అష్టగణపతి క్షేత్రాలు
1. మయూరేశ్వర గణపతి - పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న 'మోరగావ్'లో "మయూరేశ్వర గణపతి" ఆలయం ఉంది.
2. చింతామణి గణపతి - పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న 'థేపూర్' లో "చింతామణి గణపతి" క్షేత్రం.
3.గిరిజాత్మజ గణపతి - పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న 'లేహ్యాద్రి' అనే స్థలంలో "గిరిజాత్మజ గణపతి" క్షేత్రం వెలిసింది.
4. శ్రీ విఘ్నేశ్వర గణపతి - లేహ్యాద్రి సమీపంలోనే 'ఓఝల్' స్థలంలో 'శ్రీవిఘ్నేశ్వర' క్షేత్రం వెలిసింది.
5. మహోత్కట గణపతి - పునానుండి 32 మైళ్ళ దూరంలో ''రాజన్గావ్''లో "మహోత్కట గణపతి" ఆలయం ఉంది.
6. భల్లాలేశ్వర గణపతి - మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో 'పాలీ' అనేచోట "భల్లాలేశ్వర గణపతి" క్షేత్రం ఉంది.
7. వరదవినాయకుడు - కులాబాజిల్లాలో ''మహర్'' అనే స్థలంలో ''వరదవినాయక'' ఆలయం ఉంది.
8. సిద్ధివినాయకుడు - అహ్మద్ నగర్ జిల్లాలో ''సిద్ధటేక్'' అనే స్థలంలో "సిద్ధివినాయక" క్షేత్రం వెలిసింది.
No comments:
Post a Comment