Monday, June 30, 2025

Datta Shodasi - దత్త షోడశి

దత్త షోడశి

పల్లవి
సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త
షోడశావతార రూప దత్తం భజరే భక్త

చరణం
మహిషపురవాస శ్రీ కాలాగ్నిశమన దత్తం
ప్రొద్దుటూరు గ్రామవాస యోగిరాజవల్లభం
బెంగళూరు నగరస్థిత దత్తయోగిరాజం
అనంతపురే స్థితం జ్ఞానసాగరం భజ దత్తమ్ ॥ 1 ॥

విజయవాడ విలసితం శ్యామకమలలోచనం
మచిలీపట్టణ సంస్థితం అత్రివరదరాజం
జయలక్ష్మీపురే సంస్కారహీన శివరూపం
మద్రాసు నగర సంవాసం ఆదిగురు నామకం ॥ 2 ॥

ఋషీకేశ తీర్థరాజం శ్రీ దిగంబర దత్తం
ఆకివీడుస్థం విశ్వాంబరావధూత దత్తం
నూజివీడు పట్టణే దేవదేవ అవతారం
భాగ్యనగర స్థితం దత్తావధూతం భజ ॥ 3 ॥

గండిగుంట జనపదే దత్తదిగంబర దేవం
కొచ్చిన్ నగరే స్థితం సిద్ధరాజ నామకం
మాయాముక్తావధూత మచ్చరపాకే
లీలావిశ్వంభరం సూరన్నగరే భజ ॥ 4 ॥

సచ్చిదానంద జన్మస్థలే దత్తకాశీశ్వరం
పూర్వసముద్ర తీరే దత్త రామేశ్వరం
సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త
షోడశావతార రూప దత్తం భజరే భక్త ॥ 5 ॥

No comments:

Post a Comment

Siva(Shiva) - శివ

  కాలభైరవాష్టకం తీక్షణ ద్రష్ట కాలభైరవ అష్టకం దక్షిణా మూర్తి స్తోత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం దారిద్యదహన శివస్తోత్రం వేదసారశివస్తోత్రం శ...