Saturday, January 10, 2026

Nitya Danamu Nomu Katha - నిత్యదానము నోము కథ

నిత్యదానము నోము కథ

“నిత్యదానముచేతి నియమంబు గలుగు
నిత్యదానముచేత కష్టములు తొలగు
నిత్యదానముచే నసత్యంబు తొలగు
నిత్యదానముచేత నిఖిలము లబియుంచు
నిత్యదానముచేత నిరయము నశియుంచు
నిత్యదానముచేత నెలతకు జూడ
నిత్యదానముచేత వైకుంఠమబ్బు”

యీపాట పాడుకొని అక్షతలు వేసికొని ఒక ఏడాది ప్రతిదినమును బ్రాహ్మణునకు చేరెడు బీయ్యము. ఒక కూరయు నిచ్చుచుండవలె.

ఉద్యాపనము: ఎద్దుతొక్కని ధాన్యమేదుం గుంచెడు జాగ్రత్త పెట్టుకొని, కొత్త పంచెలచాపుతో, శక్తికొలది దక్షిణతాంబూలములతో కాయగూరలతో, దుంపకూరలతో పిండివంట సామానులతో బ్రాహ్మణునకు దానము చేయవలెను.

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...