కుంకుమగౌరీ నోము కథ
సోమయాజులుగారి కూతురు కుంకుమగౌరీనోముపట్టి ఉల్లంఘన చేసినది. అందువలన చిన్నతనములోనే విధవరికము వచ్చినది. తల్లి దండ్రులు ఈ చిన్నదానిని తీసుకొని కాశీపట్టణమునకు వెళ్లిరి అక్కడికి వెళ్ళినను ఆ చిన్నదాని విధవరికంపోలేదు.
ఒకనాడు చిన్నదాని తండ్రి గంగయొడ్డున కూర్చుని తపస్సు గావించుచుండ ఈశ్వరుండాయనకు ప్రత్యక్షమై-'ఎమి బ్రాహ్మణుడా! ఇట్లు కూర్చున్నావు?” అని యడిగెను. అప్పుడా బ్రాహ్మణుడు-నాకు లేక లేక యొక కూతురు గలిగెను. ఆ చిన్నదానికి వివాహము గావించితిని. వివాహమయిన నెలరోజులకు ఆమెకు విధవరికము సంభవించినది. ఆకష్టమును సహింపనోపక కుటుంబ సహితముగా నీ పట్టణము వచ్చినాను” అనిచెప్పినాడు “అయ్యో! నీ కూతురు క్రిందటి జన్మమున కుంకుమ గౌరి నోముపట్టి ఉల్లంఘన చేసినందున బాల్యదశయందే విధవరికము సంభవించినది” అని పరమేశ్వరుడు దయారసంబు తనమోమున తొలుకాడుచుండ బలికెను.
అప్పుడు బ్రాహ్మణుడు “అయ్యో! ఇప్పుడేమి యొనర్చిన నీకష్టము తొలగునో యానతీయ వలయునిని యా పరమేశ్వరుని ప్రార్థించెను. “ఇప్పుడు తిరిగి యీ నోముపట్టి యుద్యాపన చేసినచో యీ కష్టము పోవునిని యా ఈశ్వరుడానతిచ్చి యద్భశ్యుడయ్యెను. అప్పుడా ప్రకారము చిన్నదానిచే నోముపట్టించి యుద్యాపనము చేయించెను.
ఉద్యాపనము: పదముగ్గురు ముత్తయిదువులకు బరిణెనిండుగా కుంకుమబోసి నల్లపూసలు, లక్కజోడుపెట్టి దక్షణ తాంబూలమిచ్చి పదముగ్గురు మత్తుయిదువులకు పదమూడు బరిణెలు యివ్వవలెను.
Subscribe to:
Post Comments (Atom)
Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment