మాఘ పూర్ణిమ సందర్భంగా నదిలో స్నానం చేయడం ఎంతో పుణ్యం. స్నానం చేసిన తర్వాత అన్నదానం దానధర్మాల వల్ల మీ జీవితంలోని పాపాలు, గత జన్మ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
పూర్ణిమ రోజున, శ్రీమహావిష్ణువు కు ఎంతో ప్రీతికరమైన రోజు. కావున ఆరోజు విష్ణు అవతారలకు మరియు హనుమంతుని పూజిస్తారు. ఈ రోజున విష్ణువు, హనుమంతుని పూజించిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.
మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు తొలగడానికి మాఘ పౌర్ణమి రోజు సూర్యుడిని, అమ్మవారిని పూజించాలి.
మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి మంత్ర సాధన చేయడం యంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. త్వరగా మంత్ర సిద్ధి జరుగుతుంది. పౌర్ణమి రోజున అమ్మవారి మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. దశమహావిద్యలు త్వరగా సిద్ధిస్తాయి.
మాఘ మాసంలో దేవతలు స్వర్గం నుండి దిగి గంగా నది ఒడ్డున ఉంటారని చెప్తారు. ఈ మాఘ పూర్ణిమ రోజున నదీస్నానం లేదా సముద్రస్నానం ఎంతో శ్రేయోదాయకం. ముఖ్యంగా గంగానది సముద్రంలో కలిసేచోటు అనగా గంగాసాగర్ లో పుణ్యస్నాన మాచరించిన ఎంతో పుణ్యప్రదం.
ప్రస్తుతం సూర్యుడు మకరరాశిలో ఉంటాడు, చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, మాఘ పూర్ణిమ నాడు నదీ లేదా సముద్ర స్నానం చేయడం వల్ల సూర్యచంద్రులకు సంబంధించిన అన్ని కష్టాలు తీరుతాయని నమ్ముతారు. మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల శరీరానికి బలం మరియు శక్తి లభిస్తుంది.
మాఘ పూర్ణిమ కథ
పురాణాల ప్రకారం, ధనేశ్వర్ అనే బ్రాహ్మాణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండదు. ఓరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళిక దేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటినుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా, కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.
చంద్ర దోషం నుంచి విముక్తి కోసం
ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ‘ఓం శ్రామ్ శ్రీమ్ శ్రౌమ్ సః చంద్రాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి.

No comments:
Post a Comment