Monday, January 12, 2026

Devi Prathana - దేవి ప్రార్ధన

దేవి ప్రార్ధన

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్ ।
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః ॥

ఓ మాతా! తల్లీ! అమ్మా! జగజ్జననీ!నీవు శరశ్చంద్రిక లాగా పరిశుద్ధురాలివి.శశియుతమైన జటాజూటమే కిరీటముగా కలదానివి.రెండు హస్తాలలో వర, అభయ ముద్రలు దాల్చి వున్నావు.మిగిలిన రెండు చేతులలో అక్షమాలా,పుస్తకాలను ధరించి వున్నావు.అలాంటి నిన్ను కవీశ్వరులు ఒక్కసారి నమస్కరిస్తే చాలు.వారికి పూదేనియతో,గోక్షీరంతో,ద్రాక్షాఫలాలతో సాటివచ్చే మాధుర్యాన్ని గలిగిన మధురవాక్కులు సంప్రాప్తించేలా చేస్తావు.అలా వారికి ప్రాప్తించకుండా ఎలా ఉంటాయి?నీకు ఒక్కసారి మనస్పూర్తిగా మొక్కితేనే అన్ని వరాలిస్తావు.


No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...