Sunday, January 11, 2026

Challa Chitta Chittha Nomu Katha - చల్లచిత్త నోము కథ

చల్లచిత్త నోము కథ

“చల్లచిత్తనోము నోచవేతల్లీ ! 
వెల్లయాపులపాడి చేయవే తల్లీ !
ఇల్లుపాలనేత్ర పలుకవేతల్లీ !
ఎల్లసొమ్ములు నీవు తాల్పవేతల్లీ !
చల్లనికడుపుతో సాగవే తల్లీ !
కొల్లయిగ సౌభాగ్యమేలవే తల్లీ !

ఈ పాటా పాడుకొని అక్షతలు వేసికొనవలయును. చల్లగిలకొట్టునప్పుడు చల్లకుండకు చుట్టును చిలికే చల్లచినుకులు పసుపుతోకలిపి ఒక ఎడాది ప్రతిదినము అయిదుగురు ముత్తయిదువులకు బొట్టు పెట్టు చుండవలెను. ఇది చిట్టిబొట్టు నోముతో కలిపి పట్టెదరు.

ఉద్యాపనము: పాడిగలరోజులలో ఒకనాడు చేసినచల్ల ఆనాటి వెన్నముద్దతో గూడ కుంభపాళముగా ఒక ముత్తయిదువకు వాయన మీయవలయును. దక్షణ తాంబూలము లీయవలయును.

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...