Sunday, February 19, 2023

Samasya parishkaralu - సమస్యలు-పరిష్కారములు

సమస్యలు-పరిష్కారములు

బాలారిష్ట దోషాలు

బాలారిష్ట దోషాలు తొలగటానికి ప్రతీ మంగళవారం పచ్చిపాలను పదకొండు సార్లు దిగ దుడుస్తూ ఆ పాలను నల్లని కుక్కకు పోయాలి. ఇలా పదకొండు లేక 21 రోజులు పోస్తుంటే బిడ్డకు బాలారిష్ట దోషాలు పోయి ఆరోగ్యం గా ఉంటారు.

ప్రేమ వివాహానికి

ప్రేమ వివాహానికి ప్రేమ వివాహం కావాలంటే జన్మ నక్షత్రం రోజు లక్ష్మీనారాయణ పోటో ఒకటి తీసుకుని ఉదయాన్నే స్నానం చేసి పూజ మందిరంలో ఆ పోటో ఉంచి ఓం లక్ష్మీనారాయణ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఆలా ప్రతీ రోజూ చేయాలి. ప్రతీ గురువారం దేవాలయం లో మాత్రం శనగపిండి తో చేసిన తీపి పదార్థాలు భక్తులకు పంచుతూ ఉండాలి.

మీ ఇంట్లో పక్షులు త్రాగడానికి వీలుగా ఒక తొట్టెలో గానీ ఒక పాత్రలో గానీ నీటిని నింపండి. ఇలా రోజూ చేస్తుంటే కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది.

ఇంట్లో పెంచరాని వృక్షాలను పెంచినా దేవతా వృక్షాలను చెడు తిథి, నక్షత్రాలలో కొట్టేసినా ఆ ఇంట్లో నివశించే వారు మనఃశ్శాంతి కోల్పోతారు.

నిత్యం భోజనం చేసే ముందు మీ పూర్వీకులను స్మరించడం వలన పితృదేవతల ఋణం తీర్చుకున్నట్లు అవుతుంది.

ప్రతి రోజూ పక్షులకు పెసరు గుళ్ళను కొద్దిగా అన్నం వేయడం వలన విద్యార్థులకు విద్య అబ్బుతుంది. గృహస్తులు ఈ విధంగా చేయడం వలన సంతానంతో సఖ్యత కలుగుతుంది. సంతానం ఉన్నత స్థితి పొందుతారు.

గోధుమ రంగు గోవుకు గరికె లేక నవధాన్యాలు పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

వేయి ఎకరాల భూదానం చేస్తే లభించే ఫలం ఒక్క గోదానం తో సిద్ధిస్తుంది.

గర్భవతులు అయిన స్త్రీలు ప్రతీ రోజూ షష్టీ దేవిని స్మరించడం మంచిది.

ఉపదేశం పొందిన మంత్రాలను ఎప్పుడూ తూర్పు అభిముఖంగా కూర్చుని జపం చేయడం మంచిది.

ప్రతీ అమావాస్య రోజు కాళీ, దుర్గా,భైరవి, చంఢి వంటి ఉగ్రదేవతలను దర్శించుకోవడం వలన ఇతరులు మీకు చాలా సులభంగా వశం అవుతారు.

ప్రతీ రోజూ మీరు నివశించే గృహానికి దగ్గరలో ఏ దేవత దేవాలయం ఉన్నా ఆ దైవాన్ని దర్శించుకోవడం వలన మీకు స్థాన బలం ఏర్పడుతుంది.

108 రోజులు ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత శివునికి అభిషేకం చేయించుకోవడం వలన విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఎటువంటి ఒత్తిడి గానీ సమస్యలు కానీ కలుగవు. కుటుంబ పరమైన, భాగస్వామ్య వ్యాపార సమస్యలు, ఇతరుల వలన వచ్చే ఇబ్బందులు నాశనం అవుతాయి.

లక్ష్మి అనుగ్రహం కావాలంటే బుధవారం, గురువారం లలో అష్ట గణపతులను,అష్ట లక్ష్మీలను కలిపి పూజించడం వలన తొందరగా ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...