Wednesday, January 21, 2026

Magha Puranam 2 - మాఘ పురాణం 2 దిలీప మహారాజు వేటకు బయలుదేరుట

మాఘ పురాణం - 2 వ అధ్యాయం

దిలీప మహారాజు వేటకు బయలుదేరుట
దిలీపుడను మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్నివిధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారాలకైననూ నెరవేర్చుకొనుట సహజమేకదా! ఆ విధంగానే దిలీప 
మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు
కావలసిన సమస్త వస్తువులను సిద్ధంచేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను.

దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూరమృగములతో నిండియున్నది. ఆ 
క్రూరజంతువులు సమీపమందున్న గ్రామములపై పడి వశువులను, మనుషులను చంపి నానా భీభత్సములు  చేయుచున్నవి. 

దీలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన వరివారముకూడా మృగంలను మట్టు పెట్టుచుండిరి, ఇలా కొన్ని రోజులవరకూ అడవియందు వుండి అనేక 
క్రూరజంతువులను చంపిరి.
ఒకనాడొక మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందుమృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరివారము పరుగిడుచుండగా, ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికీ దిలీపుడు అలసిపోయినందున దాహం చేత నాలుక ఎండిపోతున్నది.నీటికొరకు పరివారమంతా వెదకు చుండిరి, అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమిపించెను, ఆ సరస్సు అంతులేని “తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను, దిలీపుడూ, అతని పరివారమూ, తృప్తిదీర నీరు నీరు త్రాగిరి. గట్టుపైన  వున్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు "వేటలో చెల్లా చెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవిపందులు మొదలగు జంతువులుకూడా ఆ సరస్సువద్దకే  వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము, వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించీ తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.

అటుల ఇంటిముఖము పట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదుర య్యెను, ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు
అగి నమన్కరించి చేతులుజోడించి నిలబడియుండెను, 
ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి - “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారం
చేయుట మంచిది” అని మనసులో తలచి- "మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసములో సరస్సు దగ్గరలో వున్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్న వేమి? మాఘమాస  మాహాత్మ్యం నీకు తెలియదా! అని ప్రశ్నించెను.

ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి అ వృద్ధ బ్రాహ్మణుని జూచి-"విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమి?” అని ఆశ్చర్యంతో పలికెను.

“పరమపావనమైన మాఘమాసంకదా!" అని జ్ఞాపకం చేయుచుంటినని 
ఆ బ్రాహ్మణుడు పలికెను.

“చిత్తము స్వామి! నాకు గుర్తులేదు. రాజప్రసాదముననున్న పురోహితులు చేప్పియుందురు, నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినము లుండొటవలన నాకా విషయం జ్ఞ ప్తి లేదు. కావున మాఘమాస మాహాత్మ్యము నెరింగింపవలసినదిగా ప్రార్థించుచున్నా” నని దిలీపుడు వేడుకొనెను.

“రాజా! ఈసరస్సులో స్నానమాచరించి శుచివై ఇటకురమ్ము. ఆ పిమ్మట మాఘమాస మాహాత్మ్యమును గురించి తెలిసికొను విధము చెప్పెదను” అని 
బ్రాహ్మణుడు పలుకగా రాజు సరస్సునకు వెళ్ళి స్నానమాచరించి వచ్చెను.

ఆ 
బ్రాహ్మణుడు దిలీపుని  దీవించి "రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును గదా! అతనివలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము.
ఆ మహామునికి తెలియనిది ఏదీయు లేదు, గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను,

దిలీపుడు వశి
ష్ఠుని కడకు బోవుట
దిలీపుడు తన వరివారంతో నగరము జేరెను. పదేపదే 
బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడపెను.

మరునాడు ప్రాతః కాలమున లేచి, కాలకృత్యములు దీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి సామంతతాదులతో 
వశిష్ఠులవారి దర్శనమున్నకై వారి ఆశ్రమమునను వెళ్ళెను.

ఆసమయములో వశిష్టులవారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు "వేదపఠనము గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు 
వశిష్టులవారు గురుతుల్యులు. అందుచే
గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంత సేపటికి వశిష్టుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండ బెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.


దిలీపుడు 
వశిష్టునితో "ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడ నైతిని. కాని, మాఘమాస మాహాత్మ్యమునుగాని, దాని ధర్మములుగాని తెలియ
నందున ఆ విషయములు తమనుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చితిని, గాన పరమపావనమూ మంగళప్రదమూ అయినా మాఘమాస మాహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుతున్నాను" అనెను.

అవును మహారాజా! నీవుకోరినకోరిక సమంజసమైనదే, మాఘమాసముయొక్క మాహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.

మూఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడ శక్యము గాదు. ఇతరదినములలో చేయు క్రతువులుగాని యాగములుగాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీస్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు మాఘమాసము అన్ని విధాలా పుణ్య ప్రదమైనది.

అంతే కాక పుణ్య కార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికముగ కలుగునుగాని మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తికలుగును. ఇంతకన్నమహత్తు గలది 
మరొకటి లేదు.

మాఘ పురాణం

No comments:

Post a Comment