కృత్తిక దీపాలనోము కథ
ఈ సోము కృత్తికా నక్షత్రము కార్తీక పున్నమినాడెప్పుడు వచ్చునో అప్పుడు పట్టవలెను. నిండు పున్నమి కావలెను. పట్టినియేడు నూట ఇరువది దీపములు శివాలయములో వెలిగించి విఘ్నేశ్వరపూజ శివాభిషేకము చేయించి, బ్రాహ్మణునికి మానెడు సోలెడు బియ్యమూ దక్షిణ తాంబూలములుయిచ్చి పాడ్యమినాడుదయమున పదిమందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఇలాగేఖండ తిధిగాకుండా కృత్తిక నక్షత్రముతో కూడిన కార్తిక పున్నమినాడే గాని, యీ నోము నోచకూడదు. 'మూడేండ్లు నోచవలెను. రెండో యేడు రెండు వందల నలభై దీపాలు,
మూడోయేడు మూడువందల అరవై దీపాలు అదేవిధముగా వెలిగించవలెను. కృత్తిక దీపాలనోము నోచినవారికి శివసాయుజ్యము తప్పకుండా లభించును.
No comments:
Post a Comment