పెండ్లిగుమ్మడి గౌరీ నోము కథ
"పెండ్లిగుమ్మడి గౌరీ పేరక్కపట్టింది
ఇండ్లు వాకిండ్లలో నెపుడు కళ్యాణాలే
ఇండ్లు వాకిండ్లలో నెడతెగని పంటలే
ఇండ్లు వాకిండ్లలో నెడతెగని భాగ్యమే
గుమ్మడి పండువంటి కొడుకులూ అల్లుండ్రు
గుమ్మడి పండ్లువంటి కూతుండ్రు కోడండ్రు
మాణిక్యములవంటి మనుమలామందలు
పసుపులు కుంకుమలు పాయని భూషణములు
కలిగెనానందాలు కన్నుల పండుగలు
ఈనోము నోచిన యింతులకు కొదవే?"
ఈ పాట పాడుకొని అక్షతలు వేసికొనవలెను.
ఉద్యాపనము: మూడు బూడిద గుమ్మడిపండ్లు తెచ్చి వుంచుకొనవలెను. అందులో నొకపండు, మానెడు బియ్యము దక్షిణ తాంబూలములనుంచి, అవి పట్టుకొని బ్రాహ్మణుని యింటికివెళ్ళి అవి ఆయనకిచ్చి నమస్కరించి "నోము నోచికొందును వాయన మందు కొనుటకు రావలెన" ని యా బ్రాహ్మణ వృద్దుని బీలువవలెను. ఆయన మనయింటికి వచ్చిన తరువాత రెండవ గుమ్మడిపండు,
అడ్డెడు తవ్వెడు బియ్యము దక్షణ తాంబూలము ఆయనకిచ్చి నమస్కరించవలెను, ఆ తరువాత మూడవ గుమ్మడిపండును అయిదుశేర్ల బియ్యము, స్వయంపాకముతో పట్టుకొని బ్రాహ్మణుని యింటికివెళ్ళి, ఆయన భార్యకు వాయనమంతా అందించి, వారి యింటిలోనే ఆనాడు నోము చేసికొన్న యిల్లాలు భోజనము చేయవలెను.
Subscribe to:
Post Comments (Atom)
Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ
గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment