Thursday, January 19, 2023

Gotras and Pravaras - గోత్రాలు మరియు వాటి ప్రవరలు

 1.భరద్వాజ : ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య

2.వాథూలస : భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య

3.శ్రీవస్త లేక శ్రీవత్స : భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య

4.శ్యాలంకాయన : విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య

5. షతమర్షన: ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య

6. ఆత్రేయ: ఆత్రేయ, ఆర్చనాస, శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య

7. కౌషిక: విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య

8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)
A. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య
B. ఖలభవస: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య

9. విశ్వామిత్ర: విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర గోత్రస్య

10. కౌండిన్య: వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య

11. హరితస: ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య

12. గౌతమస : ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమససప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య

13.ఔద్గల్య (మూడు రకాలు)
A. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య
B. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య
C. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య

14. శందిల్య (మూడు రకాలు)
A. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
B. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
C. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య

15. నైత్రువకాశ్యప: కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య

16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య

17. కన్వ (రెండు రకాలు)
A. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య
B. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య

18. పరాసర: వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య

19. అగస్త్య: అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య

20. ఘర్గి (రెండు రకాలు)
A. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య
B. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య

21. బాదరాయణ: ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య

22. కశ్యప (మూడు రకాలు)
A. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
B. కాశ్యప, ఆవత్సార, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
C. కాశ్యప, ఆవత్సార, నైత్రువ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య

23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)
A. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య
B. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య

24. ఆంగీరస : ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య

25. గౌతం/గౌతమస : అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య

26. అగ్నివైవశ్వత: ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య

27. శాంఖ్యాయన: విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య

28. విశ్వామిత్ర: శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర

29. కపి: ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య.
30.ఆర్షతేసన : భార్గవచ్యవనఆప్నవాన, ఆర్షతేసన, అనూప పంచా ఋషేయ ప్రవరాణ్విత ఆర్షతేసన గోత్రస్య
31. ఆత్రేయస: ఆత్రేయ, ఆర్చనాస, స్యావాస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయస గోత్రస్య
32. భార్గవస: భార్గవ, త్వష్ట, విశ్వరూప త్రయా ఋషేయ ప్రవరాణ్విత భార్గవస గోత్రస్య
33. బైడాస : భార్గవచ్యవనఆప్నవానఆర్వబైడా పంచా ఋషేయ ప్రవరాణ్విత బైడాస  గోత్రస్య
34. చికితస : విశ్వామిత్ర, దేవరత, అఘమర్షణ త్రయా ఋషేయ ప్రవరాణ్విత చికితస గోత్రస్య
35. దేవరతస/దైవరతస  : విశ్వామిత్ర, దేవరత, అవుదాలా త్రయా ఋషేయ ప్రవరాణ్విత దేవరతస గోత్రస్య
36.ధన్వంతరి: ఆంగీరస, భార్హస్పత్స్య, ఆవత్సరనైత్రువ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత ధన్వంతరి 
     గోత్రస్య
37. 

Saturday, November 26, 2022

LAKSHMI DEVI MULA MANTRAS - లక్ష్మీదేవి మూల మంత్రాలు

లక్ష్మీదేవి మూల మంత్రాలు

లక్ష్మీ బీజమంత్రం 1

'శ్రీం’
లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమంత్రం శ్రీం. దీన్నే స్విచ్ పదంగా కూడా వాడతారు. స్విచ్ పదం అంటే శక్తిని ఒక స్థాయినుండి మరొక స్థాయికి మార్చగలదు. క్లీం, హ్రీం, క్రీం ఇవన్నీ స్విచ్ పదాలకి ఉదాహరణలు. ఇవేవీ శ్రీం అంత శక్తివంతం కాదు.

లక్ష్మీ బీజమంత్రం 2

॥ ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః ॥

ఇది శ్రీం ని వాడే పూర్తి బీజమంత్రం.

లక్ష్మీ బీజమంత్రం 3

॥ ఓం శ్రింగ్ శ్రియే నమః ॥

ఇది మరొక బీజమంత్రం. తేడా ఏంటంటే ఇందులో శ్రీం శబ్దం లేదు.

లక్ష్మీ మంత్రం ఓం హ్రింగ్ శ్రింగ్ క్రీంగ్ శ్రింగ్ క్రీంగ్ క్లింగ్ శ్రింగ్ మహాలక్ష్మి మం గృహే ధనం పూరే పూరే చింతయై దూరే దూరే స్వాహా ॥

ఈ మంత్రాన్ని ఆఫీసుకి లేదా పనిచేసే చోటకి వెళ్ళేముందు జపించాలి. ఇది అన్ని చింతలను దూరం చేసి మీ ఇంటిని సకల సంపదలతో నింపేస్తుంది.

లక్ష్మీ గాయత్రి మంత్రం

॥ ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం ॥



1. ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

2. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.

3. ఓం శ్రీం శ్రీ అయే నమ: మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.

4. ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే... తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.

5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః

6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ:

అనే శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్ర బీజ మంత్రం. దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్ఛరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట.


7. ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా। మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం..

