బ్రాహ్మణ బాలిక, రాజు బాలిక భాగ్యాదివారాల నోముపట్టిరి. బ్రాహ్మణ బాలిక భక్తి శ్రద్ధలతో నోచింది. రాజుబాలిక ప్రాలుమాలికచే నోము ఉల్లంఘన చేసింది. రాజు కూతురు భాగ్యముపోయి పరమ దరిద్రురాలై పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించుచు నట్టడవులపాలై పోయింది. బ్రాహ్మణ బాలిక సిరిసంపదలతో తుల తూగుచు నిండుకుండవలె చెక్కుచెదరకుండ ఆనందంతో కాలము గడుపు చుండెను.
అడవులపాలై అల్లాడుచున్న రాజకూతురునిచూచి పార్వతీ పరమేశ్వరుల “భక్తురాలు కనుక పాలింతమ”ని యెంచి ముసలి దంపతుల వేషాలతో ఒకనాడామె దగ్గరకు వచ్చి ఆమెను పరామర్శించినారు. ఆ అడవిలో మాటాడే మనుష్యులులేక, పలుకే బంధువులులేక యేకాకియై యేడ్చు చున్నది. కనుక వారిని చూడగనే ప్రాణము లేచివచ్చి తన కష్టముతానే వెల్లబోసుకున్నది.
అప్పుడు పార్వతీ పరమేశ్వరులు "చిన్నదానా! నీవు భాగ్యాదివారాల నోముపట్టి ఉల్లంఘన చేసితివి. జ్ఞప్తికి తెచ్చుకో" మన్నారు. అప్పడావిడ అదంతా తలపోసుకొని, తన తప్పు తెలుసుకొని "దీనికి
పరిహారము చెప్పుడిని వారిని ప్రార్థించినది. అప్పుడా దంపతులకు- "బిడ్లా! భక్తి శ్రద్ధలతో మరల భాగ్యాదివారాల నోము నోచుకో, భాగ్యభోగ్యాలు, పాడిపంటలు, పోయినవన్నీ మళ్ళీ వస్తాయి కడుపు చలువతో, తరగనైదనవతనముతో కైలాసానికి వెళ్ళ గలవని" జెప్పినారు. ఆవిడ వెంటనే భక్తి శ్రద్ధలతో భాగ్యాదివారాల నోముపట్టి ఉద్యాపన చేసికొని పోయిన భాగ్య భోగ్యాలు పొంది సకల సంపదలతో సౌభాగ్యంబుతో స్వర్గానికి కెళ్లీంది.
ఉద్యాపనము: శక్తిగలవారు పట్టుది గాని, లేనివారు వట్టిది గాని సన్నని కుట్టుతో చక్కగా ఒక రవికకుట్టి దానికి చేతిక్రింద కూర్పులు మాత్రము కుట్టకుండా వదలివేయవలెను. ఆ రవిక ఒకచేటలో పరచి. ఆ రవిక చేతులలో ఒక చేతినిండా వస్తువులు రెండవ చేతినిండా కుంకుమపోసి, పండ్లు దక్షణ తాంబూలము, మట్టెలు, మంగళ సూత్రములువుంచి చీర, రవిక వుంచి, పైనొక చేటమూసి “ఒక ముత్తయిదువకు” అవి వాయనమీయవలెను. ఏడాదివరకు ప్రతి ఆదివారము కధచెప్పి అక్షంతలు వేసికొనుచు, పార్వతీ పరమేశ్వరులను పూజించుచు ఒంటిపూట భోజనము,
రెండవపూట ఫలహారము చేయవలెను.

No comments:
Post a Comment