Friday, March 20, 2026

The time scale of the four yugas - నాలుగు యుగాల పరిమాణం

నాలుగు యుగాల పరిమాణం

1. కృతయుగం: నాలుగువేల దివ్య వర్షాలు. కృతయుగం పరిమాణం నాలుగు వందల దివ్య వర్షాలు. దీనికి సంధ్య అంటే కాలం సంధ్యాశం. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలతో అధర్మం పావు భాగం కన్నా చాలా తక్కువగావుంటుంది. ఆ యుగంలో మానవులందరూ స్వధర్మనిరతులుగా వుంటారు. విప్రులు విప్రధర్మాన్ని, క్షత్రియులు క్షత్రియధర్నాన్ని వైశ్యులు వైశ్యధర్మాన్ని, శూద్రులు శూద్రధర్మాన్ని ఆచరిస్తూ సజ్జనులుగా వుంటారు. సత్యం, శౌచం, ధర్మం వృద్ధి చెందుతుంటుంది. సజ్జనులు ఆచరించే కర్మల్ని అందరూ మెచ్చుకుని తాము కూడా ఆచరించేవారు. నీచ కర్మలు ఆచరించేవారు కూడా తమ తప్పుల్ని తెలుసుకొని పరివర్తన పొందేవారు. ఈ విధంగా 
కృతయుగంలో అందరూ సన్మార్గులు గానే వుండేవారు.

2. త్రేతాయుగం: మూడు వేల దివ్యవర్షాల పరిమాణం కలది త్రేతాయుగం. మూడువందల దివ్య వర్షాలు దానికి సంధ్య, అంతే సంఖ్యలో సంధ్యాశం వుంటుంది. ఈ యుగంలో మూడు పాదాలతో ధర్మం నడుస్తుంది. రెండు పాదాలకన్నా కాస్త తక్కువగా అధర్మం వుంటుంది. శాస్త్రాధ్యయనం. సత్యం, బలం, క్షమ, ధర్మం అనే వాటిని ఆ యుగంలో వున్నవారు ఆచరిస్తూవుంటారు. వీటివల్ల ఆ యుగంలో ప్రజలు దుర్బలులుగా మారుతారు. ఈ విధంగా త్రేతాయుగం వుంటుంది.

3. ద్వాపరయుగం: రెండువేల దివ్య వర్షాలు ద్వాపరయుగ పరిమాణం. రెండు వందల దివ్య వర్షాలు దాని సంధ్యాకాలం. అంతే పరిమాణం దానికి సంధ్యాశం. ఆయుగంలో మానవులంతా రజోగుణ వంతులై అర్థానికి ప్రాధాన్యత నిస్తారు. చాలా వరకూ క్షుద్రులు, మోసగాళ్ళు వుంటారు. ఆయుగంలో ధర్మం రెండుపాదాలతో వుండగా అధర్మం మూడు పాదాలకన్నా కాస్త తక్కువగా వుంటుంది. దీనివల్ల క్రమంగా కలియుగం వచ్చేసరికి ధర్మం క్షయమవుతుంది. ద్వాపరయుగం ముగిసేనాటికి క్రమక్రమంగా బ్రాహ్మణులమీద, వైదిక ధర్మాలమీద ఆసక్తి తగ్గుతుంది. అందరూ వ్రతాల్ని ఉపాసనల్ని విడిచిపెడతారు.

4. కలియుగం: అన్ని యుగాల కన్నా కలియుగం చాలా క్రూరంగా వుంటుంది. ఒక వేయి దివ్య వర్షాలు కలియుగ పరిమాణం. వంద దివ్య సంవత్సరాలు ఈ యుగానికి సంధ్యాకాలం. అంతే పరిమాణంలో సంధ్యాశం వుంటుంది. ఈ యుగంలో అధర్మం నాలుగు పాదాల్లో వుంటుంది. ధర్మం ఒక పాదం కన్నా కాస్త తక్కువగా వుంటుంది. మానవులందరూ కాముక ప్రవృత్తితో వుంటారు. తమోగుణ ప్రధానులై నాస్తికులుగా మారి నేనే సర్వసం అన్న అహంకారంతో వుంటారు. విప్రులందరూ శూద్రుల్లాగా ప్రవర్తిస్తారు. ఆశ్రమధర్మాలన్నీ వ్యత్యస్తంగా మారిపోతాయి. యుగం చివరి నాటికి అసలు వర్ణవ్యవస్థ వుంటుందా లేదా అనిపిస్తుంది.

ప్రళయం: పన్నెండు దివ్యవర్షాలు ఒక చతుర్యుగం. వేయి చతుర్యుగాలు బ్రహ్మ దేవుడికి ఒక పగలు. ఆ పగలు గడవగానే సకల ప్రాణులు శరీరాల్ని నాశనం చేసి, లోక సంహారం చేయాలనే సంకల్పంతో మహాభూతాలకి అధిపతి అయిన నారాయణుడు, సర్వదేవతలు, దైత్యదానవ, యక్షరాక్షస పక్షి గంధర్వాదులు, పర్వతాలు, నదులు సమస్త క్రిమి కీటకాది ప్రాణులు, జడపదార్థాల నుంచి పంచభూతాలని ఉపసంహరిస్తాడు.

సృష్టి సంహారం కోసం ఎంతో హింసని చేస్తాడు. ఆ విధంగా వాయువుగా మారి ప్రాణుల్ని ఉపహరించి, అగ్నిలా మారి సకలలోకాల్నీ దహించి, చివరికి భయంకరమైన మేఘాలుగా మారి కుంభవృష్టి కురిపిస్తాడు.


అంధకాసుర సంహారం
పూర్వం 'అంధకుడు' అనే రాక్షసుడుండేవాడు. నల్లని కాటుక కొండలాంటి శరీరంతో మహా భయంకరంగా కనిపించేవాడు. గొప్ప తపస్సంపన్నుడు. దేవతలకి కూడా అసాధ్యుడు. ఒకనాడు ఆ అంధకాసురుడు పార్వతీ దేవితో విహరిస్తున్న శివుణ్ణి చూసాడు. అకారణంగా శివుడి మీద అతడికి ద్వేషం కలిగింది. ఎలాగైనా శంకరుణ్జి సంహరించాలనుకున్నాడు. అవంతీదేశంలో వున్న ఘోరమైన మహాకాలవనంలో అంధకాసురుడికి, పరమేశ్వరుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అంధకాసురుడి వల్ల శివుడికి చాలా బాధ కలిగింది. కొంత సమయం యుద్ధం గడిచాక ఆగ్రహంతో శివుడు తన పాశుపతాస్త్రాన్ని అంధకుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకి అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తం నుంచి తిరిగి ఎన్నో వేల మంది అంధకాసురులు పుట్టుకురాసాగారు.

ఆవిధంగా కొత్తగా ఎంతో మందిఅంధకాసురులు పుట్టుకు రావటంతో వచ్చిన వారందరినీ సంహరించి, ఆ అంధకుడి రక్తాన్ని త్రాగటానికి శివుడు మాతృకలు అనే దేవతల్ని సృష్టించాడు. వారెవరంటే! 


మత్స్య పురాణము

No comments:

Post a Comment