విష్ణువుకి ఇష్టమైన పూలు
అహింసా ప్రథమం పుష్పం! పుష్ప మింద్రియనిగ్రహః!
సర్వభూతదయా పుష్పం! క్షమా పుష్పం విశేషతః!
శాంతిపుష్పం తపః పుష్పం! ద్యానపుష్పం తధైవచ!
సత్య మష్టవిధం పుష్పం! విష్ణోః ప్రీతికరం భవేత్!!
1.అహింసా పుష్పం : ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.
2.ఇంద్రియ నిగ్రహం: చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం.
3.దయ: కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ. ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.
4.క్షమ: ఎవరైనా మనకి అపకారం చేసినా, ఓర్పుతో సహించడమే క్షమ. ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.
5.ధ్యానం: ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవునికి అందించే ఐదో పుష్పం.
6.తపస్సు: మానసిక (మనస్సు), వాచిక (మాట), కాయక (శరీరం)లకు నియమాలు ఉండడం తపస్సు. ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.
7.జ్ఞానం: పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది దేవునికి అర్చించాల్సిన ఏడవ పుష్పం.
8.సత్యం: ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
No comments:
Post a Comment