Sunday, January 11, 2026

Bara vattula Mura Vatthula Nomu Katha - బారవత్తుల మూరవత్తుల నోము కథ

బారవత్తుల మూరవత్తుల నోము కథ

ప్రతిదినము బారెడువత్తి పోగొకటి, మూరెడువత్తి పోగొకటి తీసుకొని, బారెడుపోగూ ముప్పది చుట్లు చుట్టి, మూరెడువత్తిపోగూ ఆరుచుట్టులు చుట్టి శివరాత్రినాడు మొదలు మళ్ళా శివరాత్రిదాకా సంవత్సరమువరకూ ఈలాగువత్తులు చేసికొని శివరాత్రినాడు దేవాలయములో క్రొత్తమూకుడులో మానెడు సోలడు నూనెపోసి, ఆవత్తులు వెలిగించవలెను. తరువాత మానెడు సోలడు బియ్యము, క్రొత్త వస్త్రము, దక్షణ తాంబూలములతో బ్రాహ్మణులకు భోజనముపెట్టి యియ్యవలెను. ఈనోము
నోచినవారికి బ్రహ్మలోకాలు ప్రాప్తించును. ఈ కథ శివుని వలన విని పార్వతీదేవి భక్తురాలైన యొక కుంటి గ్రుడ్జిదానికి చెప్పగా ఆభక్తురాలు భక్తిశ్రద్ధలతో యీనోము నోచి అంగవైకల్యముపోయి బ్రహ్మజ్ఞానము గలిగి బ్రహ్మలోకముచూరగొన్నదట.

వత్తులు చేయుట కెప్పుడైనా వీలులేకపోతే అన్నీ కలిపి మరొకనాడు చేసికొనవచ్చును.

No comments:

Post a Comment