ఈ రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు. అంతే కాదండోయ్ మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుకు ఒక గీతను గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం. వారు ఆ పక్కింటి వారి రథం ముగ్గుకు కలుపుతారు. ఇలా అందరూ తమ ముగ్గులను వేరే వారి ముగ్గులతో కలుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి గ్రామంలోని వాడ వాడ తిరిగుతాడని ప్రజల నమ్మకం.
సూర్యుడు అలా తిరగడం వల్ల ఆ సూర్య కిరణాలు తమ ఇంటిపై పడి తమకు అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అందుకే ఈ రోజు సూర్య దేవుడిని ప్రార్థిస్తే… ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అందుకే ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఆ దేవుడిని గుర్తు చేసుకుంటారు.సంక్రాంతి పండుగలో అంటే ముగ్గులకు ఇదే చివరి రోజు.
సంక్రాంతి అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను చేసుకుంటారు. కొన్ని చోట్ల భోగి, సంక్రాంతి, కనుమగా మరికొన్ని చోట్ల ముక్కనుమ అని నాలుగో రోజు పండుగను చేసుకుంటారు. అయితే మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి, మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు. అంతేకాకుండా పితృదేవతలనీ స్మరించుకుంటారు. వ్యవసాయంలో రైతుకు సాయం చేసే పశువులకు కృతజ్ఞతలు చెప్పేందుకు కనుమను చేసుకుంటారు.
అయితే కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనేది చూస్తే.. కనుమ రోజున ప్రయాణాలు చేయడం అరిష్టంగా భావిస్తారు.
సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ...ఇల్లంతా బంధువులతో కళకళాలాడే సమయంలో మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశంతో కూడా కనుమ రోజు ప్రయాణం చేయరాదని చెబుతారని అంటారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత పుట్టి ఉండొచ్చంటారు. పెద్దలను తలచుకుని మనం కూడా కాస్త కృతజ్ఞతాపూర్వకంగా నడుచుకోవాలి. అలాంటివి అన్నీ మర్చిపోయి మనం ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. అందుకనే కనుము నాడు ప్రయాణం చెయ్యొద్దన్నారు. అందుకని కనుమ నాడు ప్రయాణం చేయొద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు.
మూడవ రోజు కనుమను “పశువుల” పండుగ అని కూడా అంటారు. తమకు పాడిపంటలను సమృద్ధిగా అందించే పశువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ.. రైతు కుటుంబ సభ్యులు జరుపుకునే పండుగ. ఈరోజు తమతో పాటు పశువులు, పక్షులకు కూడా ఆహారం అందాలని.. ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు. ఇప్పటికీ ఈ పద్దతిని పల్లెల్లో కొందరు పాటిస్తూనే ఉన్నారు. అంతేకాదు ధనుర్మాసం నెల రోజుల పాటు వివిధ రంగ వల్లులతో తమ ఇంటి ముంగిటను అలంకరించే మహిళలు.. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పని సరిగా వేస్తారు.
రథం ముగ్గు విశిష్టత ఏమిటంటే..
ప్రతీ మనిషి శరీరం ఒక రథం అని .. ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే.. ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో.. వచ్చిన “సంక్రాంతి” పురుషుడు శుభాలని కలిగించాలని కోరుతూ.. ఇంటి ముంగిట రథం ముగ్గుని వేసి.. వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజచేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకూ సాగనంపుతారు.
ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక.. బలిచక్రవర్తి.. పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులూ గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తరవాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గువేస్తారని ఓ కథ

No comments:
Post a Comment