Friday, January 9, 2026

Annamu Muttani Nomu Katha - అన్నము ముట్టని నోము కథ

అన్నము ముట్టని నోము కథ

కైలాసగిరిమీద గంగాధరులను పార్వతి వేడుకొని పలికెనొక పలుకు, 
నెలనెల ఈ  నిష్టనియమంబుగాను కాంతులు దూరమై కడనుండటేమి?” అని పార్వతమ్మ హరుడు సమ్మతిని చెప్పె నీ కథ నిట్లు చిత్రముగాను వృత్తాసురుని జంపి సుత్రాము డపుడు బ్రహ్మహత్యాదోషాన బాధపడుచుండె, బ్రహ్మహత్యాదోషాన బాధపడలేక ఇంద్రుడు యజ్ఞంబులెన్నేని చేసి, శ్రీమహావిష్ణువునిచేరి ప్రార్థింపనెంచిరి బ్రహ్మహత్యా భాగాలుకాను, మొదటి భాగంబు భూదేవికిచ్చె, రెండవభాగమ్ము వృక్షాలకిచ్చె మూడవ భాగంబు ముక్తినొందింప జగములకిత్తుమని జగధీశుండనెను. నాలుగవ  భాగమ్ము నాతులకిచ్చె, కాంతలదూరమై కడచుందురిదియె. ఆ గంటు గలుపు వారువ్వరికైన పాపము దేహాల ప్రత్యక్షమగును. శ్రీ గజపతి నిన్ను చిత్తానదలతు తలచెదను
మొక్కెదను దేవా! నాధ ఈశ్వరపుత్రుడు నేకదంతుడు వాక్సుద్దిగాను వరమప్పుడొసగె.

శోభిలగుచున్న సూర్యభగవానుడు పాదాల పూజించి, పైడిపుష్పాల పంచనవరత్నాల బంగారుపూని, భక్తితో పూజించి, బాలభాస్మరుల పునుగు జవ్వాది చందనము, కస్తూరి పరిమళ గంధాన శక్తితో పూజించి ఈరీతిగా పూజలెల్లకాలమ్ము ముగుదుల చేయవలె మూడువేళలలను ప్రజలసంరక్షణకు బాలభాస్మరుల వనితలకు దానొక్క వ్రతము గావించెను. పణతులకు దానొక్క పాటగావించెదరమీద వెలయ గా పణతులు పాడ అన్నము ముట్టని యాదివారమ్ము వ్రత మొక్కవిధముగా వర్ణించి చెప్పె.

