ద్వితీయ భావమందున్న గ్రహ ఫలితములు
జనమలగ్నము నుండి ద్వితీయ(రెండవ) రాశి - ధన భావము, కుటుంబ భావము దెలుపబడినది.
ఈ భావము ద్వారా జాతకుని వాక్కులు, ముఖము, భోజనము, భుద్ధి, విద్య, నేత్రములు, చెవులు, దౌడలు, దంతములు, నాలుక, ధనం, ధనరాబడి, క్రయ- విక్రయములు, ప్రయాణములు, కుటుంబ విషయములాదిగాగల ఫలితములు తెలియగలవు.
1. రవి యున్న - ధన హీనత, అసత్య వాక్కులు, స్వల్ప సంతానము, భార్య సౌక్య హీనత, ముఖ, నేత్ర, దంత రోగములు కల్గును.
2. చంద్రుడు యున్న - దాతృత్వము, సద్బుద్ధి, సౌక్యము, తేజసు, పేరు-ప్రతిష్టలు, సున్నితము, స్పుటమైన వాక్కులు , ధనా భరణములు, కుటుంబ వృద్ధి కల్గును. ఈ చంద్రుడు క్షీణ దశయందున్న వ్యతిరేక ఫలితములు, విద్యా విఘ్నములు ప్రాప్తించును.
3. కుజుడున్న - నిలువయుండని ధనము, దుర్భుద్ధి, దయాహీనత, కుటుంబ సౌక్యము లేకుండుట, ధీర్ఘ కోపము, నేత్ర వ్యాధులు, పశువ్యపారము, ఋణపీడ, ప్రవాసము, భోగము, పిత్రార్జిత అస్తి, విద్యా విఘ్నములు, అపాత్రదానము కలుగగలవు.
4. బుదుడున్న - అందము, పొడవైన తలవెంట్రుకలు, అతిభాషణ, ధన - భులాభము, సౌఖ్యము, కుటుంబ సుఖము, విద్య కల్గును.
5. గురువున్న - రూప, విద్య, గుణ, సౌశీల్యములు, సత్స్వభావము, కీర్తి - ప్రతిష్టలు, అవిరోధము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, వృద్ధాప్యమునందు, ఆర్ధిక ఇబ్భందులు కలుగగలవు.
6. శుక్రుడుయున్న - విద్య, తద్వారా ధనార్జన, స్త్రీ ధనము, సుఖ భోజనము, విలువగల వస్త్రాభరణ, వాహన, సంపదలు, ధన నిల్వలు, పుణ్యకార్యాచరణ, ఆడంబర వాక్కులు, కుటుంబ వృద్ధి, అందమగు నేత్రములు, సంస్కృత కావ్య నాటకాలంకార విద్య పాండిత్యము కల్గును.
7. శనియున్న - పరగృహ, పర స్థలములందువశించుట, జూదాది వ్యసనములు, ఉత్తమ వాహన యోగము, స్వజన పరిత్యాగము, విచారములు, కల్గును. ద్వితీయ భావము కరకుంభములైన యెడల - విశేష వాహన సౌఖ్యము, రాజపూజ్యత, ధనము, నేత్రరోగము, ఋణపీడ, కళత్ర సౌఖ్యహాని, సంతాన విచారము కల్గును.
8. కేతువుయున్న - శూరత్వము, కలహములందు నేర్పు, విదుషత్వము, కంగారు, వ్యాపారము ద్వారా ధన యోగము, కుటుంబ విరోధము, కఠిన వాక్కులు, ముఖ రోగములు కల్గును.
9. రహువుయున్న - బలము, దుఖము, ధన హీనత, నీచ గృహనివాసము, మాంస విక్రయము, మత్య్స వ్యాపారములు కల్గును.
10. ధనమునకు సంబంధించిన విషయములలో 2-5-9-10-11, భావములు కూడా ఫలితములు నివ్వగలవు. ద్వితీయ భావముతోబాటు మిగిలిన ఆ భావములయోక్క బలా బలములు కూడ, విచారింపవలసి యున్నది.
11. ధనకారకుడగు గురుగ్రహము, ధనలాభాదిపతి, ధన భావమునందున్న గ్రహములు - ధనయోగాములందు ప్రాధాన్యతనంది యుండెదరు.
12. జన్మలగ్నము లేక చంద్రలగ్నములో నున్న గురువు - ద్వితీయ భావాధిపతులగు గ్రహములను చుచుచున్ననూ లేక వారితో కలసియున్నాను - ధనము, కుటుంబము వృద్ధినందగలదు.
