కన్నెతులసమ్మ కథ
ఒక బ్రాహ్మణునకు ప్రధమ భార్యకు కూతురుండెను. సవతి భార్యకు ఆ చిన్నదానిని చూచుట యిష్టములేదు. అందుచేత ఆ పిల్లకు అన్నము పెట్టక, తలదువ్వక నానాబాధలు పెట్టుచుండెను. ఆ పిల్ల సవతితల్లి బాధపడలేక తాతగారింటికి వెళ్లిపోయెను. పిల్ల తాతగారి యింటికి వెళ్లిన తరువాత తండ్రి- వెళ్లి తీసుకొని రావలసినదిని ఆపిల్ల సవతితల్లి యడిగెను. "నీవు యది యక్కడున్న యన్నినాళ్లును దానిని బాధపెట్టినావు. నేప్పుడేమని దానిని తీసికొనిరాను? నేను వెళ్లిన పంపరు. నీవు వెళ్లి తీసుకొనిరమ్మ" ని యా బ్రాహ్మణుడు చెప్పెను ఆమె. "సరే" యని వెళ్లి- "పిల్లను పంపుమ" ని పిల్ల తాతగారి నడిగెను. "అయ్యో! మామనుమరాలికి పెళ్లి చేయవలెను. ఇప్పుడు పంపుటకు వీలులేద" ని యా తాత చెప్పెను. "మా పిల్లకు మేమే పెళ్లి చేసుకుంటాము పంపడ" ని తీసుకొని వచ్చెను. ఇంటికి తీసుకొని వచ్చిన తరువాత- "పిల్ల ఎత్తుకోమ" ని చెప్పి కొంచెము అరసిముక్క పెట్టి తాను వెళ్ళి తులసెమ్మకు పూజచేసుకొనుచుండెను. సవతితల్లి యాపిల్ల చేతిలోని అరసిముక్క నైవేద్యము పెట్టెను. అప్పుడు తులసెమ్మ ప్రత్యక్షమై - "నీవు కన్నె తులసెమ్మ నోముపట్టి ఉల్లంఘన చేసినావు. అందుచేత నీకు బాల్యంలో తల్లిచనిపోయినది. ఆ కారణము చేతనే యీచిక్కులు కలిగినవి. కాబట్టి ఇప్పుడు కన్నెతులసమ్మ తోము నోచుకొని
యేడాది అయిన తరువాత యుద్యాపనము చేసికొమ్మ" ని చెప్పి యామె యదృశ్యమయ్యను. ఆ పిల్ల ఆ ప్రకారము నోముపట్టి యుద్యాపనము చేసుకొనగా సవతితల్లికి ఆమెపై ప్రేమ కలిగెను.
ఉద్యాపనము: కన్నెపిల్లలు ప్రతీరోజు ఉదయాన్నే లేచి తన స్నానం చేసి ‘తులసి’ మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి. తులసి మాతకు మనస్ఫూర్తిగా భక్తిగా మూడు నమస్కారాలు చేసుకోవాలి. పూజల చేసిన అక్షింతలు తలపై వేసుకోవాలి. అలా సంవత్సరంపాటు ‘తులసి మొక్క’కు పూజ చేయాలి. తులసిని పూజించాక..26 జతల అరిసెలు చేయించి 13 జతల అరిసెలను తులసమ్మకు నైవేద్యంగా పెట్టాలి. నోము అంటే వాయనం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ కన్నె తులసి నోములో కూడా వాయనం ఇవ్వాల్సి ఉంటుంది. కన్నె తులసి నోము కాబట్టి కన్నెపిల్లకే వాయనం ఇవ్వాలి. అలా ఓ కన్నె పిల్లకు కొత్త బట్టలు పెట్టి..ఆమెకు 13 జతల అరిసెలను వాయనమివ్వాలి. నైవేద్యంగా పెట్టిన అరిసెలను తన ఈడు పిల్లలతో కలిసి తినాలి. తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు
శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment