Wednesday, March 25, 2026

రాములోరికి గోటి తలంబ్రాలు

రాములోరికి గోటి తలంబ్రాలు

సీతారాముల కల్యాణం, కమనీయంగా జరుగుతుంటుంది. ఏటా చైత్ర నవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకగా కల్యాణ ఘట్టం జరుగుతుంది. అయితే సీతారాముల తలంబ్రాలకు విశిష్టత ఉన్న సంగతి తెలిసిందే.

ఏటా భద్రాచలంతోపాటు ఒంటిమిట్ట రామాలయానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందిస్తారు. ఇందుకోసం స్వయంగా రామ పంట పండిస్తుండటం విశేషం.

కఠినమైన నియమాలు: ధాన్యం గింజను వలిచేటప్పుడు బియ్యం గింజ విరగకూడదు. విరిగిన గింజను తలంబ్రాలకు ఉపయోగించరు.

గోటి తలంబ్రాలు: సాధారణంగా బియ్యాన్ని యంత్రాల ద్వారా (రైస్ మిల్లుల్లో) వలుస్తారు. కానీ, గోటి తలంబ్రాల కోసం వరి ధాన్యాన్ని ఏ యంత్రం ఉపయోగించకుండా, కేవలం గోళ్లతో ఒక్కొక్క గింజను వలిచి బియ్యాన్ని తీస్తారు.

3 నెలలు శ్రమించి పంట పండిస్తారు. రెండు క్వింటాళ్ల వరకు ఇలా గోళ్లతో వలిచిన బియ్యాన్ని భక్తులు సమర్పిస్తుంటారు. గోటి తలంబ్రాల తయారీలో 60 గ్రామాల్లోని రామభక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న కొందరు రామ భక్తులు కూడా ఈ మహత్కార్యంలో పాలుపంచుకునేందుకు వస్తున్నారు. 2 వందల గ్రాముల పాల్గొంటారు.

ఈ ఏడాది కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభం కావడంతో సీతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. గత 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా గోటి తలంబ్రాలను అందిస్తున్నారు.

No comments:

Post a Comment

రాములోరికి గోటి తలంబ్రాలు

రాములోరికి గోటి తలంబ్రాలు సీతారాముల కల్యాణం, కమనీయంగా జరుగుతుంటుంది. ఏటా చైత్ర నవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకగా కల్యాణ ఘట్టం జరుగుతుంది. అయ...