మూసివాయనాల నోము కథ
మూసివాయనాలు నోచిన భామకు మోసుకుపోయిందాకా పసుపు కుంకుమ, మూసివాయనాలు, నోచినకాంతకు, మోసుకు పోయిందాకా పాడిపంట, మూసివాయనాలు నోచిన యింతికి మోసుకుపోయిందాకా కడుపుచలువ, మూసివాయనాలు నోచిన వణలికి మోసుకుపోయిందాకా పెనిమిటి యనురాగం, మూసివాయనాలునోచిన భామకు మోసుకు పోయిందాకా చుట్టాల (పేమ, మూసివాయనాలు నోచిన మోసుకు పోయిందాకా యిహం మోసుకుపోయిందాక పరం.
ఈ పాట పాడుకొని అక్షింతలు వేసుకొనవలెను.
ఉద్యాపనము: ఈ నోము ఆరు మూసివాయనాలు ఆరుగురు ముత్తయిదువులకు ఇయ్యవలెను, పెద్ద చేటలతో ఇచ్చినవి పెద్ద మూసివాయనాలు చిన్న చేటలతో ఇచ్చినవి చిన్న మూసి వాయనాలు అందురు. ఎవరిశక్తి కొలది వారిచ్చెదరు. ఒక చేటనిండా కుంకుమపోసి పైని ఇంకొకచేట, బోర్లించి, రవికెలగుడ్డ, తాంబూలము, దక్షిణ నల్లపూసలు, లక్కజోళ్ళు పండ్లు పెట్టి యియ్యవలెను అట్లే ఒక చేట నిండా పసుపుపోసి పైన చేట బోర్లించి తాంబూలము దక్షిణ మొదలగుదానితో రెండో మూసివాయనము, ఇంకొక చేటనిండా నల్లపూసలుంచి రెండో చేట బోర్లించి తాంబూలము దక్షిణ మొదలైనవి వుంచి మూడోమూసి వాయనము, ఒకచేటనిండా పువ్వులు పోసి పైన చేట బోర్లించి తాంబూలము, దక్షణ మొదలైనవిపెట్టి నాలుగో మూసి
వాయనము, ఒకచేట నిండా పండ్లుపోసి పైన ఇంకొకచేట బోర్లించి తాంబూలము, దక్షిణ మొదలైనవి వుంచి అయిదో మూసివాయనము, ఒకచేటనిండా గాజులు పెట్టి పైన మరియొక చేట బోర్లించి తాంబూలము, దక్షిణ మొదలైనవి వుంచి ఆరో మూసివాయనము నియ్యవలెను. ఈ మూసివాయనాలన్నియు, ఒక్మమారైనను సరే, లేక ఒక్కొక్కటి చొప్పునైననుసరే రెండేసి మూడేసి చొప్పునైనను సరే వీలునుబట్టి యిచ్చు కొనవచ్చును.
Subscribe to:
Post Comments (Atom)
Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ
గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment