Friday, March 20, 2026

Yadu Dynasty - యదువంశం

యదువంశం

యయాతి చక్రవర్తి కుమారుడు యదువు. ఆయనకి మహావీరులు, మహాధానుష్కులు అయిన సహస్రజిత్‌, క్రోష్టుడు, నీలుడు, బకుడు, లఘువు అనే అయిదుగురు కుమారులు జన్మించారు. వీరిలో సహస్రజిత్‌ కుమారుడైన శతజిత్‌కి, హైహయ, హయ, వేణుహయ అనే ముగ్గురు పుత్రులు జన్మించారు.

వీరిలో హైహయుడికి ధర్మనేత్రుడు జన్మించగా అతడికి కుంతి అనేవాడు, కుంతికి సంహతుడు, సంహతుడికి మహిముడు, ఆ మహిముడికి భద్రశ్రేణ్యుడు అనేవారు పరంపరగా జన్మించారు. వీరిలో చివరివాడైన భద్రశ్రేణ్యుడు వారణాసీపట్టణానికి రాజుగా వున్నాడు.

భద్రశ్రేణుడికి దుర్గముడు పుత్రుడుగా జన్మించాడు. దుర్గముడికి కనకుడు, కనకుడికి మహావీర్యవంతులైన కృతవీర్యుడు, కృతాగ్ని కృతధర్ముడు, కృతేజుడు అనే నలుగురు పుత్రులు ఉదయించారు. వీరిలో గొప్పవాడైన కృతవీర్యుడి కుమారుడే కార్తవీర్యార్టునుడుగా విఖ్యాతి చెందాడు.

ఈకార్తవీర్యార్టునుడే అత్రిముని కుమారుడైన దత్తాత్రేయుణ్లి ఆరాధించి ఆయన ద్వారా అలభ్యమైన ఎన్నో వరాలు పొందాడు. వేయి చేతులతో మహావీరుడుగా విశ్వమంతా జయించి ఎంతో గొప్ప వాడుగా కీర్తిగాంచాడు. ఈ కార్తవీర్యార్డునుడికి వందమంది పుత్రులు జన్మించారు. వారందరూ కూడా
మహావీరులు ధర్మపరాయణులే, ఈ వందమంది కుమారులలో శూరసేనుడు, శూరుడు, వృష్టి, కృష్ణుడు, జయధ్వజుడు అనేవారు ముఖ్యులు.

వీరిలో జయధ్వజుడు అవంతీనగరాన్ని నిర్మించాడు. అతడి కుమారుడైన తాళజంఝుడు నూరు మంది పుత్రుల్ని కన్నాడు. ఈ వందమంది కుమారుల్లో నీతిహోత్రులు, భోజులు, అవంతులు, తుండికేసరులు, తాలజం
ఝులు అనే వంశాలవారు సుప్రసిద్దులు.

ఈవిధంగా యదువంశంలో కృతవీర్యుడి కుమారుడైన కార్తవీర్యార్జునుడు సుప్రసిద్దుడై వేయిచేతులతో సముద్రం వరకూ వున్న భూమండలాన్నంతా జయించి పుత్ర పౌత్ర ప్రపౌత్రులతో వర్ధిల్లాడు. ఈ కార్తవీర్యుడి పేరు తలచినవారికి ధననష్టం కలగదు. పోయిన ద్రవ్యం తిరిగి లభిస్తుంది.

శూరవంశం

'వృష్టి' మహారాజు కుమారులలో ఒకడు దేవమీధ్వాన్‌. అతడికి ఇక్ష్వాకి అనే రాజకుమారికి శూరుడనే పుత్రడు ఉదయించాడు. ఆ శూరుడికి భోజ అనే రాజకుమారికి 
1. వసుదేవుడు 
2.దేవభాగుడు 
3.దేవశ్రవసుడు 
4. అనాదృష్టి
5.శిబి 
6నందుడు 
7.స్ఫంజయుడు 
8. శ్యాముడు 
9. సామీకుడు 
10.సంయూపుడు
అనే పదిమంది పుత్రులు జన్మించారు. వీరితో పాటు 
1.శ్రుతకీర్తి 
2.పృధ
3. శ్రుతదేవి 
4.శ్రుతశ్రవ 
4.రాజాధిదేవి అనే కూమార్తెలు కూడా పుట్టారు.

