దేవతలు పుష్పాలు
మనలో చాలా మంది పూజకు పూలను సమర్పిస్తుంటారు. భక్తులు భక్తితో ఏది సమర్సించినా తీసుకుంటాడు భగవంతుడు. అయితే.. మనం పూజించే ప్రతి దేవుడికి ఇష్టమైన రోజులు, పువ్వులు, రంగులు ప్రత్యేకించి ఉంటాయి. భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే, ఆయా దేవతలకూ కూడా ఇష్టయిష్టాలున్నాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి.
1. లక్ష్మీ దేవి:
కలువ పూలు: ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీ దేవి కలువ పూవులోనే కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీ దేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీ కరుణిస్తుంది.
2. గణేశుడు:
ఎర్రటి పుష్పాలు: అడ్డంకులను తొలగించే గణేశుడు, లక్ష్మీ దేవి వలె ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు. ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతిపూలంటే ఉండ్రాళ్ల ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార, గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వు.
3. సరస్వతీ దేవి:
మోదుగు పూలు: ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె మనస్సు, ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు కచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది. సరస్వతికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
4. శివుడు:
ఉమ్మెత్త: నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజచేస్తే ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది.
5. కాళీ మాత:
ఎర్ర మందారం: కాళీ మాత నాలుక రంగులో పూచే పూలు ఎర్రమందారాలు. ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీ మాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిక కోరికలు తీరుతాయంటారు. అంతేకాకుండా, కాళీ దేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు.
6. మహా విష్ణువు:
పారిజాతాలు: సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతి. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని, దాన్ని విష్ణువు తనతో పాటూ స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతారు. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరిసంపదలను ప్రసాదిస్తాడు.
7. హనుమంతుడు:
మల్లెపూలు: మల్లెపూలంటే చాలా ఇష్టం, కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూలను సమర్పిస్తారు. ప్రతి శనివారం బజరంగబలికి తమలపాకులు, అద్భుతమైన పువ్వులు సమర్పిస్తారు.
8. శ్రీ కృష్ణుడు:
కదంబ పుష్పాలు: కదంబ వనంలో చాలా కాలం గడిపేవాడు. కదంబ పుష్పాలు సువాసనతో బంతిలా గుండ్రంగా ఉంటాయి. పారిజాతాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గపు వృక్షంగా చెబుతారు. కాబట్టి, కృష్ణుని పూజించడానికి కూడా పారిజాత గొప్పది.
9. శనిదేవుడు:
నీలిరంగు పూలు: నీలిరంగు పూలను శనికి సమర్పించాలి. నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు.
Sunday, July 12, 2026
Ganapati - Ekadanta (The One-Tusked One) - గణపతి - ఏకదంతుడు
గణపతి - ఏకదంతుడు
మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, ఆ మహత్తర చరిత్రను ప్రపంచానికి అందించాలని వేదవ్యాస మహర్షి సంకల్పించారు. కానీ వేలాది శ్లోకాలతో కూడిన ఈ మహాగ్రంథాన్ని తాను చెప్పే వేగానికి తగ్గట్టు ఎవరు రాయగలరా ఆలోచించారు.
అప్పుడు బ్రహ్మ దేవుని సలహాతో వ్యాస మహర్షి వెంటనే శ్రీ గణపతిని ధ్యానించి ప్రార్థించాడు. ఆయన భక్తికి ప్రసన్నమైన గణపతి ప్రత్యక్షమై, "నేను రాస్తాను. కానీ నీవు ఒక్క క్షణం కూడా ఆగకుండా చెప్పాలి" అని ఒక షరతు పెట్టాడు.
దానికి వ్యాస మహర్షి కూడా, "మీరు ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహించిన తర్వాతే రాయాలి" అని మరో షరతు పెట్టారు. గణపతి అంగీకరించాడు.
అలా వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్పడం ప్రారంభించగా, గణపతి వేగంగా లిఖించడం మొదలుపెట్టాడు. మధ్యలో ఒకసారి రాస్తున్న కలం విరిగిపోయింది.
