కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతి పాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. భయంకర ఆకారంతో, తంత్ర శాస్త్రంలో కాళి ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
దశ మహావిద్యలలో అత్యంత ముఖ్యమైన దేవత కాళికాదేవి. తాంత్రికులకు ఆమె ఇష్టదేవత. తంత్రమున ఎందరు దేవతలు ఉన్నా కాళీమాతకు ప్రత్యేకస్థానం ఉన్నది. ఎందుకంటే కాళీ ఉపాసనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాళీ ఉపాసన అతిశీఘ్ర ఫలదాయిని. అతిప్రాచీన కాలం నుంచి మన దేశంలో పరంపరగావస్తున్నది. ఒక జీవితకాలం పట్టే సాధనను కాళీమాత కొన్ని నెలలలో ఇవ్వగలదు. కానీ ఈ సాధన అందరూ చె య్యులే రు. ఇది చాలా కష్టమైన సాధన అని చెబుతారు.
చైతన్య దీపిక కాళిక
పార్వతీదేవి ఉగ్ర రూపమే కాళికా దేవి. ఈమె సృష్టి చైతన్యానికి రూపం. కాల స్వరూపం. కాలం ఎప్పుడూ గతిశీలమే. అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది చైతన్యానికి ప్రతీక. ఆ చైతన్యమే కాళిక. అన్ని వర్ణాలనూ తనలో నింపుకున్న కాళ రాత్రి ఈమె వర్ణం.
కాళీమాత అవతరణ
ఈమె అవతరణని గురించి వేదములలో, దేవి భాగవతంలో, పురాణములలో ఎన్నో కధలు న్నాయి. సృష్టి ఆరంభంలో మహావిష్ణు నాభి కమలం నుంచి బ్రహ్మ ఉదయించాడట. విష్ణువు నిద్రావశుడై ఉండగా ఆయన చెవిలోంచి పుట్టిన = మధుకైటభ రాక్షసులు (బ్రహ్మను బాధించడం మొదలుపెట్టారు. వారినేమీ చేయలేక విష్ణువును లేపడానికి ప్రయత్నించి విఫలుడై మహామాయను, కాల స్వరూపిణి అయిన కాళిని స్తుతించగా ఆమె అవతరించి విష్ణువుని లేపి, రాక్షసులని సంహరించడానికి శక్తి నిచ్చింది అంటారు.
సమస్త విద్యలకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ మేర్పడింది. అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాల లోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకొనేటప్పుడు అగ్నితో సమానమైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభవిస్తారు.
కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్శశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. దశమహావిద్యలలో ఈమె ప్రధాన దేవతగా కొలుస్తారు. కాళీ జ్ఞాన శక్తికి, క్రియాశక్తికి, ఆదిమాతగా చెబుతారు.
నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీ మాతయే సృష్టించిందని చెప్పబడివుంది. నిరుత్తర తంత్రం, పిచ్చిల తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా పేర్మొంటాయి. బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించినా ఈమె కారుణ్యమూర్తి. ఎందరో మహా సాధువులు, సన్యాసులు కాళీ మాతను సేవించి కైవల్య ప్రాప్తినొందారు. వారిలో మనందరకు సుపరిచితమైన శ్రీ రామకృష్ణ పరమహంస ప్రముఖులు.
ఒకనాడు భూమిపైన పాప సంచయం బాగా పెరిగిపోయింది. భగవన్నామ స్మరణ, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి, ప్రజలు అరిషడ్వర్గాలకు లోనై స్వేచ్చగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండాపోయింది. దీంతో ఆగ్రహించిన కాళీమాత ఉగ్రంగా నాట్యం చేయనారభించింది. దీంతో లోకాలన్ని కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీమాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవుణ్ణి చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీ మాత మహాదేవుడిపై తన పాదాలను ఉంచినట్టు కనిపిస్తుంటుంది. అంటే అమ్మ ఆగ్రహాన్ని శాంతపరచడానికి మహా శివుడు చిదానందుడై అచేతన స్థితిలో ఆమె కాలికింద పడుకుని ఉంటాడు. స్వామి చర్యను చూసిన కాళిక అచ్చెరువుతో నాలుక తెరచి ఉంటుంది.