వీరందరూ వీరమాతలుగా ఖ్యాతి పొందారు. 
శ్రుతదేవికి క్రుతుడనే భర్తవల్ల సుగ్రహుడనేవాడు, శ్రుతకీర్తికి కైకేయుడనేవాడి వల్ల సునీథుడు, రాజాధిదేవికి బర్హిషుడి వల్ల ధర్మాత్ముడైన 
అరిమర్దనుడు అనే కుమారులు కలిగారు. వృద్ధుడైన శూరుడు తన మిత్రుడైన కుంతిభోజుడికి సంతానం లేకపోవటంతో తన కుమార్తె పృధని ఆమెకి కూతురుగా దత్తత ఇచ్చాడు. ఆనాటి నుంచి పృధకి కుంతి అనే పేరు వచ్చింది. ఈమె శూరసేనుడి పుత్రుడైన వసుదేవుడి చెల్లెలు. తండ్రి మరణానంతరం వసుదేవుడు తన చెల్లెలు కుంతిని పాండురాజుకిచ్చి వివాహం చేసాడు.  పాండురాజు శాపగ్రస్తుడుకాగా తరువాత కుంతికి ధర్మరాజు అనుగ్రహంతో యుధిష్టిరుడు, వాయుదేవుడి వల్ల భీముడు, ఇంద్రుడి అనుగ్రహంతో అర్జునుడు జన్మించారు. పాండురాజు రెండోభార్య అయిన మాద్రికి అశ్వినీదేవతల అనుగ్రహంతో నకుల, సహదేవులు జన్మించారు.

వసుదేవుడికి పూరువంశంలో జన్మించిన రోహిణీదేవితో వివాహం జరిగింది. వారిద్దరికీ రాముడు, సారణుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండకుడు, మహాహనుడు అనే కుమారులు, చిత్ర, క్షేత్ర అనే కుమార్తెలు జన్మించారు. వసుదేవుడికి దేవకీదేవి ద్వారా, సుశేణుడు, కీర్తిమాన్‌, ఉదాసి,
భద్రసేనుడు, ఋషిదాసుడు, భద్రుడు, విదేహుడు అనే పుత్రులు జన్మించారు. వీరందరినీ కంసుడు సంహరించాడు. తరువాత శ్రీకృష్ణుడు సుభద్ర వారికి సంతానమయ్యారు.

వసుదేవుడికి తామ్ర అనే భార్య ద్వారా సహదేవుడు పుట్టగా, దేవరక్షితద్వారా ఉపానంగధర అనే కుమార్తె కలిగింది. ఆకన్యని కంసుడు వధించాడు. ఇంకా వసుదేవుడికి ఇతర భార్యల ద్వారా చాలా మంది పుత్రులు కలిగారు. వసుదేవుడి పుత్రుడైన శ్రీకృష్ణుడు సంతానంలేని గండూషుడు అనే  వాడికి తన కుమారుడైన సుచంద్రుడనేవాడిని ఇచ్చివేశాడు. కృష్ణుడికి జాంబవతిద్వారా చారుధేష్ణుడు, సాంబుడు అనే కుమారులు జన్మించారు.

ఈ వంశంలో నందనుడు అనేవాడికి తంత్రిపాలుడు, తంత్రి అనే పుత్రులు జన్మించగా, శమీకుడనేవాడికి మహాబలపరాక్రమవంతులైన విరజుడు, ధనువు, శ్యాముడు, సృంజయుడు అనే నలుగురు కుమారులు పుట్టారు. ఈ నలుగురు కుమారుల్లో శ్యాముడు అనే వాడికి సంతానం కలుగలేదు. సృంజయుడు వాన ప్రస్థాశ్రమం స్వీకరించాడు. ఇది శూరవంశ వృత్తాంతం అని సూతమహర్షి శౌనకాది మహామునులకి ప్రవచించాడు.

