Monday, January 26, 2026

Magha Puranam 9 - మాఘ పురాణం 9 పుష్కరుని వృత్తాంతము

మాఘ పురాణం - 9 వ అధ్యాయం

పుష్కరుని వృత్తాంతము
ఈ విధంగా నాముగ్లురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా - దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులగు వశిష్ఠులవారితో ఇటుల నుడివెను-

"పూజ్యులై న ఓ మహర్షీ! ఈభూలోకమునకు, యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ఆ ముగ్గుకు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళివచ్చినవి" అని ప్రశ్నించెను.

వశి
ష్ఠులవారు దీర్ధముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి,

“మహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము, భక్తిమార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు, వారొకసారి మాఘమాస ములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.

దీనికొక ఉదాహారణ వివరింతును ఆలకింపుము, ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు యీ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికిపోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతము కడు విచిత్రమైనది.

పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగల వాడు. పరోకారము చేయుటయే తన ప్రథాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్టతో స్నాన, జములు మొదలగు పుణ్య కార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు.

ఒకనాడు యముడు 
పుష్కరుని ప్రాణములుతోడ్కొని రండని తన భటుల కాఙ్ఞాపించినాడు. యమభటులు వెంటనేపోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు.

ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై వుండెను. భటులు తోడ్కొనివచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను, యమ
ధర్మరాజునకు ఏదో భయము అవరించినట్లయినది. వెంటనే పుష్కరుణ్ణి తనప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను.

యముడు భటులవంక కోపంగాచూచి- “ఓరీ భటులారా! 
పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీనుకువచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణకిపోయిరి.

యమధర్మరాజు పుష్కరునివై పు జూచి నమస్కరించి, జరిగిన పొరపాటుకు క్షమించమనికోరి "భూలోకముసకు వెళ్లుడు" అని చెప్పెను. జరిగిన పారపాటునకు 
పుష్కరుడుకూడా విచారించి, "సరే వచ్చిన వాడను ఈ యమలోకమునుకూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను.

పుష్కరుడు ఒక్కొకదిశకు పోయు నరులు పడుచున్న నరక బాధలను చూడసాగాను. జీవులు వారు చేసుకొన్న పనులను బట్టి అనేక విధముల శిక్షాల ననుభవించు చుండుట పుష్కరుడు కనులారా గాంచెను.అతనికి అమితమగు భయముకలిగెను, తన భయము బోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పావజీవులు తమతమ పాపములను పోగొట్టుకొను చుండిరి, వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక భాధలను చూచి వచ్చినందువలన పుష్కరుడు మరింత జ్ఞానంతో స్మరించుచుండెను.

ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్తవిని రామచంద్రుడు యముణ్ణి ప్రార్ధించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు.  అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యనేర్పిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమవలన తిరిగి బ్రతికించెను.


No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...