Wednesday, January 28, 2026

Magha Puranam 11 - మాఘ పురాణం 11 మార్కండేయుని వృత్తాంతము

మాఘ పురాణం - 11 వ అధ్యాయం

మార్కండేయుని వృత్తాంతము

వశిష్టులవారు దిలీపునకు మృగశృంగుని వివాహాం, మృకండుని జననము, కాశీ విశ్యనాధుని దర్శనం విశ్యనాధుని వరమునలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి

"మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము" అని వశిష్ఠులవారు ఈ విధంగా చెప్పదొడగిరి.

మార్కండేయుని అయువు 16 సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను.

అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి, అరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిర కాలములో సకల శాస్త్రములు, వేదాంత, పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసల నందెను.

"కుమారా! నీవు పసితనమందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్ధికుశలత చే అందరి మన్ననలను పొందుచున్నావు అందులకు మే మెంతయో ఆనందించుచున్నాము? ఆయినను గురువుల యెడ పెద్దల యెడ బ్రాహ్మణుల యెడ మరింత భక్తి భావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును, గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధియగును" అని చెప్పిరి.

అటుల పదిహేను సంవత్సరములు గడచిపోయినవి. రోజురోజుకీ తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగుచున్నది, పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి ముహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు.

మునీశ్వరులు గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమన్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించాడు అటుల చేసినందులకుఅందరూ ఆశ్చర్యపడి "మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి? అని ప్రశ్నించారు.

అంత వశిష్ఠులవారు! "ఈ బాలుడు కొద్ది దినముబలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవుకమ్ము" దీవించితిరిగదా! అదెటుల అగును? ఈతని ఆయుర్ధాయము పదహారేండ్లేగదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి.

అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి, “చిరంజీవివై వర్ధిల్లు" మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని భాధవడి “ దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్ఠులవారినే ప్రశ్నించారు. వశిష్ఠులవారు కొంత సేపాలోచించి మునిసత్తములారా! వినుడు. మన మందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండి" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి.

మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరి తోపాటు మార్కండేయుడు కూడ నమస్కరించగా బ్రహ్మ "చిరంజీవిగా జీవించు నాయినా” యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయవడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి "పరమేశ్యరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక” యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి "ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగ నేరదు. అని పలికి, వత్సా! మార్కండేయా నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీ కే యాపద కలుగదు, గాన నీవట్లు చేయుము".

మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాధుని సేవించి వచ్చెదను, అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండుడు అతనిభార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదన లేక కుమారుని విడిచిపెట్టి యుండలేక, అందరూ కాశీక్షేత్రమునకు బయలు దేరిరి.

కుటుంబసహితముగా కాశీకిపోయి మృకండుడు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు సదాశివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముకడనే యుండెను.

పదహారవయేడు ప్రవేశించెను. మరణసమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములుగొని తెమ్మని అజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ఛ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చునరికి భటులు ఆ సమీపమందు నిలువ లేకపోయిరి. కాలపాశము విసరుటచే చేతులు ఎత్త లేకపోయారు, మార్కండేయునిచుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణములవలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యమున కెరిగించగా - యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయున్నిపై కాలపాశమువిసరెను, మార్కండేయుడు కన్నులు తెరచిచూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయవడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కై లాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమునుచీల్చుకొనివచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను.

యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేకవిధముల ప్రార్థించి జటాధారి కోవమును చల్లార్చు మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమ వర ప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరకదా! అతని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా, గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి "యమా ! నీవు నాభక్తుల దరికి రావలదు సుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.

పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాసఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...