Monday, January 5, 2026

Nitya Schamgaramu nitya vibhuti Nomu Katha - నిత్యశ్చంగారము (నిత్యవిభూతి) నోము కథ

నిత్యశ్చంగారము (నిత్యవిభూతి) నోము కథ

రాజుభార్య, మంత్రిభార్య నిత్యశ్చంగారము నోముపట్టిరి. రాజు భార్య నౌకరులచేత తాంబూలము బొట్టు పెట్టించుచుండెను. మంత్రిభార్య యట్లుగాక తానే స్వయముగా బొట్టుపెట్టి తాంబూలము నిచ్చుచుండేది. 

ఇలాగున నివ్వగా నీమెకు కడుభాగ్య మబ్బినది. రాజు భార్యకు అశ్రద్ధగా నివ్వడముచేత దరిద్రము సంభవించెను. అందువలన నామె యొకనాడు మిక్కిలి దుఃఖించుచు కూర్చుండెను. ఇట్లుండగా పార్వతీపరమేశ్వరులామెకు ప్రత్యక్షమై 'ఎందుకేడ్చు చున్నావమ్మా?” యని యడిగిరి.  "మంత్రిభార్యయు నేను నోము పట్టినాము. ఆమెకు భాగ్యము వచ్చినది. నాకు దరిద్రము వచ్చినది. ఎందుచేత నాకీ దరిద్రము వచ్చినదో తెలియక దుఃఖించుచున్నాను" అని యామె చెప్పెను. నీవు దాసీ జనంబుచే వ్రతకృత్యమును జరిపించినావు అందుచేత నీకు దరిద్రము వచ్చినది. మంత్రిభార్య నీవలెగాక తానే స్వయముగా చేయుటచేత నామెకు భాగ్యము లభించెను. శ్రద్దగా తిరిగి యీ నోముపట్టి కథ చెప్పుకొని అక్షతలు వేసికొని ఏడాది పొడుగునా తాంబూలమిచ్చుకుంటే సిరిసంపద నీకు వచ్చునని చెప్పి ఆ పురాతన దంపతులదృశ్యులైరి. 

అప్పుడీ నోముపట్టి ఏడాది కథచెప్పుకొని అక్షతలు శ్రద్ధగా వేసుకొని రోజును ముత్తయిదువులకు బొట్టుపెట్టి తాంబూలమిచ్చి అద్దము, దువ్వెన జూపించి ఏడాది అయిన తరువాత నామె యుద్యాపనము చేసికొని సిరిసంపదలను బడసెను.

ఉద్యాపనము : ఒక ముత్తయిదువునకు తలంటి నీళ్లుపోసి చీర, రవిక యిచ్చి భోజనము పెట్టి బొట్టుపెట్టి అద్దము, దువ్వెన, కాటుక కాయ, కుంకుమభరిణీ, సవరము, గంధపుచెక్కయిచ్చి యుద్యాపనము చేసుకొనవలెను.

No comments:

Post a Comment