Sunday, January 11, 2026

Surya Chandrula Nomu Katha - సూర్య చంద్రుల నోము కథ

సూర్య చంద్రుల నోము కథ

'సూర్యదేవుడా! నీకే నమస్కారము. 
చంద్ర దేవుడా! నీకే నమస్కారం. 
బాలభాస్కరా! నీకే నమస్కారం 
ఉదయభాస్కరా! నీకే నమస్మారం. 
మధ్యాహ్న మహేశ్వరా! నీకే నమస్కారం. 

ధన ధాన్య సమృద్గయినపట్నంలోను, పెద బ్రాహ్మణుడు-సాద బ్రాహ్మణుడు ఊరుతిరిగినా ఏడుమానికెలు, పల్లెతిరిగినా ఎడుమానికెలు, పట్నం తిరిగినా ఏడుమానికెలు, ఎడుమానికెలు బియ్యముచెత కూడుకాక, నీళ్ళూకాక, దరిద్రాన, పేదరికాన విసిగి వేసారుచుండగా, పుట్టక పుట్టక ఇద్దరు పినపాపలు పుడితే చిన్నక్కెమ్మను చినసోమయాజులుకిచ్చి, పెద్దక్కెమ్మను పెద్దసోమయాజులుకిచ్చి, తాచక్రఋక్షీశరీరంబోయెను. 

ఇంద్రలోకాన ఇంద్రకన్యలు చంద్రలోకాన చంద్రకన్యలు, భూలోకాన పేరంటాళ్ళు, కొలనుగత్తెక్కలు నోమునోచగా- "అమ్మల్లారా! అక్కల్లారా! ఏమినో మేమివతం?" చెప్పండంటే "ఆడవారి నోములు మీకెందుకనిరి. పెద్దయ్యగారు తటాకమందు స్నానముచేసి బంగారు చెరువులో పట్టు వస్త్రం గట్టుకొని పెద్దయ్యగారు ఒకగద్దె పెట్టుకొని, పెరంటాలు ఓగద్దె పెట్టుకొని, పెద్దయ్యగారితో . అక్షతలు పేరక్కచేతిలోపెట్ట పెద్దయ్యగారి కథచెప్పగా పేరక్కమ్మకథ వినయంగా ఏటికెదురుగా మాఘమాసాన్ని పున్నమి ముందర రథసప్తమినాడు విఘ్నము కాకుండా విఘ్నేశ్వరులు కుండ్రాళ్ళుపోసి, ఆదిత్య భగవానునికి పాలుపొంగించి ఆయనను మూడు కోరికలు కోరి, అది మొదలుకొని ముట్టయినా కథ అంటైనా కధ పురుడైనా కథ పుణ్యమైనా కథ శుభమైనా కథ శోభనమైనా కథ వడుగైనా కథ పెండ్లైనా కథ శుభమైనా కథ పంచజ్ఞాన కథ పంచ శత్రువులా కథ కథేనితది, కథేనీమం, కథే వాలాయితీ, కథ మరచి కుడువరాదు. వ్రతభంగం చేయరాదు. కన్య కథ మరచి కుడిస్తె బ్రాహ్మణునికి భోజనం పెట్టి, బ్రాహ్మణుడు కథ మరచి కుడిస్తె బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, బ్రహ్మచారి కథ మరచి కుడిస్తె ఉపవాసముండి రక్తజూచి, బ్రాహ్మడికి కాళ్లుకడిగి, భోజనము పెట్టి ఏడుంగాలందాఛరించి ఎడాది కాగానే షష్టినాడు ఉపోష్యముండి సప్తమినాడు చెరకుగర్రల, అరటి స్థంబాల పందిళ్లువేసి, చేమంతి పువ్వుల ఎత్తులబెట్టి, అట్లతోను అరుగులు వేసి బుట్టలతో మూలలువేసి కుడుములతో కోటలువేసి, కుంకుమతోను కుదుళ్లువేసి, అల్లంతోను అరుగులువేసి బెల్లంతోను పొయియలువేసి పాలాను ప్రారందీర్చి, పంచవన్నెల ముగ్గుపెట్టి, పన్నెండు పద్మాలూ పెట్టి పసుపుతోను గడపాపెట్ట ఎడుమానికల బియ్యము సూర్యదేవునికి మండపంబోసి, ఏడుమానికెల బియ్యము చంద్రదేవునికి మండపంబోసి చిన్నం బాతిక బంగారాన సూర్యదేవునకు ప్రతిమలుయుంచి చిన్నంబాతిక వెండితోను చంద్రదేవునకు ప్రతిమలు చేయించి పైడిగిన్ని, పచ్చని వస్త్రాలు నా సూర్యదేవుని అలంకరించి, వెండిగిన్నెలు తెల్లవస్త్రాలు చంద్రదేవున కలకరించి, వేగిందాకా ఆటాపాటా, ఏదోవిధాన జాగరంచేసి వేగంగానే తానులేచి, అలికిపూచి ముగ్గులుపెట్టి, ఆవునేతి దీపంపెట్టి ఆవునేతి బూరెలువండి, చిరగకపూయిన అరటాకులలో మరువబోయిన బెల్లం పెట్టి మోసుకుపోయేకుండా పెట్టి, అల్లంపెట్టి, బెల్లంపెట్టి, తేనెపెట్టి, టెంకాయపెట్టి, అరటిపండ్ల అత్తంపెట్టి, ఆదినారాయణున కారగింపుబెట్టి, ఉమాదేవి పేరుజెప్పి,
రోహిణిదేవి పేరుజెప్పి, పన్నిద్దరు బ్రాహ్మణులతోను, ఇద్దరైన ముత్తయిదువులకు ఇష్టాన్నములు పుష్టిగా బెట్టి భక్తితోడ తాంబూలమిచ్చి, భక్తితోడను నమస్కరించి, "ఈ నోము నోచినవారికి యేమిఫలం గలదమ్మా!" అంటే ఇష్టాన్నములు తుష్టిమాయె. దృష్టాంతరమే మోక్షమాయె, చావనిసంబాయె, సంతానమభివృద్దాయే చెడ్డా అర్ధం చేరీవచ్చె, పడ్డా అర్థం ప్రార్థిల్లె, రివ్వున చుట్టాలు కూడానువచ్చిరి, పట్ట గోవుల పాలు పితికిరి, మున్నూరు కొటేండ్ల అయిదో తనం వేసిరి, గొడ్రాలునోస్తే కొడుకులగనేనూ, కోమటినోస్తే కోటికి పడగలెత్తె, రాజునోస్తే లక్షపడాయె, పునిస్త్రీనోస్తే పువ్వులుముడిచె, పుత్రపుత్రిక పనెత్తి, వితంతువులనోస్తే వేయివేలేళ్ళను విధవరికము లేదు, శివలోకం, విష్ణులోకం గద్దమంటే ఎక్కిన గద్దెలు పైడగద్దెలాయె అత్తిన నల్లపూసల భరణాలాయె,
కట్టినవస్త్రాలు పట్టువస్త్రములాయె, పుణ్యముగల యీకథ వింటివి, ఆదినారాయణమూర్తికి నమస్కరించవలెను, దివాకరుడా దివ్యమూర్తి ప్రభాకరుడా! బాలభాస్మరుడా అలంకారాల ఆదినారాయణా!” ఆదినారాయణునికి నమస్కరించి అక్షతలు తలలో వేసుకొనవలెను.

No comments:

Post a Comment