వేదశాస్త్రంబులకు విప్రుండు తాను, అఖిలగుణసంపన్నుడా సౌమయాజు పుత్రుడు లేడుగురును, పుత్రికలిద్దరును శృంగారపుత్రిక చిన్న కుమార్తె అంగవతానుండె నత్తవారింట అమావాస్య పున్నముల విడవకుండ భాండవదూరమై పతికడనుండు నట్టి కష్టంబు తా నతివ పొందుచును తనయ లజ్జంచి తన తండ్రి కెరిగించె. ముద్దు కూతురను గాంచి మోహమున తండ్రి చింతించి తనయకు జెప్పెను. నొక బుద్ధి అమావాస్య పూర్ణిమ లంటబనిలేదు. పున్నమునెలజేసి పొలతికడనుండి ఆ తండ్రి పల్కులకు నతివ హర్షించి ఉల్లాసముపొంగె. నుత్ఫలగంధి తండ్రి వాక్యముబట్టి తానడుపుచుండె. నింతికి దేహంబు వింతయైదోచె పాపము దేహాన ప్రత్యక్షమాయె. అతివ తనయతిండి నతిక్లేశపడుచు నెటులో దినములు నెట్టుచుండగను తండ్రిని దోడ్కొనివచ్చె. తల్లిని పోషించె. చెప్పిన పాపాలు చెవిని పడవాయె. అధికరోగిష్టాయె. నా సోమయాజి పూర్వజన్మము నందు పుణ్యముచేసి ఈలోకమందు దాని జన్మమందు బాలభాస్మరులకు భక్తుడైయుండె. వచ్చి సూర్యాకృతికి వందనముచేసి చెప్పి. వృత్తాంతమ్ము చిత్తగింపగ శరణన్నవారిని గరుణ చేకొంద్రు. మమ్ము రక్షింతురని నమ్మితినిదేవ అజ్ఞానకృతములైనట్టి పాపాల అతిరోగినైతిననైనా సోమయాజి విష్ణు భక్తుండిట్లు విన్నపము సేయ సూర్యభగవాను లతనిజూచి యిట్లనియె- "చూడు మన గ్రామాన సోమిదేవమ్మ సకల ధర్మంబుల సర్వజ్ఞురాలు. పతికి మారాడని పతివ్రతలమిన్న, పరుల దయతో గాంచె, వరణణ్యశాలిని, మున్నూట యరువది ముఖ్యవ్రతములు అన్నింటి గాంచె, నా భక్తురాలు మమ్ము బూజించునా మగువయె ప్రొద్దు మాకిష్టురాలైన మా భక్తురాలు అన్నము ముట్టని యాదివారము వ్రతము చేయుచుండ వనిత సద్భక్తి వనిత యింటి బోయి వారమ్ము ఫలము అడిగి తెచ్చుకొనిన ఆరోగ్యమనె"ను భాస్మరునియాజ్ఞ విని బ్రాహ్మణుడనెను "నన్ను జూచినవారు రివ్వుదురు దేవా! చేరనీయర్వెరు సీమలోపలికి.” బ్రాహ్మణుడిటుల పల్క భాస్నరుండనెను- "అంగలార్పకుమయ్య అంగుళ్ళనుండి ప్రియముగలవారిచే బిలిపింతు నిన్ను, వ్రతము చేసినవాడు వనిత పట్నాన అక్షతలిప్పించె వనిత విప్రులకు, పిలిపించె బ్రాహ్మణుల ప్రీతితోడతను పీటలు పెట్టించె ప్రియము మీరగను "నూటముప్పదిమూడు నేతి బూరెలను తామ్రపాత్రలయందు దనరగానుంచి, వస్త్ర ప్రతిమలుంచి వాయనాలుంచి, పన్నిద్దరు బ్రాహ్మణులను పరికింపగాను, భక్తితో పనిద్దరు బ్రాహ్మణోత్తముల, లెక్కకొక బ్రాహ్మణుడు తక్కువైయుండె. కడు శీఘ్రమేగి యంగడివీధి వెదకి, వృద్ధ బ్రాహ్మణుని జూచి వినయమ్ముతోను తగు ప్రితితోడ నాతనితోడ తెచ్చి, భగవానుడేవచ్చే బ్రాహ్మణుడనుచు, వ్రతశాంతమాయెనని వనిత యుప్పొంగె. పీటలుపట్టించె ప్రియము తోడుతను అరటాకుపరచిరందమ్ము మీర, కడిదిపాత్రమ్ములు గడు వేడ్కనిడిరి. పాత్రాభిమానాలు భక్తిగానిడిరి. పంక్తి పంక్తి నుప్పువడ్డించినపుడు, వడ్దింపవచ్చె దానతి వేడుకను, పంచభక్ష్యములు పాయసాన్నములు తెచ్చి వడ్డించిరి. దివ్యాన్నములును, కందయు జేమయును గాయకూరలును, మండిగలు నవసరము బిండివంటలును, ఊరగాయలు మంచివారు దప్పళము ఆకుపచ్చడులతో నప్పడములతో అచ్చావు నేతులు నాగడ్డ పెరుగు ఔపోషనములబట్టు