Friday, March 20, 2026

Mantradrashta Rishis - మంత్రద్రష్టలైన ఋషులు

మంత్రద్రష్టలైన ఋషులు

బ్రహ్మమానసపుత్రులైన 

1.భృగువు 
2.మరీచి 
3.అత్రి 
4. అంగిరసుడు
5.పులహుడు 
6.క్రతువు 
7.మనువు 
8.దక్షుడు 
9.వసిష్టుడు 
10.పులస్త్యుడు

అనే పదిమంది ఈశ్వర సమానులు, సర్వసమర్ధులు తమకు బ్రహ్మదేవుడు అప్పగించిన కార్యక్రమాల నిర్వహణలో సంపూర్ణమైన ప్రజ్ఞాపాటవాలు అధికారాలు కలిగినవారు. ఆత్మ తత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నవారు. అందుకే వీరిని ఋషులు అంటారు. ఋషులందరిలో వీరంతా మొదటివారు చాలా గొప్పవారు అవటం వల్ల వీరినే మహర్షులు అని వ్యవహరిస్తారు.

ఈ పదిమంది మహర్షుల కుమారులు కూడా మహర్షులే. 

కావ్యుడు,
బృహస్పతి, 
కశ్యపుడు, 
ఉతథ్యుడు, 
వామదేవుడు, 
అగస్త్యుడు, 
కౌశికుడు,
కర్దముడు, 
వాలఖిల్యుడు, 
విశ్రవసుడు, 
శక్తివర్ధనుడు 

అనేవారు. వీరంతాకూడా తమ తపశ్శక్తితో ఋషిత్వాన్ని పొందారు. తరువాత వారికి “ఋషికులు” అనే

వత్సరుడు, 
భరద్వాజుడు, 
వీర్యవాన్‌ దీర్ఘతముడు, 
బృహద్వక్షసుడు, 
శరద్వాన్‌,
వాజశ్రవన్‌, 
సుచింతుడు, 
పరాశరుడు, 
శృంగి, 
శంఖపాతుడు, 
వైశ్రవణుడు

వంటి బుషులు జన్మించారు.

భృగువంశ ఋషులు: భృగువంశ ఋషులు, 
షికులలో ఎంతో మంది మంత్ర ద్రష్టలుగా కీర్తిగాంచారు. వారెవరంటే ! 

భృగువు 
కాశ్యపుడు, 
ప్రచేతసుడు,
దధీచి, 
ఆత్మవాన్‌, 
ఊర్వుడు, 
జమదగ్ని 
వేదుడు, 
సారస్వతుడు, 
అర్షిషేణుడు,
చ్యవనుడు, 
వీతహవ్యుడు, 
వేధనుడు, 
వైన్యుడు, 
పృథువు, 
దివోదాసుడు,
బ్రహ్మస్మాన్‌, 
గృత్సుడు, 
శౌనకుడు. 
ఈ పంతొమ్మిది మందీ భృగువంశానికి చెందిన మంత్రద్రష్టలు.

అంగిరమహర్షి వంశ
షులు: అంగిరసమహార్షి వంశంలోజన్మించిన షులు
అంగిరసే, 
వేధనుడు, 
భారద్వాజుడు, 
లక్ష్మణుడు, 
కృతవాచుడు,
గర్గుడు, 
స్మృతి, 
సంకృతి, 
తురవీతుడు, 
మాంధాత, 
అంబరీషుడు,
యవనాశ్వుడు, 
పురుకుత్సుడు, 
స్వశ్రవుడు, 
సదస్యుడు, 
అజమీఢుడు,
అస్వహార్యుడు, 
ఉత్కలుడు, 
కవి, 
వృషదశ్వుడు, 
విరూపుడు, 
కావ్యుడు,
ముద్గలుడు, 
ఉతచభ్యుడు, 
శరద్వాన్‌, 
వాజిశ్రవసుడు, 
అపస్యోషుడు, 
సుచిత్తి,
వామదేవుడు,
 షిజుడు, 
బృహచుక్షుడు, 
దీర్ఘతమస్‌, 
కక్షీవాన్‌ 
అనే షులు ఈ వంశంలో జన్మించిన మంత్రద్రష్టలు

కశ్యపవంశ 
షులు : 
కాశ్యపుడు, 
వత్సారుడు, 
నైధ్రువుడు, 
నిత్యుడు,
అసితుడు, 
దేవలుడు 
అనే ఆరుగురు ఈ వంశంలోజన్మించిన మంత్రద్రష్టలు.

అత్రివంశ 
షులు : 
అత్రి, 
అర్థస్యనుడు, 
శ్వావాశ్వుడు, 
గవిష్టిరుడు, 
కర్ణికుడు,
తపస్సిద్దుడు 
అనే ఆరుగురు షులు ఈ వంశంలో జన్మించిన మంత్రద్రష్టలు.

వశిష్ఠ వంశ 
షులు : 
వసిష్టుడు, 
శక్తి, 
పరాశరుడు, 
ఇంద్రప్రమితి, 
భరద్వసువు,
మిత్రావరుణుడు, 
కుండినుడు 
అనే ఏడుగురు ఈ వంశానికి చెందిన మంత్రద్రష్టలు.

కౌశిక వంశ
షులు: 
గాధిపుత్రుడైన విశ్వామిత్రుడు, 
దేవరాతుడు, 
బలుడు,
మధుఛందుడు, 
అఘమర్షణుడు, 
అష్టకుడు, 
లోహితుడు, 
భృతకీలుడు, 
మాంబుధి,
దేవశ్రవస్‌, 
ధనుంజయుడు, 
శిశిరుడు, 
శాలంకాయనుడు 
అనే వారు కౌశిక వంశంలో జన్మించిన మంత్రద్రష్టలు.

అగస్త్య మహర్షి వంశ 
షులు: 
అగస్త్యుడు, 
దృఢద్యుమ్నుడు, 
ఇంద్రబాహువు
అనే ముగ్గురూ అగస్త్యవంశంలో జన్మించిన మంత్ర ద్రష్టలు.

క్షత్రియులలో మంత్ర ద్రష్టలు : 
వైవస్వతమనువు, 
ఇలాపుత్రుడైన పురూరవుడు
ఈ ఇద్దరూ క్షత్రియులలో శ్రేష్ఠులైన మంత్రదష్టలు, మంత్రవేత్తలు.

వైశ్య మంత్రద్రష్టలు: 
భలందకుడు, 
వాసాశ్వుడు, 
సంకాలుడు
ఈ ముగ్గురూ వైశ్యులలో ప్రసిద్ధి పొందిన మంత్రద్రష్టలు.

పార్వతి గౌరిగా మారటం

మత్స్య పురాణము

No comments:

Post a Comment