శ్రీ అనగా లక్ష్మీదేవి . లక్ష్మీదేవిని విష్ణువు హృదయమందు వుంచుకున్నాడు . అందుకు ఆయన హృదయము మీద ఒక గుర్తు యేర్పడింది . వత్స అంటే గుర్తు అనికూడా ఒక అర్థముంది . శ్రీవత్స అంటే లక్ష్మీదేవి గుర్తు . భృగువు విష్ణువు వక్షస్థలాన్ని తన్నడమువలన భృగు సంతతికి భృగుపాద గోత్రీయులనేవారు . లక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె అందుకే విష్ణువక్షస్థలములో ఒక గుర్తుగా వున్న ఆమె పేరుమీద కాలక్రమేణా భృగుపాద గోత్రము శ్రీవత్స గోత్రముగా పిలవబడుతోంది.
భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.
భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.
ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందశి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.
చ్చవనునికి పులోమజా అను పతివ్రత వలన ఋచీకుడు అను మహామునికి జన్మనిచ్చింది. ఋచీకుని భార్య సత్యవతి వారికి పుట్టిన సంతానమే జమదగ్ని.
జమదగ్నిభార్య రేణుక ఈమెయే రేణుకా ఎల్లమ్మ తల్లి, మారెమ్మ గ్రామదేవత, తమిళనాడులోని మారి అమ్మన్, దశ మహావిద్యలలో ఆరవ విద్య అయిన చిన్నమస్తా దేవి.
శ్రీ వత్స గోత్ర వంశములో సాక్షాత్ లక్ష్మీ దేవి కూతురు. పార్వతి దేవి స్వరూపమైన చిన్నమస్తదేవి (రేణుకా ఎల్లమ్మ తల్లి) కోడలు, పరశురాముడు కొడుకు, దుర్వాస మహాముని అల్లుడు. బ్రహ్మ మానస పుత్రులలో తూర్పు మస్తకం నుండి పుట్టిన భృగు మహర్షి మూల పురుషుడు.
కావున శ్రీవత్స గోత్ర ప్రవరలో పంచాఋష ప్రవరాన్విత అని చెప్పి
భార్గవ, చ్యవన, అప్లవాన, ఔర్వ, జమదగ్ని పంచాఋష ప్రవరాన్విత అని చెప్తారు.
No comments:
Post a Comment