కానీ రచన ఆగకూడదనే సంకల్పంతో, శ్రీ గణపతి తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించి మహాభారతాన్ని పూర్తి చేశాడు. అందుకే ఆయనను "ఏకదంతుడు" అని కూడా పిలుస్తారు.
ఏ శుభకార్యమైనా, ఏ గొప్ప పనైనా విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలంటే ముందుగా గణపతిని ప్రార్థించాలనే విశ్వాసంతో ఆయన ఈ దివ్య కార్యాన్ని గణేశుడితోనే ప్రారంభించారు.
అలాగే గణపతి కూడా తన భక్తుడి సంకల్పం నెరవేరేందుకు తన దంతాన్నే త్యాగం చేసి, ధర్మగ్రంథమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించాడు.
ఇంకో పురాణం కథనం ప్రకారం
పరశురాముడు, వినాయకుడి మధ్య జరిగిన యుద్ధం. వారిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అంటే... ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి కైలాస పర్వతానికి చేరుకున్నారట.
పరమశివుడిని దర్శించుకోవడానికి వచ్చిన పరశురాముడిని, శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారని గణేశుడు ద్వారం వద్ద అడ్డుకున్నాడు. పరశురాముడు ఎంత వేడుకున్నా వినాయకుడు వినలేదట.
దీంతో సహనం కోల్పోయిన పరశురాముడు తనను ఎవ్వరూ అడ్డుకోరనే భావించిన పరశురాముడు కోపంతో గణేశుడితో యుద్ధానికి దిగాడు. చివరకు శివుడు ప్రసాదించిన పరశు(గొడ్డలి)ని గణేశుడిపై విసిరాడు.
ఆ గొడ్డలి తన తండ్రి శివుడు ఇచ్చిన ఆయుధమని గుర్తించిన గణేశుడు, దానిని అవమానించకూడదనే భావంతో ఎదిరించలేదు. ఆ పరశు తాకడంతో ఆయన ఒక దంతం విరిగిపోయింది. అప్పటి నుంచే గణపతికి "ఏకదంతుడు" అనే పేరు వచ్చింది.

Coconut offering kobbarikaaya naivedhyam - కొబ్బరికాయ నైవేద్యం
కొబ్బరికాయ నైవేద్యం
హిందూ ధర్మంలో కొబ్బరికాయకు విశిష్టమైన స్థానం ఉంది. అసలు ప్రతి పనిలోనూ కొబ్బరికాయనే ఎందుకు వాడతాం? దీని వెనుక కేవలం విశ్వాసం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
మనం దైవ సన్నిధిలో కొబ్బరికాయను కొట్టినప్పుడు, మనలోని అహంకారాన్ని పటాపంచలు చేసి, నిర్మలమైన మనసుతో దైవానికి శరణాగతి చెందుతున్నామని అర్థం.
ఒకప్పుడు విశ్వామిత్రుడు కోపంతో ఇంద్రుడును ఎదిరించి కొత్త స్వర్గాన్ని సృష్టించాలని తపనపడ్డారని చెబుతారు. ఆ ప్రయత్నంలో కొబ్బరికాయను ప్రత్యేకంగా ఉపయోగించినట్లు కథలు చెబుతాయి.
కొబ్బరికాయ కొట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా లేకపోలేదు. కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే శబ్దం చుట్టుపక్కల ఉన్న ప్రతికూల ప్రకంపనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుందని విశ్వసిస్తారు.
పూర్వకాలంలో యజ్ఞాల సమయంలో జీవబలి ఆచారం ఉండేదని, కాలక్రమేణా దానికి బదులుగా కొబ్బరికాయను సమర్పించడం ప్రారంభించారని చెబుతారు. ఇది హింసారహిత మార్గంలో దైవానికి అర్పణ చేయడాన్ని సూచిస్తుంది.
కొబ్బరికాయను కొట్టడం అంటే కేవలం ఒక ఆచారం కాదు... మన అహంకారాన్ని భగవంతుని పాదాల వద్ద సమర్పించి, శుభారంభానికి శ్రీకారం చుట్టడం.
గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

Sri Vishnu Sahasranama Parayanam - శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
రోజుకు కనీసం ఒక్క సారైనా విష్ణుసహస్ర నామ పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. పాపాలు తొలగి ఆయురారోగ్యము కలుగుతాయి.
శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అని నమ్ముతారు
ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.
పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఈతి బాధలు కనుమరుగవుతాయి.
జ్ణానానికి, మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఎవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయణం చేస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి ఆరోగ్యం వృద్ది కలుగుతుంది.
మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.
ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం అయినా సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.
శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవగ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది చెందుతుంది.

Kolhapur Mahalakshmi Temple, Kolhapur, Maharashtra - కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం, కొల్హాపూర్, మహారాష్ట్ర
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం, కొల్హాపూర్, మహారాష్ట్ర
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం, కొల్హాపూర్ అంబాబాయి ఆలయం అని కూడా పిలుస్తారు, మహారాష్ట్రలోని ఒక పురాతన, పవిత్రమైన హిందూ ఆలయం. ఇది లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు మరియు భక్తులచే చాలా గౌరవించబడుతుంది.
చరిత్ర:ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు కనీసం 5000 నుండి 6000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది, కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం లో పేర్కొనబడింది.
స్థానం:కొల్హాపూర్ నగరంలో పంచగంగ నది ఒడ్డున ఉంది.
ప్రాముఖ్యత: ఇది భక్తులకు మోక్షం, ఆరోగ్యం మరియు శ్రేయస్సును అందిస్తుందని నమ్ముతారు.
అష్టాదశ శక్తి పీఠం: ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ పీఠంగా భావిస్తారు.
తిరుపతి సంబంధం: కొల్హాపూర్ మహాలక్ష్మిని సందర్శించకుండా తిరుపతి బాలాజీ దర్శనం అసంపూర్ణమని భావిస్తారు.
భక్తుల నమ్మకం: వైకుంఠపురిలో ఉన్న అమ్మవారు, భక్తుల కోసం ఇక్కడ వెలిసిన క్షేత్రమే కొల్హాపూర్ అని భక్తుల ప్రగాఢ నమ్మకం
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం

Lord Shiva's ornaments and their significance - శివుని ఆభరణాలు మరియు వాటి అర్థం
శివుని ఆభరణాలు మరియు వాటి అర్థం
సమస్త సృష్టి కారకుడు శివుడే కాబట్టి అతన్ని అనాది అని కూడా అంటారు. శివుడు అంటే ఆది, అనంతం రెండూ అని శివుని గురించి చెబుతారు. శివుడు ప్రపంచంలోని అన్ని రూపాలలో ఉన్నాడు. శివుని రూపం ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. పూలమాలలు, నగలు ధరించకుండా భస్మంతో అలంకరిస్తారు. శివుడు మెడలో పాముని ధరించి, నుదుటి పై చంద్రుడిని అలంకరించుకుంటారు. అంతే కాదు జటాజూటంలో గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
తలపై చంద్రుడు: నెలవంక శివుని తలపై ఆభరణంలా అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంధాలలో శివుడిని సోమ, చంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుని తలపై ఉన్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.
మెడలో పాము: శివుడు పూలు లేదా నగలు ధరించడు. కానీ పామును మాత్రం మెడలో వేసుకుని ఉంటారు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకిగా పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్తుకు సూచికగా పరిగణిస్తారు. పాము తమోగుణ ధోరణులకు ప్రతీక. శివుని మెడలో ఉండటం వల్ల తమోగుణ ధోరణులు శివుని ఆధీనంలో ఉన్నాయని చూపిస్తుంది.
