Thursday, January 22, 2026

Magha Puranam 5 - మాఘ పురాణం 5 మృగశృంగుని చరిత్ర

మాఘ పురాణం - 5 వ అధ్యాయం

మృగశృంగుని చరిత్ర
ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక 'కౌత్సు' డని పిలవబడుచున్ననూ అతనిని మృగశృంగుడను పేరుతో పిల్చుచుండిరి. అదెటులనగా, అతడు కావేరీ నదితీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా అప్పుడాతడు శిలవలె నిలబడి దిక్షతో 
తపస్సు చేసుకొను సమయములో ఆ ప్రాంత మందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే (కొమ్ములతో) నతనిని గీకెడివి. అందుచేత అతనికి 'మృగశృంగు'డనే పేరు సార్థకమయ్యెను.

వివాహమాడు కన్య
మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలయునని అతని తల్లిదండ్రులు నిశ్చయించి ఈ విషయముమృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారిమాట లాలకించి ఇట్లుపలికెను, “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు  తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయముగూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు, దానికి కారణమేమనగా, ప్రతిపురుషునకు తనకనుకూలవతి యగు భార్య లభించినప్పుడే గృహాస్థాశ్రమము యొక్క ఫలితము సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ  యెటులుండవలయుననగా-

శ్లో: కార్యేషు దాసీ - కరణేషు మంత్రీ |
     శయనేషు రంభ - క్షమయా ధరిత్రీ ॥

అని పెద్దలు స్త్రీనిగురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచ కార్యములలో భర్తకు సహాయ కారిగాను, శయన మందిరములో రంభవలెను. శాంత స్వభావములో భూదేవివలెను స్త్రీ వ్యవహరించవలెను.

అంతియేగాక చతుర్విధ పురుపార్ధములయిన ధర్మము, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షము ప్రధానమైనది. అటువంటి 
మోక్షము సాధింపనెంచిన మిగతా  మూడున్నూ అనవనరము. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును.

ప్రతి మానవుడు వివాహముచేసుకొనే ముందు కన్యయొక్క గుణగణములు తెలుసుకోవలయును. జీవితసుఖములలో భార్య 
ప్రధానమైనది, కనుక గుణవంతురాలగు భార్యను పొందుటకన్న మరొక
స్వర్గము లేదు.

గుణవతియగు పత్నితో కాపురము చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా నుండుటయేగాక అట్టి  మనుజుడు ధర్మ-అర్థ - కామ- 
మోక్షముల నవలీలగా సాధించగలడు.

భార్య గయ్యాళి, వినయవిధేయతలు లేనిదై యున్నచో నాభర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూవమునే కే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులనకన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగ[గస్తురాలై వుండకూడదు. ఎంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవ బ్రహ్మణులను పూజించునాదియై. అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.

ఈ నీతులన్నీ మునుపు అగస్త్యమహాముని చెప్పియున్నారు. గాన ఆటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. 
ఆయినా ఆ దెటుల సాధ్యవడును? అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి ఇట్లు పలికెను.

"కుమారా! నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్న వాడవయిననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న నా దీనదయాళుడగు శ్రీ మన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము" అని పలికెను.

మాఘ పురాణం

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...