Wednesday, January 7, 2026

Nitya Tambulala Nomu Katha - నిత్య తాంబూలాల నోము కథ

నిత్య తాంబూలాల నోము కథ

ఒక రాజు భార్యయందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు, పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి "అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెక్కును" అని చెప్పెను . తెల్లవారిన తరువాత ఆమె నోము నోచుకొని ప్రతి దినము ఒక తాంబూలమును ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను.

ఉద్యాపన: బంగారపు ఆకులు, వెండి చెక్కలు కలిపి తాంబూలములతో బ్రాహ్మణునకి దానయ్యవలెను.

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...