సహస్ర ఫలాల నోము కథ
"సహస్ర ఫలాలు నోచిన చాలపుణ్యము. వర్ణించుటకు సహస్ర కరములు ఆదిశేషునకైనా అలవిగాదు. “ఎల్లకాలము చేసెడి నోము ఏమిటయ్యా!” అని పార్వతి శివునడుగుగా-“ఎల్ల కాలము చేసెడినోము సహస్ర ఫలాలనోమే పార్వతీ! ఈ నోము నోచిన భామలమీద నీకుదయ నాకుదయ, విష్ణునకుదయ, లక్ష్మికిదయ, బ్రహ్మకుదయ, సరస్వతికిదయ చంద్రునకుదయ, సూర్యునకుదయ, ముక్కోటి దేవతలకు దయ మూడులోకాలకుదయ ఈనోము నోచినవారి, కెల్లకోరికలుతీరి, ఇహపరము వారి దేయగునే పార్వతీ!” యని పరమేశ్వరుడు చెప్పినాడుట.
ఈ పాట పాడుకొని అక్షింతలు వేసుకొనవలెను.
ఉద్యాపనము: ఒక్కొక్క పండుదినుసుకు వేయి చెప్పున వేయిదినుసుల పండ్లు వానివానికి తగిన దక్షిణలతో బ్రాహ్మణ దంపతులకు దానమీయవలయును. ఏ కాలములో దొరికేపండ్లా కాలములో చేసికోవచ్చును. ఇచ్చినవారి కీయకుండా వేయిదినుసులు వేయిమంది బ్రాహ్మణదంపతులకు ఈయవలెను భక్తితప్పకున్న ఫలము తప్పదు.
No comments:
Post a Comment