Thursday, January 8, 2026

Dhairya Lakshmi Nomu Katha - ధైర్యలక్షి నోము కథ

ధైర్యలక్షి నోము కథ

ఒక బ్రాహ్మణునకు ఆరుగురు కొడుకులును, ఒక కూతురును కలరు. ఆ కూతురత్తింట కాపురము చేయుచుండెను. ఆ సమయములో మొదటి అన్నకు పెండ్లికార్యము చేయుచుండెను. ఆ సమయములో మొదటి అన్నకు పెండ్లి కార్యము తలపెట్టి -"రావసలినది"ని కూతురుని తల్లిదండ్రుల పిలిచిరి. ఆమె “సరె" అని తీరా పెండ్లికి ప్రయాణమై రాబోవుచుండగా ఆమెభర్తకు ప్రాణముమీదకి వచ్చెను. అందుచేత నామె ప్రయాణమును మానివేసెను. 

అలా అయిదురోజులు ఉన్న తరువాత పెండ్లి అయిన తరువాత ఆమెభర్తకు జబ్బుకుదిరి లేచెను. ఈలాగే అందరి అన్నల పెండ్లిండ్లకు ఆమె ప్రయాణము అయ్యేసరికి ఆయనకు ప్రాణము మీదకివచ్చి క్రింద పెట్టుచుందేవారు. ఆ పెండ్లి రోజులు అయిన తరువాత ఆయనకు నెమ్మదిగా నుందేది. 

చివరకు కడసారపు అన్నకు పెండ్లికి రాగా ఆమె ప్రయాణమయ్యేసరికి ఆయనకు మామూలు ప్రకారము ప్రాణముమీదికి వచ్చెను. అలా జబ్బు చేసినప్పటికి ఈసారి ఆమె ధైర్యము తెచ్చుకొని-"ఇదియేదో చిత్రమునున్నది. ఇది చూతాము. నా ధైర్యలక్ష్మియే నన్ను కాపాడగలది"ని ఆమె యెంచుకొని యెవ్వరితోడను చెప్పక క్రింద పారవేసిన పురుషుని చాపలో చుట్టి మూలబెట్టి తలుపులు తాళమువేసి తిన్నగా బయలుదేరి పుట్టింటికి వచ్చుచుండెను. అంతలో దారిలో నొక జువ్విచెట్టు కనబడెను. ఆమె యాచెట్టువద్దకు వెళ్ళి-"నీవే నా పాలిటి ధైర్యలక్ష్మివి తల్లీ! నేను తిరిగి యింటికి వచ్చేటప్పటికి నామగనికి నింపాదిగా నుండిన నీకు ఏడాది పూజచేస్తానిని దండముపెట్టి తిన్నగా పుట్టింటికివెళ్ళి అన్న పెండ్లి అయిన తరువాత ఇంటికి తిరిగివచ్చెను. 

వచ్చేసరికి మగడు లేచివుండెను. మిక్కిలి ఆరోగ్యము గలవానివలె జబ్బుయేమీలేక కులాసాగా నుండెను. నాడు మొదలు ఏడాది జువ్వెకు పూజ చేసుకొన్నదట. అంతట ఆమెకు సిరిసంపదలు తరగని అయిదవతనము వచ్చెను. అంతట ఇరుగు పొరు అమ్మలువచ్చి - "ఏమమ్మా! చచ్చిన పురుషుని యింట్లొపెట్టి చక్కాపోయి వచ్చేటప్పటికి పురుషుడు లేచితిరుగుచున్నాడు. ఏమినోము నోచినావు? ఏమివ్రతము పట్టినావు?" అని అడిగినారు. అడిగితే "ధైర్యలక్షినోము పట్టి జువ్విచెట్టుకు పూజచేసినానమ్మా!" అన్నదట. ఆమె పట్టిననోము లోకమంతా పట్టరి.

ఉద్యాపన: 'దశమి' రోజున జువ్విచెట్టు దగ్గర తొమ్మిది దీపాలు వెలిగించి, 108 ప్రదక్షిణలు చేయాలి. వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది మంది ముత్తయిదువులకు దక్షిణ తాంబూలాలతో కూడిన వాయనమివ్వాలి.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...