కాళి ఎనిమిది రూపాలు
కొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల యొక్క వర్ణన ఉన్నది. ఇవే ఆ కాళీ మాత యొక్క ఎనిమిది రూపాలు.
1. దక్షిణ కాళిక,
2. సిద్ధ కాళిక,
3. గుహ్య కాళిక,
4. శ్రీ కాళిక
5. భద్ర కాళిక,
6. చాముండా కాళిక,
7. శ్మశాన కాళిక,
8. మహాకాళిక.
మంత్ర మహార్గవం ప్రకారం ఆదిశక్తి
కాళీ మాత సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్మరించింది. అందుకే కాళీ మంత్రాలలో ( అనేక బేధాలు ఉన్నాయి. బ్రహ్మ స్వరూపమైన కాళీని ఆదిశక్తి అని చెబుతుంది మంత్ర మహార్ణవము. మొదట్లో దక్షిణ భైరవుడు కాళీ మాతను
పూజించి ఉపాసన చేసినందువలన ఈమె దక్షిణ కాళిక అని పిలవబడుచున్నది. మార్మండేయ మహా పురాణంలో ఈ కాళిని నిత్య అనే పేరు పిలువబడినది. ఈమె అవసరాన్ని బట్టి అనేక రూపములలో మనుషులకు, దేవతలకు, రాక్షసులకు శుభములు చేకూరుస్తూ వుంటుంది.
నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీ మాతయే సృష్టించిందని చెప్పబడివుంది. నిరుత్తర తంత్రం, పిచ్చిల తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా పేర్మొంటాయి. బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించినా ఈమె కారుణ్యమూర్తి. ఎందరో మహా సాధువులు, సన్యాసులు కాళీ మాతను సేవించి కైవల్య ప్రాప్తినొందారు. వారిలో మనందరకు సుపరిచితమైన శ్రీ రామకృష్ణ పరమహంస ప్రముఖులు.
ఒకనాడు భూమిపైన పాప సంచయం బాగా పెరిగిపోయింది. భగవన్నామ స్మరణ, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి, ప్రజలు అరిషడ్వర్గాలకు లోనై స్వేచ్చగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండాపోయింది. దీంతో ఆగ్రహించిన కాళీమాత ఉగ్రంగా నాట్యం చేయనారభించింది. దీంతో లోకాలన్ని కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీమాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవుణ్ణి చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీ మాత మహాదేవుడిపై తన పాదాలను ఉంచినట్టు కనిపిస్తుంటుంది. అంటే అమ్మ ఆగ్రహాన్ని శాంతపరచడానికి మహా శివుడు చిదానందుడై అచేతన స్థితిలో ఆమె కాలికింద పడుకుని ఉంటాడు. స్వామి చర్యను చూసిన కాళిక అచ్చెరువుతో నాలుక తెరచి ఉంటుంది.
కాళి ఎనిమిది రూపాలు
కొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల యొక్క వర్ణన ఉన్నది. ఇవే ఆ కాళీ మాత యొక్క ఎనిమిది రూపాలు.
1. దక్షిణ కాళిక,
2. సిద్ధ కాళిక,
3. గుహ్య కాళిక,
4. శ్రీ కాళిక
5. భద్ర కాళిక,
6. చాముండా కాళిక,
7. శ్మశాన కాళిక,
8. మహాకాళిక.
