మాఘ పురాణం - 12 వ అధ్యాయం
పుణ్యక్షేత్రములలో మాఘస్నానము
ఈ విధంగా ననేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నానఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠులవారు వివరించగా-"మహర్షీ! మీ కృపవలన ఆనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని, కాని మరొక సంశయము నాకుగలదు. అది ఏమనగా మాఘమాస మందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ విన్నమ్రుడై కోరగా వశిష్ఠులవారు మరల యిట్లనెను.
దిలీప మహారాజా! మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యముగు తీర్థమహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.
మాఘమాసములో నదీస్నానం ముఖ్యమైనది. మాఘస్నానములు చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనట అవివేకం, ఎందుకు అనగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. అవస్యకమైనది కూడాను.
అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నానమాచరించిన ఏడుజన్నలలోని పాపములు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానములతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్యరాలయములు మొదలగు మూడువందల పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొవ్చ ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.
ఇక త్రయంబకమనునొక ముఖ్యమైన క్షేత్రం కలదు, అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్రగోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అదియును గాక మాఘమాసములో గోదావరియందు స్నానముచేసినయెడల సకలపాపములు తక్షణము హారించిపోవుటయేగాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులుకూడా కలిసి తమతమ స్నేహా సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే 'పరంతప' అను ఉపనది ప్రవహించే చోటకూడ శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము గలదు. ఆ క్షేత్రము బ్రహ్మహాత్యా మహా పాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్రము గలదు. సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు,ఈశ్వరునికి అయిదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేరుకూడా కలదుకదా! బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని అనగా నాకు ఐదు తలలున్నవి. నేనే గొప్పవాడనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్దము చేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హాత్యాపాతకము చుట్టుకొన్నది.
శివుడు భయపడి నరికిన బ్రహ్మాతలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి ఫుర్రిగా అయినది, ఈశ్వరుడు ఆపుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి 'భిక్షాందేహీ' యని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మముకడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక, ఈతనికి పురుషత్వము నశించుగాక"చుగాక అని శపించెను.
ఈశ్వరుడు చేయునదిలేక జారి క్రిందపడిపోయిన ఆ లింగము నందే ఐక్యమైపోయినాడు.
అటుల లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటిసూర్యుల తేజస్సుకలిగి ప్రళయము సంభవించునా? యన్నట్లు భయంకరముగా నుండెను. అవ్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రమునకు వెళ్ళి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు
శివసాన్నిధ్యమును పొందగలుగుచున్నారు,
No comments:
Post a Comment