13. ద్వితీయాధిపతికి - లభాదిపతియోక్క కలయిక లేక దృష్టి యుండిన యెడల - అత్యాధిక ధనవంతుడు కాగలడు.
14. బుధ, గురు, శుక్రులు - ధన భావమునందున్ననూ లేక ఆ భావమును జూచినా వేశేష ధనవంతులగుదురు.
15. 2-9-10-11 భావధిపతులగు గ్రహములు - 1-4-5-7-9-10 స్థానములయందున్న యెడల గొప్ప ధన ప్రాప్తి కల్గును.
16. 1-4-7-10 స్థానములందు శుభ గ్రహములున్నచో - అధిక ధనము కల్గును.
17. ఒక ఉచ్చస్థితిగల గ్రహముతో - గురుడుగానీ శుక్రుడు గానీ బుధుడుగానీ , పూర్ణ చంద్రుడు గానీ కలసి - 2-4-11 స్థానములయందున్న - గొప్ప శ్రీమంతుడు కాగలడు.
18. లగ్న, ద్వితీయ, ఏకాదశ భావధిపతులు 5-9-1-4-7-10 స్థానములందుండి - వారికి పాప గ్రహ సంబంధము లేకుండిన - ధనవంతులు కాగలరు.
19. 2-5-9-11 భావాధిపతులందరు కొందరుగానీ పరస్పర దృష్టి కలయికలాదిగా గల సంబంధములుండి బలము కల్గియుండిన - లక్షాధిక ధన - సంపదలు ప్రాప్తించగలవు.
20. ధన - లాభ భావములయొక్క అధిపతులగు గ్రహములు పరస్పరం మిత్రులై, లగ్నమందున్న - విశేషధనయోగము కల్గును. వీరుభయులు పాపగ్రహ సంబంధములులేని వరై 1-4-7-10 స్థానముల యందున్న - గొప్ప ఐశ్వర్యయోగము కల్గును.
21. 2 - 10 భావధిపతులు 5వ స్థానంలో గలసియున్న - ఐశ్వర్యము కల్గును.
22. ధన భావమునందు గ్రహములుండి, శుభ గ్రహముల దృష్టి కల్గియున్న - మొక్కల పెంపకము అమ్మకముల వలన ధనప్రాప్తి కల్గును.
23. ద్వితీయ భావాదిపతి మిత్ర గ్రహములతో గలసి యున్నను లేక మిత్ర గ్రహరాశులయందున్ననూ - జన్మించిననతోడనే ధన ప్రాప్తినందును, విదేశములందు ధనలాభము లుండగలవు.
24. ద్వితీయభావాదిపతి బుధునితో కలసియున్ననూ లేక 1-4-7-10 స్థానములయందుండి, కేతువుచే చూడబడిననూ - రత్నములు బంగారము సమృద్ధిగా ప్రాప్తించును.
25. ధనుర్మీనములు 9వ స్థానమై, అందు శుక్రుడు 5వ భావాదిపతితో కలసి యుండిన - గొప్ప ఐశ్వర్యము కల్గును.
26. వృషభ, తులలు పంచమ భావముగా నుండి; అందు శుక్రుడుండి, లాభ భావమున శనియుండిన - గొప్ప ధనయోగము కలుగును.
27. సింహలగ్నమునందు రావియుండి, కుజుడు లేక గురునిచే కూడియున్నను, వారి దృష్టినందిననూ, సత శీలుడై, గొప్ప ధనవంతుడు కగలడు.
28. ద్వితీయ, దశమ భావాధిపతులు - బలము గలవారై, దశమ భావమునందున్న - అనేక లక్షల ధనము ప్రాప్తించగలదు.
29. జన్మలగ్నదిపతి ద్వితీయమునందుండి, 1-4-7-10 స్తానములందొక శుభగ్రహముండి, చతుర్ధ భావాదిపతి 3-6-11 స్థానములందున్న యెడల కోటీశ్వరులు కాగలరు.
30. ద్వితీయాధిపతి నీచను పొంది ; చంద్ర, శుక్రులహో గలసి యున్న- ప్రభుత్వపరముగా ధనము ప్రాప్తించును.
31. దశమ భావదిపతి - రవి, కుజ, బుదులతో, గలసియున్న- రాజుల వలన, గురునితో గలసియున్న -రాజ సత్కారముల వలన, శుక్రునితో గానీ, సప్తమాధిపతితోగాని కలసి యున్న- స్త్రీల వలన, శనితో గూడియున్న - శూద్రులవలన, రాహు - కేతువులతో గలసియున్న - నీచ జనుల వలన ధన లాభము కలుగును.
32. ద్వితీయ భావాధిపతి ద్వితీయమునందుగానీ, దశమస్థానమందుగానీయుండి గురు దృష్టినందిన యెడల - జన్మతః బీదవాడైనను, ధనవంతుడగును.
33. ధనాధిపతి సప్తమస్థానమందుండి, శుక్ర వీక్షితుడైన, యెడల - భార్య ద్వారా ధనవంతుడు కాగలడు.
34. 5-9-11 స్థానాధిపతులు 2-5-9 స్థానముల యందున్న - ధన యోగము కలుగును.
35. ద్వితీయధిపతి - లభాధిపతితో కలసి 1-4-5-7-9-10 స్థానములందుండి శుభగ్రహ దృష్టి, కాల బలము కల్గి యున్న - యౌవన కాలమునందు స్వశక్తితో ధనార్జన చేయగలడు.
36. లగ్నాధిపతి, బుధుడు, ద్వితీయాదిపతి కలసియున్న - వృద్ధాప్యము నందు ధనయోగము కల్గును.
37. ధనయోగామును కలిగించు గ్రహములకు కుజ, శని, రాహు సంబంధములున్న యెడల - ఆ యోగ గ్రహదశలయందు, అంతర్ధశలయందు - దొంగతనము, మోసము, సాహసము, కలహము, తప్పుడు సాక్ష్యముల ద్వారా ధన ప్రాప్తి కల్గుచుండును.
38. చంద్ర - శుక్రులు కలసియున్నను, పరస్పర ద్రుష్టికల్గియున్ననూ యావజ్జివిత ధన భాగ్యము కల్గును.
39. ద్వితీయాధిపతి - లభస్థానమందు, లాభాధిపతి (11స్థానం) - లగ్నమునందు, లగ్నాధిపతి - ద్వితీయము నందు నుండిన - భూస్థాపిత ధనయోగము కల్గును.
40. శుభుడైయున్న లగ్నాధిపతి ద్వితీయమునందుండి, ద్వితీయాధిపతి అష్టమ స్థానమందుండినయెడల - నిధి ద్రవ్య ప్రాప్తి కల్గును.
నిర్ధన యోగములు
1. ద్వితీయాధిపతి, గురువు కలసి గానీ, విడిగాగాని 6-8-12 స్థానములయందున్న - ధన హీనుడగును.
2. ద్వితీయాధిపతి - 12వస్థానమందు, 12వస్థానాధిపతి - 2వస్థానమందుండి, 11వ స్థానాధిపతి 6-8-12 స్థానములందున్న - ధననాశనము కల్గును.
3. 2-5-9-11 స్థానాధిపతులకు - 6-8-12 స్థానాధిపతుల సంబంధము కల్గిన - ధన నష్టము, ఋణ పీడ శత్రు భయములు ప్రాప్తించును.
4. ద్వితీయాధిపతి 4వ స్థానాధిపతి సంబంధముచే - ఋణపీడ కల్గును. 3-6-12 స్థానాధిపతులు - 5-9-11 స్థానములందున్నను - ఋణ భాధలుండగలవు. ముఖ్యముగా 3-6-11 అధిపతులు 11వ స్థానమందుండిన - అధిక ఋణగ్రస్తుడు కాగలడు.
5. జన్మలగ్నదిపతి 6-8-12 స్థానముల యందున్న - దరిద్రయోగము.
6. లగ్నాధిపతి పాపగ్రహ సంబంధము కల్గి 6-8-12 స్థానముల యందుండి, మారకాధిపతి (8వ స్థానాధిపతి) చే కుడియున్నను, చూడబడినను - రాజవంశమునందు బుట్టినవాడైనను దరిద్రుడు కాగలడు.
7. 9-10 స్థానధిపత్యములుకలుగని పాపగ్రహములు లగ్నముందుండి - 8వ స్థానాధిపతితో కలసినను, చూడబడినను - దరిద్రులు కాగలరు.
8. దశమ భావమునం దే గ్రహము లేక యుండి, కర్కాటకము, సింహము అను రాశులయందు పురుషగ్రహము లేకయున్న - దరిద్రులు కాగలరు.
9. ధన, లాభ స్థానాధిపతులు పాప గ్రహాంశల యందుండి - పాపగ్రహములతో గలసి, కుజునిచే జూడబడుచుండిన - అగ్నివలన, చోరులవలన, ప్రభుత్వమువలన ధననాశనము కల్గును.
10. బలహీనత - లేక స్వల్పబలము గల వ్యాయాధిపతి క్రూరాంశల యందుండి సప్తమాధిపతి సంబంధము కల్గియున్న - భార్యా మూలకముగా ధననష్టములు కల్గును.
