లేకపోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తనభర్తను దైవముగా భావించి మనసారా ఆరాధించవలెను.
తన భర్తయొక్క మంచిగుణములనే స్వీకరించవలయునుగాని, అందాన్ని, ఆకారాన్ని చూచి మురిసిపోకూడదు అటులనే పురుషులునూ స్త్రీ యొక్క అందమునే చూడక, శీల గుణమునులెక్కించి ప్రేమతో అదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యాను రాగములతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిధి సేవలయందు కూడ తగు భక్తి శ్రద్ధలతో చేసినయెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును.
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును. పనిపాటలయందు సేవకు రాలి వలెనడుచు కొనవలయును. భోజనము వడ్డించునపుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాముగా భోజనము పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలయును. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందము కలుగ జేయవలెను. రూపంలో లక్ష్మిని బోలియుండ వలెను, ఓర్పు వహించుటలో భూదేవినిబోలియుండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ నడచు కొనునో అమేయే ఉత్తమ స్త్రీ అనబడును.
స్త్రీ బహీష్ఠుఅయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడకూడదు, ఎవరినీ ముట్టుకొనరాదు. ఆనాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవరోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్లుపోసుకొని, శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి, సూర్యభగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయంనందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.
ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందముతో కాలంగడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను,
మృకండుని జననము
ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి యాడితిగదా యని మృగశృంగుడు మిగుల అనందించెను. ఆ ముగ్గురు పడతులతోను నంసారము చేయుచుండెను. అటుల కొంత కాలం జరిగినది సుశీలయను భార్య గర్భముధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న తనకుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణుడు కావలయునని ఆశకలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండుడని నామకరణముచేశారు.

మృకండుడు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులయెడ బంధుజనులయెడ పెద్దలయెడ భయ భక్తులు గలిగి పెరుగుచుండెను ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయం చేసి, విద్య నభ్య సించుటకై గురుకులమునకు పంపించినాడు.
గురుకులములో గురువు చెప్పిన సకలశాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించెను.
మృకండడు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు 'మరుద్వతి' యనుకన్యతో వివాహం చేసిరి. ఆనాటినుండి మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించాను.

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడ పుత్రులు జన్మించి నందున వారికికూడా అన్ని విద్యలు నేర్పిరి.పెద్దవారలయిన తరువాత వివాహములు చేసెను.తన కుటుంబమంతయును మాఘమాసములో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్టతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకొన్న మాఘమాసఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బందియులేకుండా వుండుటేగాక, మృగశృంగునకు మనుమలుకూడా కలిగినందున మరింత యానందించి, తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నదిగదాయని సంతోషించుచు తనకింక ఏ అశలు లేనందున భగవస్సాన్నిధ్యమునకు బోవలయునని సంకల్పించి, తవస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీమహావిష్ణూవుని ప్రసన్నుని జేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమున కేగెను.
“విన్నావుకదా భూపాలా! మృగశృంగుడు తాను చేసుకొన్న మాఘమాస ఫలమువలన తనకు పుత్రపౌతాభివృద్ధి కలుగుటయే గాక బొందెతో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు.
ఇక అతని 'జ్యేష్టకుమూరుడైన మృకండునియొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము” అని వశిష్ఠులవారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు.
మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండీ జ్యేష్టపుత్రుడగు మృకండుడే నంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండ చూచుచుండెను. ఆయన కొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహామాడి చాలకాలం గడిచిననూ సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈ విధముగా తలపోసెను.
"కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హారించుటయేగాక, మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీవిశ్వనాధుని దర్శనము చేసుకొని వారి యభీష్టములను పొందగలిగిరి. గాన నేను నా కుటుంట సమేతముగా వెళ్ళుదును” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను.
మార్గ మధ్యమున అనేక కౄరమృగముల బారినుండి క్రిమి కీటకాల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు.
కాశీపట్టణము నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది.. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ది చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు బయలుదేరివెళ్లాడు.
ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని అనందము కలిగెను, తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భిక్తిశ్రద్ధలతో ప్రార్ధించెను.
ఈ విధంగా కుటుంబసహితంగా మృకండడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును ప్రతిష్టించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణచేసి, దాని కెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించెను. ఆ విధంగా ఒక సంవత్సరము విశ్వేశ్వరసన్నిధానమందు గడవనెంచెను.
ఒక దినము మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే. తెలివి తప్పి ప్రాణములు విడిచిరి.
మృకండుడు చాల దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహాన సంసారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు.
మృకండునకు ఎంత కాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రమునకు వచ్చినాడుగదా! సంతానముకొఱకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి మృకండునకు అతని భార్య మరుధ్వతికి అమితానందము కలిగి, పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికాను.
"మహామునీ! మీభక్తికి యెంతయో సంతసించినారము, మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది, మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినారము, గాన మీ యభీష్టము నెఱిఁగింపుడు" అని పలికెను.

అంత మృకండుడు నమస్కరించి "మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదే మా నమస్కృతులు. లోక రక్షక! మీ దయవలన నాకు సలక్షణవతి. సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందు వలన నేను మిమ్ము ధ్యానించుచు, ఆమెతో సంసారసుఖము అనుభవించుచున్నాను. కాని ఎంత కాలమైననూ మాకు సంతానం కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి ఉత్తమ గతులు లేవుగదా? కావున మాకు పుత్రసంతానము ప్రసాదించ వేడుకొనుచున్నాను" అని పార్వతీ పరమేశ్యరులను ప్రార్థించాడు.
మృకండుని దీనాలావము లాలకించి త్రినేత్రుడిట్లు పలికెను.
"మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది, బ్రతికియున్నంత వరకు వైధవ్యముతో వుండు పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?" అని ప్రశ్నించిరి.

మృకండునకు ఆశ్చర్యముకలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసివచ్చెను. కొంత తడవాగి హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకు
మీ ధ్యానమునే సలుపుచు,సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైదవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని నుడివెను.
"అటులనే యగుగాక” యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యేను.
పరమేశ్యరానుగ్రపామున ఒక శుభ ముహూర్త కాలమున పుత్రుని గనెను, మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ జేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను.
ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడుని భాగవతోత్తముడును, అగుమృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను. తిరిగి బ్రతికించెను.
No comments:
Post a Comment