“కల్యాణ గౌరీ నోము పట్టన కాంతకు నిత్యకళ్యాణం పచ్చ తోరణమని”
చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.
ప్రతిదినము నొక పేరంటాలికి “నీవే నా పాలిట పార్వతీదేవివని చెప్పి తలదువ్వి బొట్టుపెట్టి పంపుచూ యొక యేడాది యిట్లు నోచవలెను. యేడాది లోపుగాని, తరువాత గాని ఉద్యాపనము చేసుకోవలెను.
ఉద్యాపనము: పెండ్లి యగుచున్న పిల్లలకు మంగళసూత్రధారణమై పెండ్లి కూతురు పీటమీద నుండి లేచినవెంటనే ఈ క్రింది చెప్పిన రీతిని వాయన మీయవలెను. ఒక పళ్ళెరములో చిర, రవిక, మట్టెలు, మంగళసూత్రములు(బొడ్డిపుస్తెలు), పువ్వుల దండలు, అత్తరువు, పన్నీరు, గంధము, కుంకుమ, పసుపు, ఉంచుకొని ఆ పళ్ళెరము సహితముగా పెండ్లకూతురుకు వాయన మీయవలెను.

No comments:
Post a Comment