నాసమయమందు వినయాన సోమయాజి విన్నపముజేసె "వనిత నీ ప్రతమొక్కవారమ్ము ఫలము దయచేయవమ్మ నేదానపాత్రుడను" అని బ్రాహ్మణుడు పల్కనాశ్చర్యమంది అతివ తానట్టులనే నందరిని జూచి- "ఇదియేమి ఆశ్చర్యమిది వింటిరయ్య ధనధాన్య వస్తువుల దానమడుగుదురు. వ్రత ఫలము లడుగుదురు, వచ్చినవారు." వెలదిమాటలు విని విప్రుడిట్లనెను. "అధిక రోగిని గనుక నడిగితిని తల్లీ! రక్షించి వరమిమ్ము రక్షింపుమనె" ను. అంతలో వచ్చిరి అతివకొమాళ్ళు పిన్న పెద్దలుకూడి ప్రియమాడిరపుడు అవతరించి భగవానుడా సమయమందు తరుణిచే వారఫలము ధారపోయించె, కడుపుచ్చుకోగానే కదలె పాపాలు, వజ్రకాంతులు దేరివచ్చె దేహము, సూర్యకాంతులమీర శోభిల్లె తనువు, చంద్రకాంతులుదేరి సౌరొప్పెమేను, అందరునిగని మోహమంది రాజసులు, అంతా సంతోషించిరా విప్రలంత, ఆరగించిలేచి అతి శీఘ్రముగను, ఆరగించిన వారి హస్తములకెల్ల వాసించి నుదకమువారవోయించె, విప్రులకు గప్పురపు విడియమ్ము లిచ్చె, సంపూర్ణదక్షిణాలు చాలగానిచ్చి భక్తిమొక్కెను బ్రాహ్మణుల కప్పుడు, చేతులు గడిగిరి చితుతళ్ళనొత్తి, చేరి కూర్చుండి చిరుచాపమీద అతిశీఘ్రముగ వచ్చి యా సోమయాజి- "తల్లి నీ వ్రతముచే ధన్యుడనైతి, నీ వ్రతము నేనెట్టు లాచిరించెదను" అని సోమిదేవమ్మ యాతనికి బలికె- "మంచి ముఖ్యమైన మాఘమాసాన, అయిన పున్నమినాడు నాదివారాన, మజ్జనంబులనాడి మడతగలట్టి, నీమమ్ముతో భక్తి నెల్లవారలను, గోమయముతో నరుగు కొమరొప్పనలికి, పండ్రెండు పాద్యాలు పంచవన్నెలను, నిలిపి మండపమున నెలత లుంచెదరు. కార్యసిద్ధికొరకు గణపతినిదలచి, ఘనముగా సరస్వతిని కాంతలు పూజింత్రు, పండ్రెండు స్నానాలు భానునకు చేసి పట్టుపీతాంబరము భానునకుగట్టి, సకలోపచారాల స్వామిబూజించి, ఆవుపాల పొంగలమరంగ పెట్టి ఆదినారాయణున కర్పితనముచేసి, ఉద్యాపన సాంతమ్ము నెప్పుతో వినుడి, నూటముప్పదిమూడు నేతిబూరెలును, తామ్రపాత్రలలోన తనరంగ నుంచి, వస్త్రప్రతిమలుంచి, వాయనాలుంచి, సంపూర్ణ దక్షిణలు చాలంగనుంచి, పన్నిద్దరు బ్రాహ్మణులకు భక్తితో నొసగ, వ్రతసాంగమగునె వైభవమునను "అతివృద్దులై నట్టి యతివలకునెల్ల" ఏన్నర్ధమీవ్రతము హితమొప్పుననెను. ముట్టందునగు నట్టి
ముగుదలకెల్ల మూడేండ్లకీవ్రతము ముగియునని చెప్పి ఆచరింపగలేని యతివలకు నెల్ల పాడగ ఈ కథ పఠియింపవలెను. పఠియింపలెేనట్టి పణతులకునెల్ల, పాపము దేహాన ప్రత్యక్షమగును.” అనిన సంతోషించి యాసోమయాజి తగు శీఘ్రమున దన నగరికేతెంచి ముద్దుకూతురుచేత మురిపమున తండ్రి వ్రతము చేయించె, కడువైభవమునను వ్రతముచేసిన వెనుక వనితపుద్యాన వజ్రకాంతులజేరి వచ్చెదేహమ్ము, సూర్యకాంతులజేరి శోభిల్ల తనువు చంద్రకాంతులుచేరి సౌందర్యమొసగె.

అందరునుజూచి ముదమందిరి జనులు 
అడుగుటకువచ్చిరా యతివలందరు
పాటకంఠతబట్టి భాగ్యముక్మ వినుము 
వరపుత్రి లక్ష్మక్క వరుసతోడ వినుము 
కనకగోదానమ్ము కన్యదానమ్మ 
సర్వకృత దానమ్మ సలిపిన ఫలము
కృష్ణజయ! కృష్ణ జయ! కృష్ణమ్మ దలతు
ఇష్టసంపదలు మాకిచ్చి రక్షించి
రామజయ! రామజయ! ఠతామజయ! రఘురామదలతు
నానాటిపాపము నాశనము నాశనము చేయ.

No comments:

Post a Comment