11. ఏ లగ్నముగల వారికైనను, మేషమునందు శని, కర్కాటకమునందు కుజుడు, మీనమునందు చంద్రుడు, వృషభమునందు రవి యుండిన - ధన హీనులు కాగలరు.
12. లగ్నాదిగ శుభస్థానములందు (1-4-5-7-9-10) పాపగ్రహములు, పాప స్థానములందు (2-3-6-8-12) శుభగ్రహములు యుండిన - దరిద్రులగుదురు.
13. ద్వితీయధిపతి శత్రుగ్రహముతో గలసియుండి, ద్వితీయమందు రాహువున్న యెడల - ఆ ద్వితీయధిపతి దశయందు ధనము, ధాన్యము, పశు సంపదలు నష్టపడగలవు.
14. ధన - లభాధిపతులు పాపగ్రహములతో గలసి, శుభగ్రహ సంబంధము లేక అష్టమాధిపతిచే చూడబడుచుండిన - జన్మించినది మొదలు భిక్షాటన చేయుచు దరిద్ర జీవనులు కాగలరు.
ద్వితీయ భావరీత్యా ఇతర యోగములు
1. లగ్నమందు గురువు, ద్వితీయమందు చంద్రుడు ఉన్న - మంచి నేత్రములు లుండును.
2. ద్వితీయధిపతి పాపగ్రహములచే చూడబడక 1-4-7-10 స్థానములందుడుట, నేత్ర కారకుడగు శుక్రుడు పాపగ్రహ వీక్షణము లేక 1-4-7-10-11 స్థానము లందున్నను - మంచి నేత్రములు కల్గి జీవితాంతం నేత్ర వ్యాధులులేక సుఖించగలరు.
3. 6-8-12 స్థానములలో చంద్ర - శుక్రులు గలసియున్న రేచీకటి ప్రప్తించ గలదు.
4. చతుర్ధ - నవమాధిపతులు రవి - శుక్రులతో గలసి లగ్నాధిగా 2-3-4-8-9-11 స్థానముల యందున్న - తల్లిదండ్రులు గ్రుడ్డివారు కాగలరు.
5. సప్తమ స్థానాధిపతి రవి - శుక్రులతో గలసి 3-1-11 స్థానముల యందున్న - భార్య జాత్యంధురాలగును.
6. 12 వ స్థానమందు శనియున్న - కుడికంటికి, కుజుడున్న ఎడమ కంటికి హాని కల్గును.
7. షష్టాధిపతి వక్రించియున్న- నేత్ర రోగములు కల్గును.
8. రవి - చంద్రులు 1-2-7 స్థానముల యందుండి కుజ శనులను చూడబడిన యెడల రెండు కన్నులు పొవును.
9. ద్వితీయమునందు శనియున్న ఆపి ఆపి గానీ నిదానముగా గాని మాట్లాడును.
10. ద్వితీయమున శని - చంద్రులున్న నత్తి మాటలుండును.
11. ద్వితీయాధిపతి నీచయందుండి, ద్వితీయమున క్షీణ చంద్ర- కేతులున్నను లున్నను లేక కేతువు మాత్రమే యుండి, పాప గ్రహ ద్రుష్టి నందిన నత్తి ఏర్పడును.
12. ద్వితీయాధిపతి - గురువుకలసి గానీ, విడిగా గానీ 6-8-12 స్థానము యందుండిన - మూగ వాడగును.
13. లగ్నమందు కేతువున్న - క్రింది దంతములు వెడల్పుగా నండ వచ్చు. రహువున్న పళ్ళు పొడవుగా నుండి బైటికి కన్పించగలవు.
14. లగ్నాధిపతి నీచనందియుండి, అష్టమాధిపతి గురువు కలసి 8వ స్థానమందున్న - దంత రోగము లుండగలవు.
15. సప్తమ స్థానంలో పాప గ్రహలున్న - జాతకుని పళ్ళు చూచుటకు వింతగా నుండగలవు. రవికి ద్వితీయ స్థితి వలన - పళ్లకు హాని .
16. శని ధనుస్సు నందున్న - పెద్ద పళ్ళు, శని కర్కాటకము నందున్న - పటుత్వము లేని పళ్ళు కల్గును.
17. శని ద్వితియాదిపతియై మేషమందున్నను, గురునితో కూడినను - ఎలవేళ్ళల శ్రాద్ధాన్నములు తినుచుండగలడు.
18. ద్వితీయయధిపతి అష్టమాధిపతితో గలసి, 11వ స్థానము నందున్న - కుటుంబవృద్ధి గల్గును.
19. ద్వితీయయధిపతికి శని సంబంధము వలన - లోభి కాగలడు.
No comments:
Post a Comment