Thursday, January 8, 2026

Bachala Gowri Gouri Nomu Katha - బచ్చలగౌరీ నోము కథ

బచ్చలగౌరీ నోము కథ

ఒకచిన్నది కాపురము చెయుచుండ అన్నగారు చూచుటకు వచ్చెను, ఆ చిన్నది అన్నగారితో కొంతసేపు ఇష్టాగోష్టినుండి పిమ్మట పిండివంటలతో వంటచేసి కూరపోపునకు కరివేపాకు కావలసివచ్చి- "అన్నయా! దొడ్డిలో చెట్టువున్నది. కొంచెము కరివెపాకు తెచ్చిపెట్టు" మని యడిగెను. "అలాగే" అని చెప్పివెళ్లి యెంతసేపటికి రాలేదు. పాముకరచి అక్కడపడిపోయెను. ఇంకను అన్నగా రెంతసేపటికి రాలేదని ఆ చిన్నది దొడ్డిలోకి వెడలేసరికి చెట్టుక్రింద పడిపోయిన అన్నగారు కనబడెను.

ఆమె తొట్రుపడుతువెళ్లి- "అన్నా అన్నా!" అని పిలిచి పలుకగపోగా యేడువసాగెను. ఆ యేడుపువిని ఊళ్లోవారందరు వచ్చిరి. అందులో ఒక ముసలి ముత్తయిదువ ఆ చిన్నదానిని చూచి- "అమ్మాయీ! నీ విక్కడలేచి లోపలికి వెళ్ళి పువ్వులతోడ కాయలతోడ పండ్లతోడనున్న బచ్చలిచెట్టు తెప్పించి పూజచేసి ముత్తయిదువునకు భోజనముపెట్టి వెండి బచ్చలకాయ, బంగారుబచ్చల కాయ చేయించి బంగారపుది. నీవుంచుకొని వెండిబచ్చలకాయ చీర, రవికెలగుడ్డ బచ్చలిచెట్టు  తాంబూలము దక్షిణతోడ ముత్తయిదువునకు వాయనమిచ్చి భోజనముపెట్టి రావమ్మా! వచ్చి అన్నను లేపవమ్మా" అన్నదట, 

ఆమాట విని ఆ చిన్నది చటాలున లేచి ఆ ముసలి అవ్వ చెప్పినట్లు చేసి మళ్లీవచ్చి- "అన్నా! అని పిలిచేసరికి నిద్ర నుండి లేచినట్లాతడు లేచిచూచెను. నఅప్పుడామె సంతోషించెను. "ఇది బచ్చలగౌరీ నోమమ్మా! = ఇది నోచిన వారికి కడుపు చలువ తోడునీడ చలువ, పుట్టింటచలువ, అయిదవతనము కలుగును అని ఆ ముసలి. ముత్తయిదువుచెప్పి- "నేను పార్వతీదేవినిని చెప్పి అంతర్జానమైనదట.

ఉద్యాపన: బచ్చలి చెట్టు, బచ్చలి కాయలతో (బంగారం/వెండితో చేయించినవి) గౌరీ దేవికి నివేదించి, పదమూడు జోడుల నేతి గారెలు. ముత్తైదువులకు 
వెండిబచ్చలకాయ చీర, రవికెలగుడ్డ బచ్చలిచెట్టు  తాంబూలము దక్షిణతోడ ముత్తయిదువునకు వాయనమివ్వవలెను. 

శక్తితప్పినా భక్తితప్పరాదు. అక్షతలు తప్పినా లక్షవేలయేండ్లు అయిదవనతము.

No comments:

Post a Comment