సావిత్రీ-గౌరీదేవి కథ (బొమ్మలనోము)
అనగనగా పార్వతీదేవి మూడుపండుగలు వెళ్లిన మక్కనువు నాడు శివునితోటి - "భూలోకంలో అష్టఐశ్వర్యంబులు పొందేటటువంటి ఒక వ్రతము చెప్పమని యడిగెను. శివుడు అప్పుడు "మూలగొడ్ల పేడతో చేసిన మట్టితో బొమ్మలు చేసి, వాటిని అలంకరించి, పదిమంది పేరంటాళ్లను పోగుచేసి, ఐదు రోజుల పాటు పులగం, మధుపాన్నం, బూరెలు, నానుబియ్యం, అరెసెలు వంటి నైవేద్యాలు సమర్పించి వ్రతము చెయ్య" మని చెప్పెను.
పట్టినరోజు పులగం నైవేద్యము పెట్టి భూచక్రము యేలెను. రెండవ రోజున మధుపాన్నం నైవేద్యము పెట్టి ముద్దుగారాబాన పెరిగింది. మూడవ రోజున చలిమిడి బూరెలు నైవేద్యము పెట్టి ముత్తయిదువయినది. నాల్గవరోజున నానబియ్యము నైవేద్యముపెట్టి నాగప్పసాని అయింది. అయిదవనాడు అరెసెలు నైవేద్యముపెట్టి సేగిలేని మనువు కోరింది. ఆరవరోజున గారెలు నైవేద్యముపెట్టి గారంబుద్దుని తోడబుట్టింది. ఏడవనాడు అట్లు నైవేద్యముపెట్టి పట్టి తల్లి అయింది. ఎనిమిదవనాడు మినపసున్ని, తొమ్మిదవనాడు పెరుగుపేరిన నెయ్యి నైవేద్యముపెట్టి పాతాళము యేలింది.
ఈ వ్రతం చేయడం వల్ల, సౌభాగ్యవతి అయిన సావిత్రి తన భర్త సత్యవంతుడిని యముడి దగ్గర నుంచి తిరిగి తెచ్చుకున్నట్లు, అలాగే కోరుకున్న వరాలు పొందినట్లు కథ ఉంటుంది.
కథ లోపమయినా వ్రతలోపముకారాదు. శక్తి తప్పినా ఫలము తప్పదు. వాక్కుతప్పినా వ్రతము తప్పరాదు.
ఉద్యాపనము: తొమ్మిది చేటలు, చేట ఒక్కొంటికి తొమ్మిదేసి బిళ్లకుడుములు, తొమ్మిది లక్కజోళ్లు, తొమ్మిది నల్లపూసల కోళ్లు, తొమ్మిది ఆకులు, ఆకుచెక్కలు పెట్టి తొమ్మండుగురు ముత్తయిదువులకు ఇవ్వవలెను.
No comments:
Post a Comment