నవగ్రహ దీపాల నోము కథ
సోమయాజులుగారి కూతురొకనాడు తండ్రిదగ్గరకు వెళ్ళి- "తండ్రీ పట్టినదెల్ల బంగారమగుటకు, ముట్టినదెల్ల ముత్యములగుటకు, కోరికలెల్ల కొనసాగుటకు, ఆరని నైదవతనము కలుగుటకు, కడుపుచలువ గలుగుటకు ఏమి నోచవలెనండి?” యనియడుగగా ఆయన ముద్దులకుమార్తె యుద్దేశమునకు మెచ్చి ఈనోము చెప్పినాడట. ఆమె యీ నవగ్రహదీపాల నోముపట్టి యుద్యాపనము చేసికొని యిష్టసిద్దులు పొందినదట.
ఉద్యాపనము: తొమ్మిది కొత్తమండిగలు తెచ్చుకొని మండిగ యొక్కంటికి సేరుంబావు చొప్పున నూనెపోసి మండిగ యొక్కంటికి వరహాఎత్తు వత్తి (అనగా పావలాయెత్తుకట్టె, అణాయెత్తు కట్టెవేసి యుంచినచో వరహాయెత్తు) ఏకువలెనలిపి, చమురులోముంచి, దీపము వెలిగించవలెను. నవధాన్యము తవ్వెడున్నర సోలెడుగాని, మానెడు సోలెడుగాని తెచ్చుకొని ఒక్కొక్క దీపము దగ్గర ఒక్కొక్క ధాన్యము దినుసు లుంచవలెను. తొమ్మిది తాంబూలములుంచి వానిలో ఒక్కొక్క పావులా చొప్పున దక్షణ యుంచవలెను. కొంచెము కొంచెముగా నవధాన్యములన్నియు కలిపి, మండిగల క్రింద కొంచెము పోయవలెను. విఘ్నేశ్వర పూజయు, శివునికభిషేకమును చేయించి, ఈ దీపములన్నియు శివాలయములోనే తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఒక్కొక్క మండిగా ఒక్కొక్క దక్షణ తాంబూలములతో నియ్యవలెను. శక్తి కొలది ఒకరికో యిద్దరికో బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను. ఈనోము కార్తీక మాసములో చేయవలెను.
Subscribe to:
Post Comments (Atom)
Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ
గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment