శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకవ్వుడు శౌనకాది మహోఋషులు లోక కళ్యాణార్థమై ఒక మహా యజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును, ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తి చేయవలయుననెడి దీక్షతో శౌనకాదిమునులు తలపెట్టి యజ్ఞ స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదితీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్దయజ్ఞము చూచి తరింపవలయున నెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞ స్థలసమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్యరులలో బ్రహ్మ తేజస్సు గల శత వృద్ధులు, వేదము లామూలాగ్రముగా నావగాహన చేసుకొన్న వేద మూార్తులు, సకలశాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆ విధముగా మునీశ్వరు లందరు తమ తమ శిష్యబృందముల తోను, వరివారములతోను, తండోప తండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను, ఆ యాగము సకలలోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణపురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతముణనుండి నచ్చిన ఋషులు సూతులవారి దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి, సూతులవారి ఆశీర్వాదం లతో నిర్విష్నుంగా యాగం జరుగునని అందరు నంతోషవడిరి.
సూత మహాముని సకలశాస్త్రములు ఆములాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు, వేద, పురాణ ఇతిహాసాది సమస్తవిషయము లందూ వారికి తెలియనిది లేదు, అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి, వారి ముఖ వర్చస్సునుండి బ్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్ల వేళల నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారమువలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమునమునకు స్వాగతంవలికి, సాష్టాంగ దండప్రణామం లాచరించి, యజ్ఞం జరుగు ఆ 12సంవత్సరములలో యెన్నియో పురాణగాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరు వేచియుండిరి.
సూతులవారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి ఫుణ్య కార్యములందు పురాణనఠనము గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యు క్తథర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతులవారికి ఆర్ఘ్యపాద్యంలొసగి ఉచితాసనంలపై ఆసీనులను జేసి "మునిశ్రేష్ఠ! మునితిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము, అనేక ఇతిహసములను ఆలకించి, అందలి సారమును గ్రహించియుంటిమి. సమయమువచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునేయున్నారు, అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారముచేసి యున్నందున ఎన్నో విషయములు మిరు అవగాహాన చేసుకొనియున్నారు, గాన వినదగు విషయాలేమైనా యున్న యెడల విరామకాలములో మాకు వినిపించవలయు” నని శౌనకాది మునులు ప్రార్ధించిరి.
ఆ ప్రకారముగా కోరిన శౌనకాదిమునులు తనవలన క్రొత్త సంగతులు తెలుసుకొన వలెననెడి కుతూహలం కనపఱచినందున - వారలను జూచి సూతమహాముని ఇటుల పలికిరి-
సుతామహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా " ధన్యులమైతి" మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూత ముహామునితో- “ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యమును మరల మరల వినవలయుననెడి కుతూహాలం కలుగుచున్నది, అదియునుగాక రాబోవుమాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసినదిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తవశ్శాలురు కోరుట వలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
"మునిపుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగచున్న సమయములో మాఘమాసంయొక్క- “మాహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు” డని సూతమహర్షి ఇట్లు వివరించిరి.
“నేను నాతండ్రి శిష్యుడగు రోమహర్షి శిష్యుడను. అతడు మహాతపస్వీ, జ్ఞాని, నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదవ్యాసమహర్షి కి ప్రియపాత్రుడను, వారి
దయవలన నాకు కలిగిన జ్ఞానముతో మీలాంటివారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తిసామర్ధ్యములు కలిగినవాడనయితిని, నేను తెలియజేయిచున్న నీతిబోధలు సకలలోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కుల గురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. అ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.
No comments:
Post a Comment