పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది. ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఆ సయమంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీ వారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహా లక్ష్మిని చేసి జిల్లేడు పూలతో, ఆకులతో పూజచేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం బెల్లం నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకు సుశీల పెద్దదవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయింది. అప్పుడు కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూవచ్చింది. కానీ అత్తింట్లో మాత్రం నిత్య కల్యాణం.. పచ్చ తోరణమైంది.
తరువాత కొన్నాళ్ళకు తమ్ముని వర్తమానము తెలియక మరల నా చిన్నది కబురంపగా నా తమ్ముడు వచ్చెను. అతనిని గాంచి నాయనా స్థితి యెలాగున్నదిని యడుగగా"మునుపటి వలెనే యున్నదిని యాతడు చెప్పెను. అప్పుడామె యొక చెప్పుల జోడు కుట్టించి దాని నిండా వరహాలుపోసి అందులో గడ్డ పెట్టి ఈజోడు పట్టుకువెళ్ళి నాన్నకీయమని తమ్మునకిచ్చెను. అతడా చెప్పుల జోడు పుచ్చుకొని యొక చెరువు గట్టుదగ్గరకు వెళ్లుసరికి వానికి దాహమై యాజోడు నక్కడపెట్టి చెరువులోనికి వెళ్లెను. అప్పుడొక కుక్కవచ్చి అజోడెత్తుకొనిపోయెను. దాహము పుచ్చుకొని పైకివచ్చి మాతడు గట్టున పెట్టిన జోడునుగానక యింటికి వెళ్లెను.
కొన్నాళ్ళకు తిరుగ వానిని అక్కగారు కబురంపగా నాతడు యూరికేగెను. యేమి "నాయనా! ఏలాగున్నది మీ స్థితియని" వానినడిగెను. ఎప్పటిలాగేయున్నదని యాతడు చెప్పెను. అప్పుడామె యొక గుమ్మడి కాయ దొలిపించి దానినిండా వరహాలుపోసి యది పట్టుకొని వెళ్లుమని తమ్మునికి కిచ్చెను. ఆ కాయ నతడు పట్టుకొనివచ్చి చెరువుగట్టుమీదబెట్టి కాళ్ళు కడుగుకొనుచుండగా నాదారిని పోవుచున్న కోమటి యొకడా కాయను పట్టుకొనిపోయెను. ఒడ్డునకువచ్చి కాయను కానక బ్రాహ్మణ బాలుడు తన యింటికిపోయెను. కోమటి తన యింటివద్దకు వెళ్ళి యాకాయను కొట్టగా యందువరహాలు నిండియుండెను.
అప్పుడా బ్రాహ్మణచిన్నది తన పుట్టింటివారి సంగతి యెట్టున్నరో తెలిసికుందామని యచ్చటికి వచ్చెను, వారు మిక్కిలి దరిద్రులై యుండిరి. అప్పుడామె తల్లిని తీసుకొని వెళ్ళి మార్గశిర లక్ష్మివారము నోము నోపించిన నింత యన్నము కలుగునని తలంచినదై యట్లు తల్లిని తీసుకొనివెళ్ళెను. ఇంటికి వెళ్ళిన తరువాత “అమ్మా! ఈ రోజున మార్గశిర లక్ష్మీవారము కాబట్టి నోట్లోయేమీ వేసుకొనవద్దని చెప్పెను. ఆమె సరే యని చెప్పి పిల్లలకు చద్దియన్నము పెట్టుచు నొక ముద్ద నోటిలో వేసికొనెను. అప్పుడు బ్రాహ్మణచిన్నది తల్లితో "అమ్మా! స్నానము చేయుము నోము నోచుకొందమని చెప్పగా తల్లి అయ్యో! పిల్లలకు అన్నము పెట్టుచు మరచిపోయి యొక ముద్ద నోట
వేసికొన్నానిని చెప్పెను. అప్పుడు చిన్నది ఇక నేవిధముగ చేతను వీండ్రకు భాగ్యము
అంటదనుకొ”ని తాను మాత్రము నోచుకొన్నదట.

అంతట రెండవవారము తల్లిని బిలిచి అమ్మా! ఈవేళ లక్ష్మివారము, నోట యేమీ వేసికొనకని చెప్పెను. అందుకామె అలాగేనని పిల్లలకు తలంటుచు ఆగిన్నెలో నూనె మిగులగా తలకు రాసుకొన్నదట. అంత కూతురు వచ్చి అమ్మా! స్నానము చేయుమని చెప్పగా అయ్యో అమ్మా! పిల్లలకు రాయగా మిగిలిన నూనెయుండ నాతలకు రాసుకొన్నానని చెప్పెను. పోనీలే యినచెప్పి తాను మాత్రము నోచుకొనెను.
అంత మూడవవారము రాగా తల్లిని బిలిచి "అమ్మా! ఈవేళ లక్ష్మివారము నోటిలో నేమియు వేసికొనవద్దని చెప్పగా నామె 'యలాగే' యని పిల్లలకు తలదువ్వుచు తనతల దువ్వుకొని కొప్పు పెట్టుకొనెను. ఆ వారము కూడా తాను మాత్రమే నోచుకొని యాచిన్నది.
నాల్గవ వారము రాగా గోయితీసి యందులో తల్లిని కూర్చుండబెట్టి బల్లమూత వేయించెను. పిల్లలందరు అరటిపండ్లు తిని యాతొక్కలు తీసుకొనిపోయి అమ్మా ! యిదిగోనని బల్లసందులో నుండి పడవేయగా నామె వానిని తిని వేసెను. అంత కూతురువచ్చి స్నానము చేయుమని చెప్పగా “అయ్యో! అమ్మాయీ అరటిపండు తొక్కలు తిన్నానని చెప్పెను.
ఉద్యాపనము: నాలుగు వారములు నోము నోచుకొని కధ చెప్పి అక్షింతలు వేసుకొని ముత్తయిదువులను పెట్టుకొని నేతి పిండివంట వండుకొని నోము నోచు కొనవలయును.
No comments:
Post a Comment