మంత్ర మహార్గవం ప్రకారం ఆదిశక్తి
కాళీ మాత సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్మరించింది. అందుకే కాళీ మంత్రాలలో ( అనేక బేధాలు ఉన్నాయి. బ్రహ్మ స్వరూపమైన కాళీని ఆదిశక్తి అని చెబుతుంది మంత్ర మహార్ణవము. మొదట్లో దక్షిణ భైరవుడు కాళీ మాతను
పూజించి ఉపాసన చేసినందువలన ఈమె దక్షిణ కాళిక అని పిలవబడుచున్నది. మార్మండేయ మహా పురాణంలో ఈ కాళిని నిత్య అనే పేరు పిలువబడినది. ఈమె అవసరాన్ని బట్టి అనేక రూపములలో మనుషులకు, దేవతలకు, రాక్షసులకు శుభములు చేకూరుస్తూ వుంటుంది.
మహాకాలుని వలనే మహాకాళి కూడా సృష్టి వినాశనమును, సృష్టి సంహరమును అంత్యకాలము నందు చేసే మహా రుద్ర రూపిణి. కాలం నుంచే పదార్ధము పుట్టి, మరలా ఆ కాలంలోనే ఈ పదార్ధము అంతా కలిసిపోతుంది. ప్రళయాంతమున జరిగే మహా ప్రళయమునకు ప్రత్యక్ష సాక్షి ఈ మహా కాళి,
కాళీమాత నడుము చుట్టూ మానవ ఖండిత కరములు చుట్టుకుని ఉంటుంది. అంటే తాను కనపడకుండా మానవుల చేతులతో తాను పని చేయిస్తూ ఉంటాను అన్న సిద్ధాంతానికి ప్రతీకగా విషయాన్ని చెబుతారు.
శ్లో: జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ ।
దుర్గాక్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే ॥
మనిషికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో భయం మరియు సంశయం ఎక్కువ, ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీ మాత.
కాళికగా జననం
దారుకుని వధించడానికి దుర్గాదేవి నుదుటి నుండి క్రోధజ్వాలయై కాళిక జన్మించిందని, రక్తబీజుడనే రాక్షసుని సంహరించడానికి భయంకర రూపిణియై అవతరించిందనీ, దేవి పురాణం, మార్మండేయ పురాణాలలోని కథలు చెబుతున్నాయి.
కాళికాదేవి నల్లని రూపం తమోగుణానికి ప్రతీక. ఒకచేతిలో ఆమె ఖండించిన అసురుని తల, ఖడ్గం, వరద అభయ హస్తాలతో ఉంటుంది. అమ్మ శ్మశానంలో నర్తిస్తుంది. కాలం అంటే వినాశం అనే అర్ధం కూడా ఉంది. ఆ వినాశం అనివార్యమైనది. సృష్టించబడిన ప్రతి వస్తువూ నశించక తప్పదు. సృష్టించిన దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునే శక్తి కాళిక. ఆమె మహాకాలుని స్రీ రూపం. ఆమె మెడలోని పుర్రెలదండ దుష్టులను భయపెడుతుంది. ఆ దండలోని పుర్రెలు 22 బీజాక్షరాలకి ప్రతీకలని అంటారు.
కాళికాదేవి రూపాలు ఎన్ని?
కాళికాదేవి దక్షిణ కాళి, వామ దేవి అనే రెండు ప్రధాన రూపాలు ఉన్నాయి. బృహన్నీలా తంత్రం ప్రకారం కాళికా దేవి రక్తవర్ణంతో సుందర రూపంలోనూ, కృష్ణ వర్ణం (నలుపు) తో భయంకర రూపంతోనూ ఉంటుంది. భద్రకాళీ రూపం భక్తులకు రక్షగా ఉంటుంది.
కాళికా దేవి విద్యాదాయిని. నీల కంఠుడు మహాకవి కాళి దాసుగా అయినాడంటే అది అమ్మదయే. కాళికా దేవి మన లోని జాడ్యాలను భయాలను తొలగించి, చైతన్యాన్ని ఇస్తుంది. శత్రువుల నుంచీ, దుష్ట పీడల నుంచీ కాపాడుతుంది. అఖండమైన విద్యాప్రాప్తిని ప్రసాదిస్తుంది.
కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రివాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒకసారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. ప్రేమ అనేది ఒక అపు రూపమైన తత్వం. తిట్టుకున్న కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.
కాళికారూపం భయం గోలిపేదిగా ఉంటుంది. కాని తత్త్వం తెలుసు కుంటే భయం ఉండదు. కాళీదర్శనం కలిగితే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. కాళికా వరప్రసాదికి అసాధ్యం అనేది ముల్లోకాలలో లేనేలేదు. అతని ఆజ్ఞను పంచభూతాలు తలదాల్చవలసిందే.
భయంకరమైన కాళీరూపాలు కూడా చాలా ఉన్నాయి. అవి చూచి సామాన్య సాధకులు తట్టుకోలేరు. కాళీమాత రూపాలు ఒకటి కాదు. అనేకం ఉన్నాయి. భద్రకాళి, శ్మశానకాళి, కరాళకాళి, మహాకాళి ... ఇలా చాలారూపాలు ఉన్నాయి. వాటిలో శ్మశానకాళి రూపం అత్యంత భయానకం. కాని మహాకాళి అలా కాదు. ఆమె రూపం అత్యంత మనోహరంగా ఉండి మాతృత్వ భావనను కలిగిస్తుంది. మన సొంత తల్లిని కొన్ని ఏళ్ళ తరువాత చూచినప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమ హృదయంలో పెల్లుబుకుతుంది. కారణం ఆమె ప్రపంచానికే తల్లి. ఆది శక్తి దేవతలకు మానవులకు సమస్త జీవకోటికి చరాచర సమస్త సృష్టికి మాత.
కాళి రూపం చిత్రకారుని ఊహ కాదు
కాళి సామాన్యంగా నాలుగు చేతులు కలిగి ఉంటుంది. నూరు చేతుల రూపం కూడా ఉన్న ప్పటికీ సామాన్యంగా మనం చూచే రూపం మాత్రం ఇదే. ఒక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో ఖండిత శిరస్సు, మిగిలిన రెండు చేతులలో వరద అభయ ముద్రలు దాల్చి అచేతనుడైన శివునిపైన నిలబడి ఉన్నట్లు మనం సాధారణంగా కనబడే చిత్రాలలో చూస్తాము. ఇది చిత్రకారుని ఊహకాదు. సాధకులకు దర్శనం ఇచ్చే దేవతా స్వరూపం కూడా ఇలాగే ఉంటుంది అంటారు. ఆ రూపం చిత్రం కంటే ఎన్నోరెట్లు జీవంతో ఉంటుంది. ఆకారం భయానకమే. కాని ఈ భయంకర రూపం రాక్షస ప్రవృత్తి కలవారికే పరిమితం. ఆమె బిడ్డలకు కాదు. బిడ్డకు తల్లి కోపంగా ఉన్నా భయం కలుగదు. ఆ తల్లి కోపం తనలోని అసుర ప్రవృత్తి పైనే గాని తన పైన కాదు అన్న సత్యం తెలిస్తే భయం ఆ అమ్మవారిపై ఉన్న భయం పటాపంచలౌతుంది.
మన దేవతల విగ్రహాలు చిత్రాలు, చిత్రకారుని ఊహలు కావు. అవి మార్మికభాషా సంకేతాలు అని చెబుతారు. అంటే గొప్ప భావాన్ని దృశ్య రూపంగా చెప్పటం. ఈ దృశ్య రూపంకంటే బాగా చెప్పటం,
కవితాత్మకంగా చెప్పటం సాధ్యం కాదు అని భావన.
కవితాత్మకంగా చెప్పటం సాధ్యం కాదు అని భావన.
శివుడు అనగా సృష్టికి ముందు ఉన్నటు వంటి అఖండ నిరాకాల నిశ్చల పరతత్త్వం. అట్టి నిశ్చల తత్వమున కదలిక వచ్చి సృష్టి జరిగింది. ఆ కదలికే శక్తి ఆ శక్తికే కాళి అని పేరు. అచేతనంగా పడి ఉన్న శివుడు సృష్టికి మూలము ఆధారము అయిన పరమాత్మ, ఆ పరమాత్ముని ఆధారంగా శక్తి సృష్టిస్థితి లయలు చేస్తున్నది. అనగా అచేతన బ్రహ్మము పైన చేతనాత్మక శక్తి నాట్యం చేస్తున్నది. దీనినే శివునిపైన శక్తి నిలిచి ఉన్న చిత్రంగా చూపుతారు.
