Wednesday, January 21, 2026

Magha Puranam 4 - మాఘ పురాణం 4 కుత్సురుని వృత్రాంతము

మాఘ పురాణం - 4 వ అధ్యాయం

కుత్సురుని వృత్రాంతము
పులి మాఖముగల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మాహాత్మ్యము గురించి వశిష్టుడు తిరిగి ఇట్లు చెప్పదొడంగెను.

పూర్వ కాలమున కత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమ మునియొక్క కుమార్తెను వివాహామాడెను. కొంత కాలమున కా దంవతులకు ఒక కుమూరుడు జన్మించెను.

కుమారునికి అయిదవ యేడు రాగానే ఉవనయనము చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ది నొందుచు పెద్దలను గౌరవించుట, విద్యాభ్యాసముయెడ శ్రధ్దాజూపుట, నీతినియమాలను పాటించుట దైవ కార్యములయందు భక్తికలిగియుండట మొదలగు కార్యములను నెరవేర్చుచు 
సకలశాస్త్రముల నభ్యసిం చెను. 

ఈ విధముగా కొంత కాలము గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్ణయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్య క్షేత్రములను దర్శించుచు, సిద్ధులను సేవించుచు మాఘమాసము వచ్చునప్పటికీ కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.

"నా పుణ్యఫలము కొలది యీ మాఘమాసములో నాకు కావేరీ స్నానయోగము లభించినది, ఇదినా భాగ్యము” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.

"మాఘమాసమంతయు యిచటనేయుండి అధికఫలమును సంపాదించెదను" అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూ అచటనే కాలము గడుపుచుండెను. ఆ విధముగా నదీతీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాధించుటకు ఘోరతపమాచరించవలయునని తలంచి' ఆ సమీపమందొక పర్వతముపై  తవస్సు చేసికొన సంకల్పించి, తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంత కాలము నిష్టతోను నిచ్చల మనస్సుతోను తప
స్సుచేయుచుండెను, అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.

ఆ  విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖు, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి, నిండు విగ్రహాన్ని చూచాడు, అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.

ఈ విధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.

"ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటిని అది ఎటులనగా నీవు  విడవకుండ అనేక వర్యాయములు మాఘమాసములో నదీ స్నానముచేసి తపశ్శాలురు కూడ పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది, గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను" అని శ్రీమన్నారాయణుడు పలికెను.

శ్రీహరి పలికినపలుకులకు ఆ బ్రహ్మణుడు తన్మయుడై "ప్రభూ! జగద్రక్షకా! సర్వాంతర్యామి! ఆపద్భాంధవా! నారాయణా! నీ దివ్యదర్శనమువలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నామనస్సంగీకరించుట లేదు, మనుజుడు ఏ మహాభాగ్యముకొరకు జీవితాంతమువరకు దీక్షవహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొకకోరిక కోరగలనా? నాకింకేమియు అవసరములేదు, కాని మీ దివ్యదర్శనము నాకు ఎటుల
కనిపించినదో అటులనే అన్ని వేళలందూ ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్ధించెను.

శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెదగాక! అని పలికి నాటినుండి అచ్చటనే ఉండిపోయెను.

కొంత కాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తనగ్రామమునకు వెళ్ళెను, చాలదినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్న తల్లిదండ్రులు మిక్కిలి నంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.

మాఘ పురాణం

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...