Monday, January 5, 2026

Kumkuma Gouri Nomu Katha - కుంకుమగౌరీ నోము కథ

కుంకుమగౌరీ నోము కథ

సోమయాజులుగారి కూతురు కుంకుమగౌరీనోముపట్టి ఉల్లంఘన చేసినది. అందువలన చిన్నతనములోనే విధవరికము వచ్చినది. తల్లి దండ్రులు ఈ చిన్నదానిని తీసుకొని కాశీపట్టణమునకు వెళ్లిరి అక్కడికి వెళ్ళినను ఆ చిన్నదాని విధవరికంపోలేదు. 

ఒకనాడు చిన్నదాని తండ్రి గంగయొడ్డున కూర్చుని తపస్సు గావించుచుండ ఈశ్వరుండాయనకు ప్రత్యక్షమై-'ఎమి బ్రాహ్మణుడా! ఇట్లు కూర్చున్నావు?” అని యడిగెను. అప్పుడా బ్రాహ్మణుడు-నాకు లేక లేక యొక కూతురు గలిగెను. ఆ చిన్నదానికి వివాహము గావించితిని. వివాహమయిన నెలరోజులకు ఆమెకు విధవరికము సంభవించినది. ఆకష్టమును సహింపనోపక కుటుంబ సహితముగా నీ పట్టణము వచ్చినాను” అనిచెప్పినాడు “అయ్యో! నీ కూతురు క్రిందటి జన్మమున కుంకుమ గౌరి నోముపట్టి ఉల్లంఘన చేసినందున బాల్యదశయందే విధవరికము సంభవించినది” అని పరమేశ్వరుడు దయారసంబు తనమోమున తొలుకాడుచుండ బలికెను.

అప్పుడు బ్రాహ్మణుడు “అయ్యో! ఇప్పుడేమి యొనర్చిన నీకష్టము తొలగునో యానతీయ వలయునిని యా పరమేశ్వరుని ప్రార్థించెను. “ఇప్పుడు తిరిగి యీ నోముపట్టి యుద్యాపన చేసినచో యీ కష్టము పోవునిని యా ఈశ్వరుడానతిచ్చి యద్భశ్యుడయ్యెను. అప్పుడా ప్రకారము చిన్నదానిచే నోముపట్టించి యుద్యాపనము చేయించెను.

ఉద్యాపనము: పదముగ్గురు ముత్తయిదువులకు బరిణెనిండుగా కుంకుమబోసి నల్లపూసలు, లక్కజోడుపెట్టి దక్షణ తాంబూలమిచ్చి పదముగ్గురు మత్తుయిదువులకు పదమూడు బరి
ణెలు యివ్వవలెను.

No comments:

Post a Comment