Monday, January 5, 2026

Tavudu Gowri Nomu Katha - తవుడు గౌరీ నోము కథ

తవుడు గౌరీ నోము కథ

ఒక భాగ్యశాలి ఎనుబది ఏళ్ళ వృద్ధురాలై ఉన్నప్పటికీ ఆమె అత్తమామలనూ, తల్లితండ్రులనూ, బంధువులనూ , బిడ్డలనూ ఎడబాయక సంతోషముగానుండెను. ఆమెను చూసి ఊరివారందరూ ఆశ్చర్యపడుతూ "ఏమి నోచితివమ్మా ! ఎవరినీ వదలకుండా నిండు సంసారముతో ఉన్నావు" అని అడుగగా? "అమ్మలారా! ఇది వాయనమందిన నోము ఫలమే కాని, నోచిన ఫలము కాదు. పూర్వము మాయమ్మ తవుడు గౌరి నోము నోచుకొని నాకు వాయనము ఇచ్చినది. ఇది అంతయూ వాయనపు చలవే" అని చెప్పెను. 

అది విని వారు వాయనమందితేనే ఇంత ఫలము చెందగా నోము నోచినచో ఇంకెంత ఫలము అబ్బునో కదా అని అనుకొని నాటినుండీ ఆ నోము నోచుకొనుచూ దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యములతో విలసిల్లుచుండిరి. ఈకథను చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన: తవ్వ నిండుగా బియ్యము పోసి పైన కొద్దిగా తవుడుతో కప్పి , చీరతోనో లేక రవికెలగుడ్డతోనో పుణ్యస్త్రీకి 
దక్షణ తాంబూల ముంచి యుద్యాపనము చేసుకొనవలెను.

No comments:

Post a Comment

The Story Of Savitru Genealogy - సవితృవంశ ప్రవచనాది కథ

సవితృవంశ ప్రవచనాది కథ ఓ రాజా! విను. త్వష్టయొక్క వంశం గూర్చి నీకు వివరంగా చెప్పాను. తరువాత సవిత పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలయందు పశు...