Friday, March 20, 2026

Good and Bad Omens - శుభాశుభ శకునాలు

శుభాశుభ శకునాలు

అవయవాల స్పందన శుభాశుభ ఫలితాలు

వీపుమీద, హృదయానికి కుడివైపున గానీ అదిరితే శుభం జరుగుతుంది. అదే ఎడమవైపు అదిరితే అశుభం. కుడివైపున అదిరితే భూలాభం. నుదుటిమీద స్థానవృద్ధి, కనుబొమల మధ్య ప్రియమైన వారితో సంగమం, కళ్ళ ప్రక్కన అదిరితే సేవకులతో లాభం, కంటికొనల దగ్గర-ధనప్రాప్తి, నడుముమీద - తత్తరపాటు, కంటికొలకుల దగ్గర అదిరితే -యుద్ధంలో విజయం, కంటిచివర-
స్త్రీ సుఖం, చెవికొనలో ప్రియవార్తాశ్రవణం. ముక్కు మీద అదిరితే -సౌఖ్యం. పెదవులమీద స్త్రీ లాభం, కంఠంమీద - భోగం, భుజాలమూలల్లో -భోగవ్చద్ధి, భుజాల మీద - మిత్రులతో స్నేహలాభం, చేతుల మీద అదిరితే - ధనాగమం, వీపుమీద-పరాజయం, వక్షస్థలం మదల సద్యోజయం, కడుపుమీద - ప్రీతి, స్త్రీలకి స్తనాలపైన అదిరితే-సంతాన ప్రాప్తి, నాభిప్రదేశం మీద - స్థాన భ్రంశం,
జఘన భాగంలో అదిరితే-ధనాగమం, మోకాళ్ళ సందుల్లో-బలవంతులతో సంధి జరుగుతుంది. అరికాళ్ళలో అదిరితే-ధనకారకమైన ప్రయాణం కలుగుతుంది.

గుహ్యావయావాలలో స్పందన కలిగితే - బొబ్బలు, పుండ్లు పుడతాయి, పాదాలలో అదిరితే - ఉత్తమ స్థాన ప్రాప్తి, కలుగుతుంది. ఇక్కడ చెప్పినవన్నీ స్త్రీలకి ఎడమవైపు, పురుషులకు కుడివైపు స్పందనలు కలిగితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవిగాక మిగిలిన అవయవాల స్పందన ఫలితాలని దైవజ్ఞుల ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ స్పందనలతో పాటు అరిష్ట చిహ్నాలు కూడా
కనిపిస్తే బ్రాహ్మణులకి సంతర్పణ, సువర్ణ దానం చేయాలి.

స్వప్న ఫలితాలు

దుఃస్వప్నాలు :
 ఒకబొడ్డు మీద తప్ప శరీరంలోని ఇతర అవయవాల మీద గడ్డి, చెట్లు మొలవటం, తలమీద కంచు పాత్రపడి పగలటం, తలబోడిదైపోవడం, నగ్నంగా వుండటం, మలినమైన వస్త్రాలు ధరించటం, నూనెతో తలంటుకోవటం, బురదని వంటికి పూసుకోవటం, ఎత్తునుంచి క్రిందకి పడటం, ఉయ్యాలని ఎక్కటం, ఉడికించిన మాంసాన్ని తెచ్చుకోవటం, గుర్రాలని చంపటం, ఎర్రని పూల చెట్లని ముద్దుపెట్టుకోవటం, పందుల్ని ఎలుగు బంట్లని, గాడిద
ల్ని
ఒంటెల్ని ఎక్కటం, ఉడికిన మాంసాన్ని తైలాన్ని ఫలాన్ని తినటం, నర్తించటం, నవ్వటం, పెండ్లి జరిగే సన్నివేశం, తీగల్లేని వాద్యాల్ని మ్రోగించటం, నదిలో స్నానం చేయకపోవటం, ఆవుపేడతో, బురదనీళ్ళతో, మట్టితో కలిసిన నీళ్ళతో స్నానం చేయటం, మాతృగర్భంలోకి ప్రవేశించటం, చితిమీద ఎక్కటం, ఇంద్రధ్వజం నేల మీదపడటం, సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలో
ఉత్పాతాలు కనిపించటం.

దేవతలు, విప్రులు, రాజులు, గురువులు కోపించటం, కన్యలు కౌగిలించుకోవటం, పురుషులతో సంభోగించటం, తన అవయవాలకు హాని కలగటం, అనగా విరగటం, వాంతి అవటం, దక్షిణ దిశగా ప్రయాణం చేయటం, వ్యాధి రావటం, పళ్ళు రాలటం, పూలురాలటం, ఇళ్ళు పడిపోవటం, ఇళ్ళని
ఊడ్చటం, పిశాచాలతో, మాంసాహార ప్రాణులతో, వానరులతో, ఎలుగుబంట్లతో ఆడుకోవటం, ఇతరుల వల్ల అవమానించబడటం, వ్యసనాలు కలగటం, కాషాయవస్త్రాలు ధరించినట్టు కనబడటం, స్త్రీలు క్రీడించినట్టు కనిపించటం, నూనె త్రాగటం, నూనెతో స్నానం చేయటం, ఎర్రని పూలని ధరించటం, ఎర్రగంధాన్ని పూసుకోవటం.

పై తెలిపిన వన్నీ దుస్వప్నాలు. ఈ స్వప్నాలు గనుక వస్తే వాటిని ఇతరులకి చెప్పకూడదు. స్వప్నం వచ్చిన మర్నాడు ఓషథీచూర్ణంతో స్నానం చేసి తిలలతో హోమ, బ్రాహ్మణ పూజ వాసుదేవుడి స్తుతి చేసి గజేంద్ర మోక్షం కథని శ్రవణం చేయాలి. ఆవిధంగా చేస్తే దుఃస్వప్న దోష పరిహారం జరుగుతుంది.

స్వప్న ఫలితం : రాత్రిపూట మొదటియామంలో వచ్చిన స్వప్నాలు ఒక సంవృతరానికి, రెండో యామంలో వచ్చిన స్వప్నాలు 6 నెలలు వరకు, మూడవ యామంలో వచ్చినవి 3 నెలలకి నాలుగో యామంలో వచ్చిన కలలు 1 నెలకి అరుణోదయ సమయంలో వచ్చిన స్వప్నాలు ఒక వారానికి ఫలిస్తాయి.

శుభస్వప్నాలు : పర్వతాలని, మేడల్ని ఎనుగుల్ని గుర్రాల్ని వృషభాల్ని అధిరోహించటం, తెల్లపూలుపూసే చెట్టుని ఎక్కటం తన నాభి (బొడ్డు) మీద వృక్షాలు, గడ్డి మొలవటం, తనకి ఎన్నో తలలు పుట్టటం, ఎన్నో చేతులు ఏర్పడటం, జుట్టు నెరియటం, తెల్లని వస్త్రాలని, మూలల్ని ధరించటం, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, తారల్ని అందుకోవటం, భూమిని సముద్రాన్ని మింగటం, శత్రువుల్ని వధించటం, పచ్చిమాంసాన్ని, చేపల్ని పాయసాన్ని భుజించటం, ప్రేగుల్ని 
చుట్టుకుని నేలపై పడి దొర్లటం, ఆకాశం నిర్మలంగా వున్నట్టు కనిపించటం, దేవతలు, విప్రులు, గురువుల నుంచి అనుగ్రహాన్ని పొందటం, గోశృంగం నుంచి, చంద్రుడి నుంచి కారే నీళ్ళలో స్నానం చేయటం, రాజలాంఛనాలు లభించటం, తంత్రీవాద్యాలు మ్రోగించటం, సంకెళ్ళతో బంధించబడటం, మలాన్ని పూసుకోవటం, ఇళ్ళు తగలబడటం, రాజుల్ని దర్శించటం, 
దేవతామూర్తుల్ని, పవిత్రమైన జలాన్ని చూడటం ఇవన్నీ శుభస్వప్పాలు.

ఈ శుభస్వప్నాల వల్ల అప్రయత్నంగా ధనం లభించటం, రోగులకి రోగవిముక్తి జరగటం అనే శుభఫలితాలు కలుగుతాయి.

శుభాశుభ శకునాలు

అశుభశకునాలు : నల్లనిధాన్యం, దూది, ఎండుగడ్డి, ఎండుపేడ, కట్టెలు, బొగ్గులు, నూనె, బెల్లం, నూనె అంటుకున్న బోడితల, నగ్నంగా వున్నవాడు, జుట్టులేనివాడు, రోగార్తుడు, కాషాయాంబరధారి, ఉన్నత్తుడు, బలహీనుడు, దీనుడు, నపుంసకుడు, ఇనుము, బురద, కేశాలకట్ట, చర్మం, తెలకపిండి, సారంతీసేసిన పదార్థాలు, ఛండాలుడు, కారాగార రక్షకులు, కసాయివాడు,
గర్భిణీస్త్రీలు, ధాన్యంపొట్టు, భస్మం, కపాలం, ఎముకలు, పగిలిన పాత్రలు, కందులు, ఎర్రని పాత్రలు, కుండలు, అమంగళకర వాద్యాలు, భయంకరమైన ధ్వనులు అశుభశకునాలు.

ఎక్కడికి వెళుతున్నావు? ఆగు? వెళ్ళవద్దు? అనే మాటలు అశుభాన్నిస్తాయి. ధ్వజం మీద మాంసాహార పక్షులువాలటం, వాహనాలు తడబడటం, వస్త్రాలు జారిపోవటం, ద్వారానికి తలడీకొనటం, కాళ్ళకి ఎదురుదెబ్బలు తగలటం, ఛత్రం, ధ్వజం, వస్త్రం క్రిందపడటం అశుభాలు. ఇవి మొదటి సారి జరిగినప్పుడు నారాయణుణ్ణి స్తుతించటం అర్చించటం చేయాలి. రెండోసారికూడా జరిగితే ప్రయాణం మానుకుని ఇంట్లో కూర్చోవాలి.

శుభశకునాలు : తెల్లనిపూలు, పూర్ణకుంభాలు, జలపక్షులు, మాంసం, చేపలు, ఆవులు, అశ్వాలు, ఏనుగులు, ఒంటరి బౌద్ధసన్యాసి, సాధుజీవి, మేక, దేవతలు, విప్రులు, మండుతున్న అగ్ని, వేశ్య, దర్భలు, పచ్చి గోధుమలు, వెండి, రాగి, బంగారం, రత్నాలు, తెల్లని ఆవాలు, మనుషులు మోసే పల్లకి, మట్టీ, ఆయుధాలు, రాజలాంఛనాలు. నేయి, పెరుగు, పాలు, ఫలాలు, మంగళకరమైన
వాద్యధ్వని, సంగీతనాద్యాలు ఇవన్నీ శుభశకునాలు.

మత్స్యవురాణం ఫలశ్రుతి

మత్స్య పురాణము

No comments:

Post a Comment