మూడవ కన్ను: శివునికి మూడు కళ్ళు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన మూడవ కన్ను తెరుచుకుంటుందని, మూడవ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని పండితులు చెబుతుంటారు. సాధారణ పరిస్థితులలో శివుని మూడవ కన్ను అంతరాత్మ రూపంలో మెలకువగా ఉంటుందట. శివుని మూడవ కన్ను జ్ఞానం, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెబుతారు. శివుని మూడవ కన్ను పంచేంద్రియాలకు మించిన దృష్టిని అందిస్తుంది. అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు.
త్రిశూలం: శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకుని ఉంటాడు. శివుని త్రిశూలంలో రాజసిక, సాత్విక, తామసిక అనే మూడు గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు.
చేతిలో ఢమరుకం: ఢమరుకం నాదం వినిపించగానే పరమశివుడు తాండవం ఆరంభిస్తాడని పురాణాలు చెబుతాయి. అయితే ఆ తాండవం ఎల్లప్పుడూ విధ్వంసానికే సంకేతం కాదు. శివుని తాండవం సృష్టి, స్థితి, లయం అనే విశ్వ చక్రాన్ని సూచిస్తుంది. అధర్మం పెరిగినప్పుడు, కాలచక్రం పూర్తైనప్పుడు జరిగే లయకార్యానికి కూడా శివతాండవమే ప్రతీకగా భావిస్తారు.
రుద్రాక్ష: శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెబుతారు. శివుడు తన మెడ, చేతులలో రుద్రాక్షను ధరిస్తారు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు చిహ్నం.
గంగ: శివుని జటాజూటంలో గంగమ్మ తల్లి ఉంటుంది. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చినప్పుడు శివుడు ఆయన జటాజూటంలో బంధించారని చెబుతారు. శివుని జడలో ఉండే గంగదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు.
పులి చర్మం: పులిని శక్తికి, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తాడు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు అని చెబుతారు. అంతేకాదు పులిచర్మం నిర్భయత, సంకల్పానికి చిహ్నంగా చెబుతారు.
నంది: నంది శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయం బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది నాలుగు పాదాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి.
భస్మం: శివుడు తన శరీరం పై భస్మాన్ని రాసుకుంటాడు. ప్రతి జీవి ఒక రోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని ఇస్తుంది.

Yogini Ekadashi - యోగినీ ఏకాదశి
యోగినీ ఏకాదశి
ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ ధర్మంలో, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున ఉపవాసం పాటించి, నియమ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేయడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు. భక్తులు ఉపవాసం పాటించి, జీవితంలో సకల సంతోషాలు, సంపదలు మరియు శ్రేయస్సు పొందగలిగే ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజిస్తారు.ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది.
యోగినీ ఏకాదశి కథ
కుబేరుడు పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు. హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకు రాకపోయేసరికి అసహనం కలిగింది. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. తిరిగొచ్చి సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశించాడు కుబేరుడు.
కుబేరుడి శాపం
నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించు అని శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇన్నాళ్లుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలంవల్ల హేమమాలికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. జరిగిన విషయం మొత్తం రుషికి వివరించి శాపవిమోచనం చెప్పమని అర్థించాడు. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావని సెలవిచ్చారు మార్కండేయ రుషి. అలా జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి మనసులో దైవాన్ని ప్రార్థించి శాపవిమోచనాన్ని సాధించాడు హేమమాలి.
ఎవరైతే యోగినీ ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారు పాపకర్మల నుంచి విమోచనం పొందుతారని శ్రీ కృష్ణుడు వివరించాడు. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు. జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసుని అదుపుచేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. యోగినీ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తయ్యేలోగా దానధర్మాలు చేసి భోజనం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందంతో పాటూ ఇంట్లో సానుకూల శక్తి, వుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి.
ప్రయోజనాలు
యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన అన్ని పాపాలను ప్రక్షాళన చేయవచ్చు మరియు ప్రస్తుత జీవితంలో అన్ని విలాసాలను అందిస్తుంది. యోగిని ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత స్వర్గ లోకానికి చేరుకోవచ్చు. యోగినీ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానమని నమ్ముతారు.

Subscribe to:
Posts (Atom)
Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...