Monday, October 6, 2025

Maa Mundeshwari Temple - ముండేశ్వరీ ఆలయం

భారతదేశంలోని మొట్టమొదటి అత్యంత పురాతనమైనది ఈ దుర్గామాత ఆలయం.

దుర్గ శక్తి దేవాలయం
ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మతపరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. ఎంతో నేపథ్యం ఉన్న కట్టడాలు కూడా నిర్లక్ష్యం వల్ల భూస్థాపితమయ్యాయి. కొన్ని మాత్రం ఇప్పటికీ సజీవంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది. బీహార్లో కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

ముండేశ్వరి దేవి ఆలయం శివుడు మరియు శక్తికి అంకితం చేయబడింది మరియు ముండేశ్వరి కొండలలో ఉంది. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చును. దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషుడు. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం.

ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ చేస్తూ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4 ముఖాలతో వుంటాడు.

ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి.ఆ కాలంనుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావటం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజాకార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి.

చైత్రమాసంలో ఈ ఆలయాన్ని సందర్శించటానికి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తూవుంటారు. ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి. అంటే ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. పూజారి మంత్రించిన అక్షింతలను మేక పై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు సృహతప్పి పడిపోతుంది. అటుపై మరోసారి పూజారి అక్షింతలను మేక పై వేస్తాడు. దీంతో ఆ మేక మరలా యథా స్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...