వైజయంతి పుష్ప మాల (వనమాలికా)
శ్రీ కృష్ణునకు లేదా శ్రీ మహావిష్ణువుకు “వనమాలికా విరాజమానుడు” అని నామం కలదు. వనమాలికా అనే పుష్ప మాలను సదా ధరించటం వల్లనే విష్ణువు “వనమాలి అయినాడు. ఈ వనమాలయే వైజయంతి. వైజయంతీ పుష్పమాల ధర్మ సంజ్ఞకం. అది విజయానికి కారణం. 'యతో ధర్మ స్తతో జయః' అను ప్రమాణాన్నిబట్టి ధర్మంకూడా జయహేతువే. వైజయంతీ పరిమళ వాయువు చామరంతో వ్యాపిస్తుంది. చామరాన్ని వీవటంచేత తాపం అణగిపోతుంది. అధర్మంనుండి పుట్టిన తాపం ధర్మంవల్ల సమసిపోతుంది. ఇట బాణాగ్ని అణగారుటకు, దాని తాపం చల్లారుటకు గద వైెజయంతీమాలలు పేర్కొనబడినవి. అవి అంగుష్టమాత్ర దేహునికి ఆభరణాలుగా అగుపించినా, శత్రుసంహారంలో, తాపం చల్లార్చటంలో ఎంతటి మహత్తరప్రయోజనాన్ని సాధించినాయో నిశిత పరిశీలన వలన నిరూపింపబడ్డాయి.
No comments:
Post a Comment