ఈ మహాలక్ష్మి మంత్రం చెడును అంతం చేసి సుఖసంతోషాలను కలగజేస్తుంది.


8. ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః

ఏకాదశాక్షర సిద్ధి మంత్రం వల్ల సిద్ధి పొందుతారు.

మహాలక్ష్మీ ముల్లోకాలలో పూజించబడుతుంది. శ్రీమహావిష్ణువు పట్టమహిషి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్య. మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు. పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు. జపమాల కానీ, స్ఫటిక మాలతో మంత్రపఠనాన్ని గావించాలి.

శబరిమల ఆలయ ప్రారంభ తేదీలు

శబరిమల

శబరిమల సన్నిదానం

2025 - శబరిమల ఆలయ ప్రారంభ తేదీలు

1.  మకర విలక్కు పూజా మహోత్సవం-తిరునాడ ప్రారంభం - 14-01-2025 సాయంత్రం 5గం. నుండి 20-01-2025 రాత్రి 10గం. వరకు 

2.   నెలవారీ పూజ (కుంభం) - 12-02-2025 సాయంత్రం 5గం నుండి 17-02-2025 రాత్రి 10గం. వరకు

3.    నెలవారీ పూజ (మీనం) - 14-03-2025 సాయంత్రం 5గం నుండి 19-03-2025 రాత్రి 10గం.వరకు

4.    శబరిమల పండుగ - తిరు ఉల్సవం = 01-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం 

5.     శబరిమల కోడియెట్టు -02-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

6.     మేడ విషు పండుగ - 10-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

7.     ఫణిగుణి ఉతిరం మహోత్సవం &ఆరట్టు -11-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

8.     మేడ విషు పూజా -14-04-2025 సాయంత్రం 5గం నుండి 18-04-2025 రాత్రి 10గం.వరకు

9.    నెలవారీ పూజ (ఏడవం) - 14-05-2025 సాయంత్రం 5గం నుండి 19-05-2025 రాత్రి 10గం. వరకు

10.    విగ్రహ ప్రతిష్ట దినం - 04-06-2025 సాయంత్రం 5గం నుండి 05-06-2025 రాత్రి 10గం. వరకు

11. నెలవారీ పూజ (మిథునం) -14-06-2025 సాయంత్రం 5గం నుండి 19-06-2023 రాత్రి 10గం.వరకు

12. నెలవారీ పూజ (కర్కిడకం)-16-07-2025 సాయంత్రం 5గం నుండి 21-07-2025 రాత్రి 10గం. వరకు

13. నెలవారీ పూజ (చింగం) -16-08-2025 సాయంత్రం 5గం నుండి 21-08-2025 రాత్రి 10గం. వరకు

14. ఓనం పూజ -03-09-2025 సాయంత్రం 5గం నుండి 07-09-2025 రాత్రి 10గం. వరకు

15. నెలవారీ పూజ (కన్ని) -16-09-2025 సాయంత్రం 5గం నుండి 21-09-2025 రాత్రి 10గం. వరకు

16. నెలవారీ పూజ (తులం)- 17-10-2025 సాయంత్రం 5గం నుండి 22-10-2025 రాత్రి 10గం. వరకు

17. శ్రీ చితిర అట్ట తిరుణాల్ పూజ - 20-10-2025 సాయంత్రం 5గం నుండి 21-10-2025 రాత్రి 10గం. వరకు

18. మండల పూజ మహోత్సవం-16-11-2025 సాయంత్రం 5గం నుండి 27-12-2025 రాత్రి 10గం. వరకు

19. మకర విలక్కు పూజా మహోత్సవం -తిరునాడ ప్రారంభం-30-12-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

Tuesday, September 13, 2022

AGNI MANTRAM - అగ్ని మంత్రం


అగ్ని విరక్తి మంత్రం

ॐ అగ్నియే స్వాహా. ఇదమ్ అగ్నయే ఇదమ్ న మమ
(ఇది అగ్ని కోసం, ఇది నా కోసం కాదు)
అగ్ని గాయత్రీ మంత్రం
ॐ మహాజ్వలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ ll



అగ్ని స్తంభన మంత్రం

(ఓం నమో అగ్నిరూపాయ మమశరీరే స్తంభనం కురు కురు స్వాహా )



అగ్ని స్తంభన తంత్రం

1. మాండుకీ వసను కలబంద రసంలో నూరి శరీరానికి పూసుకున్నా

2. జిల్లేడుపాలు కలబంద రసంలో కలిపి శరీరానికి రాసుకున్నా

3.అరటిపట్ట రసం కలబంద రసం కలిపి శరీరానికి పూసుకున్నా

4. వస, కర్పూరం కలిపి చూర్ణము చేసి శరీరానికి పూసుకున్నా

5. కలబంద దుంప, అరటి దుంప కలిపి నూరి శరీరానికి పూసుకున్నా

6. పిప్పలి, మిరియాలు, శొంఠి, వేపి పొడిచేసి పొడితిని పంచదార కలిపిన పాలు త్రాగినా

7. శొంఠిని బాగా నమిలి తిని పాలు త్రాగినా

ఇందులో ఏ ఒక్కటి చేసినా అగ్ని స్తంభన సిద్ధిస్తుంది

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....