సాధకుడు ఇంద్రియాతీతుడై సమాధి అవస్థలో ప్రవేశించినపుడు దేహస్పృహ కోల్పోతాడు. అపుడు శవం మాదిరిగా అచేతనుడై పడి ఉంటాడు. కాని ఆ అచేతనునిలో ఆద్యాశక్తి కుండలీరూపంలో జాగ్భతమై ఉంటుంది. కదలిక లేక సమాధి అవస్థలో ఉన్న సాధకునిలో మహాశక్తి జాగృతం అయి ఉంటుంది. ఈ శక్తి అతనిలోని రాక్షసత్వాన్ని ఒకే దెబ్బతో అంతం చేస్తుంది. అతనికి వరద అభయశక్తిగా నిలిచి రక్షిస్తుంది. ఆ జాగ్భత శక్తి ముందు ఏ రాక్షస ప్రవృత్తులూ నిలువలేవు. చావు లేని రక్తబీజుడైనా సరే ఈ శక్తిముందు అంతం కావలసిందే.
మనిషి తనలోని పశు ప్రవృత్తి రాక్షసప్రవృత్తి పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు. కాని అవి సఫలం కావు. పూర్తిగా కళ్లు తెరిచిన జాగ్భత కుండలినీ శక్తి మాత్రమే ఈ పని ఒక్క క్షణంలో చెయ్య గలుగుతుంది. కాళి నిరంతరం జరుగుతున్న భాహ్యసృష్టి ప్రక్రియకు సజీవ రూపం. ఇంకొక రకంగా సాధకుని ఆంతరిక సాధనా లో గే అం ప్రక్రియకు ప్రతి రూపం. ఈ తాః నకరాలు ౦ విధంగా బాహ్య ఆంతరిక భూమికలలో నిరంతరం ఆమె లీల జరుగుతూనే ఉంటుంది. కాళీ అనుగ్రహం పొందగలిగితే అట్టి వాని జన్మలో ఇక అందుకోవలసిన శిఖరాలు ఉండవు. ఆమె సర్వ శక్తిమయి. పరబ్రహ్మ మహిషి అని దేవీ భాగవతం స్తుతించింది. సమస్త లోకాలు భువనాలు ఆశక్తి ఆటలు, లీలా విలాసాలు. సమస్త అవతారాలు, దేవతలు ఆమె బిడ్డలు. ఆ శక్తిలోనే పుట్టి పెరిగి లయిస్తుంటారు. కాళీశక్తికి అతీతంగా ఏదీ లేదు, ఎవరూ లేరు. ఇదే కాళీ తత్త్వం.
కాళి కాల రూపంలో ఉన్న ఈశ్వర శక్తి. తాంత్రికుల దృష్టిలో, యావత్ ప్రపంచము, ఒక మహా శ్శశానము. కాళి, కాల గమనములోని అనంతమైన కదలికలను, అనంత వేగముతో తన సునిశితమైన నాట్య భంగిమలతో వ్యక్తము చేయును. ఆమె సర్వమును కబళించు నిర్ధాక్షిణ్య మారణ ప్రక్రియకు సంకేతము.
వివిధ రూపాలలో ఆరాధన
శాక్తేయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే దేవిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు.
ఛాందోగ్యోపనిషత్తులో పేర్కొనబడిన సంవర్గ, ప్రాణవిద్యల ఆధారంగా కాళీ ఉపాసన జరుగుతుంది. దేవతలలోని వాయువు, మానవులలోని ప్రాణము అనునవి రెండునూ ముఖ్యమైన సంవర్గములు. ఇవియే సకల ప్రాణికోటికి చైతన్య శక్తిని ఇచ్చునవి. ఈ ప్రాణవాయువు యొక్క వైశ్విక చైతన్య శక్తినే తాంత్రికులు “కాళి” గా ఉపాసిస్తారు.
కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించవచ్చు. లోకంలో ఇది అసాధ్యం, జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి. ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అను గ్రహంతో కాలగతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మీభూతం అవుతుంది. అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది. మహా కాళీ శక్తికి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు.
కాళీమాతకు, కుండలినీశక్తికి సంబంధం ఉంది. ఎలాగంటే, ఆద్యా శక్తియే ప్రతి మనిషిలోనూ కుండలినీ రూపంలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. సూక్ష్మభూమికలను చూడగలిగే శక్తిలేక పోవటమే “నిద్రాణ స్థితి” అంటే. కాళీమంత్ర సాధకులకు కుండలినీ జాగరణ దానంతట అదే సులభంగా జరుగుతుంది. కాళీమంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది. నిద్రాణంలో ఉన్న కుండలినీ శక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది.
కాళీమాత మేడలో పుర్రెల దండ ఉంటుంది. ఈ పుర్రెలు తంత్ర శాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్ర విజ్ఞానం ప్రకారం ఇవి సంసృతం లోని ఏభై అక్షరాలతో సమం. ఈ పుర్రెలదండను వర్ణ మాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు. అక్షరములు అనే మాటలో అద్భుతమైన అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు. మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు. కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు. కనుక వాటికి నాశనం లేదు.
కాళీమాత మేడలో పుర్రెల దండ ఉంటుంది. ఈ పుర్రెలు తంత్ర శాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్ర విజ్ఞానం ప్రకారం ఇవి సంసృతం లోని ఏభై అక్షరాలతో సమం. ఈ పుర్రెలదండను వర్ణ మాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు. అక్షరములు అనే మాటలో అద్భుతమైన అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు. మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు. కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు. కనుక వాటికి నాశనం లేదు.
పుర్రెలను మెడలో ఎందుకు ధరిస్తుంది?
పుర్రెలు శాశ్వతత్వానికి సూచన. మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి. మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి. కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.
మాత సర్వ మంత్ర స్వరూపిణి
పుర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది. ఏభై అక్షరాలు షట్ చక్రాలలోని ఏభై దళాలలో ఉంటాయి. కుండలినీ సాధన చేసేవారికి వీటి గురించి వివరాలు పరిచితమే. మూలాధార పద్మం 4 దళములు. స్వాధిష్టాన పద్మం 6 దళములు, మణిపూరక పద్మం 10 దళములు, అనాహత పద్మం 12 దళములు, విశుద్ధ పద్మం 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం 2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు, 50 స్పందనలుగా ఉంటాయి. సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే. కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్ర మయి. సర్వ మంత్ర స్వరూపిణి.
నేటికీ ఉజ్జయినిలో కాళీ సాధకులు
కాళికా ఉపాసన ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో అధికంగా ఉంది. వంగ దేశం ఈ దేవతకు ప్రధాన ఆవాస స్థానం. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో కాళీ ఉపాసన అనేక రహస్య మార్గాలలో చేసేవారు ఎందరో సాధకులు ఉన్నట్లు చెబుతారు.
శరీరమందు నిరంతరము ప్రవహించుచు, జీవయాత్రను నిర్వహించుచున్న ఈ ప్రాణవాయువు, ప్రతి కదలికలోనూ ఏకాగ్రతను కల్పించి, చాంచల్యములేని మనస్సుతో మాతను కొలిచేవారిని కాళి ఎప్పుడూ రక్షించును. ఉచ్చ్వాస-నిశ్వాస గతులను అనుసరించుచూ, శ్వాస మూలమును పొందుచూ, ప్రాణాన్ని ఉపాశించువాడు కాళీప్రసాద పాత్రుడు కాగలడు.
No comments:
Post a Comment