అగ్ని వంశం

స్వాయంభువ మన్వంతరంలో జరిగిన సృష్టి మొదట్లో అగ్ని అనే భూతానికి అధిష్టాతగా అగ్ని అనే దేవత చెప్పబడింది. ఈ అగ్ని తత్వాన్నే అగ్ని అభిమానిదేవత అంటారు. అంటే పంచభూతాల్లో ఒకటిగా వున్న అగ్ని అనే దాన్ని ఆశ్రయించి, ఇది నాది అనే అభిమానంతో ప్రవర్తిస్తూ, అగ్నిని ఆరాధించిన వారికి ఆయాఫలాలని అందిస్తూ, అగ్నిలో హవనం చేసిన పదార్ధాలని దేవతలకి
అందిస్తూ, ఉండే అగ్ని తత్వం అని అర్ధం. ఇదే అగ్నిలో వ్యాపించిన దేవతాతత్తం.

అగ్ని దేవుడికి తన భార్య అయిన స్వాహా దేవిద్వారా 
1.పావకుడు
2.పవమానుడు 
3. శుచి అనే పుత్రులు జన్మించారు. వీరిలో పవమానుడు భూర్‌, భువః, సువః అనే మూడు వ్యాహృతులలో మొదటి వ్యాహృతి అయిన, భూలోకానికి సంబంధించిన అగ్నికి అధిష్టాంతగా వున్నాడు. ఈ పవమానుడుకి పుత్రుడు నిర్మధ్యాగ్ని అనేవాడు (నిర్మథ్యాగ్ని అంటే ఆరణులతో మధనం చేయగా పుట్టిన అగ్ని అని అర్ధం). తరువాత అగ్నిదేవుడి మరో కుమారుడైన పావకుడు
మూడు వ్యాహృతులలో రెండో దైన భువః అనే వ్యాహృతికి ఆధారమైన అంతరిక్ష లోకానికి సంబంధించిన అగ్నికి అధిష్టాన దేవతగా వున్నాడు. ఈపావకుడికి వైద్యుతాగ్ని కుమారుడుగా వున్నాడు.

అగ్నిదేవుడి మూడో కుమారుడైన శుచి మూడోవ్యాహృతి అయిన సువః అనే దానికి ఆధారంగా వున్న ద్యులోకానికి సంబంధించిన అగ్నికి అధిష్టాన దేవతగా వున్నాడు. ఈ శుచి కుమారుడు సౌరాగ్ని. ఈ విధంగా పవమాన, పావక, శుచుల కుమారులుగా చెప్పబడిన నిర్మద్యాగ్ని - వైద్యుతాగ్ని-సౌరాగ్ని అనే వారి రూపాలు భౌతిక జడరూపాలు.

పవమాన, పావక, శుచులకు జన్మించిన పుత్రుల దేవతాత్మక రూపాలు 
ఇలా వుంటాయి. 
1. పవమానుడు దేవతాత్మకు కుమారుడు హవ్యవాహనుడు. (హవ్యాల్ని దేవతలకి తీసుకెళ్ళి అందించేవాడు) 
2. పావకుడి దేవతాత్మక కుమారుడు సహరక్షుడు. 
3. శుచి అనే అగ్నికి దేవతాత్మక కుమారుడు కవ్యవాహనుడు. (అనగా పితృదేవతలకి కవ్యాన్ని అందించేవాడు) ఇలా ఈ ముగ్గురూ అనగా హవ్యవాహనుడు దేవతలకి, సహరక్షుడు రాక్షసులకి,
కవ్యవాహనుడు పితృదేవతలకి సంబంధించిన వారిగా ప్రసిద్ధి చెందారు.

ఇక్కడ చెప్పిన పావక-పావమాన-శుచి అనే అగ్ని పుత్రులు ముగ్గురినీ కలిపి 'సూనులు' అని వ్యవహరిస్తారు. (సూనులు అంటే తోజోకిరణాలు అని అర్ధం)

బ్రహ్మ మానసపుత్రుడైన ప్రాథమికాగ్ని దేవుడి, తత్త్వ భేదమైన పావకుడికి భరతుడు అనే కుమారుడు జన్మించాడు. పావకాగ్నికి మరో కుమారుడు వైశ్వానరుడు. ఈవిధంగా ఇంకా ఎన్నో రకాల అగ్ని భేదాలు అగ్ని వంశంలో భాగంగా చెప్పబడ్డాయి.

పురాణదాన వ్రతం

No comments:

Post a Comment